Prophetic Hadeeth Encyclopedia
Search and read verified Prophetic hadeeth translations, explanations, benefits, categories and source attribution. Page 38.
Search the Hadeeth Encyclopedia
Smart instant results tolerate minor spelling mistakes, with every filter in one place.
“మూడు రకాల వ్యక్తులతో అల్లాహ్ పునరుత్థాన దినమున మాట్లాడడు, వారిని శుద్ధి చేయడు, మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది
సల్మాన్ అల్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మూడు రకాల వ్యక్తులతో అల్లాహ్ పునరుత్థాన దినమున మాట్లాడడు, వారిని శుద్ధి చేయడు, మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది: వృద్ధుడైన వ్యక్తి వ్యభిచారానికి పాల్బడినట్లైతే, పేదవాడై…
“మీ సంతానము కంటే, మీ తల్లిదండ్రుల కంటే మరియు ప్రజలందరి కంటే నేను మీకు అత్యంత ప్రియమైన వాడిని కానంతవరకు మీరు పరిపూర్ణ (Perfect) విశ్వాసాన్ని పొందజాలరు.”
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సంతానము కంటే, మీ…
గాలిని దూషించకండి (తిట్టకండి). మీకు ఇష్టము లేని గాలి (ఉదాహరణకు — బలమైన తుఫాను, గాలి దుమారము వంటిది) చూస్తే, ఇలా వేడుకోండి: ‘ఓ అల్లాహ్! ఈ గాలిలో ఉన్న మంచి కోసం, అది తీసుకొచ్చే మంచి కోసం, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన మంచి కోసం మేము నిన్ను వేడు కుంటున్నాము. ఈ గాలిలో ఉన్న దుష్టత (చెడుల) నుండి, అది తీసుకొచ్చే చెడు నుండి, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన చెడు నుండి మేము నీ శరణు వేడు కుంటున్నాము
ఉబయ్యి బిన్ కఅబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "గాలిని దూషించకండి (తిట్టకండి). మీకు ఇష్టము లేని గాలి (ఉదాహరణకు — బలమైన తుఫాను, గాలి దుమారము వంటిది) చూస్తే, ఇలా వేడుకోండి: ‘ఓ అల్లాహ్! ఈ గాలిలో ఉన్న మంచి కోసం, అది తీసుకొచ్చే…
మీలో ఎవ్వరూ ఇలా పలకవద్దు: ‘ఓ అల్లాహ్! నీ ఇష్టం ఉంటే నన్ను క్షమించు, నీకు ఇష్టం ఉంటే నా మీద కరుణ చూపు, నీకు ఇష్టం ఉంటే నాకు అన్నపానీయాలు (రిజ్క్) ఇవ్వు’ అని. బదులుగా, తన కోరికను కోరడంలో దృఢంగా అడగాలి. నిజంగా, అల్లాహ్ తాను కోరినదాన్ని చేస్తాడు, ఆయనను ఎవరూ బలవంతం చేయలేరు (ఆయన తన పని గురించి ఎవరితోనూ ఇబ్బంది పడడు)
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీలో ఎవ్వరూ ఇలా పలకవద్దు: ‘ఓ అల్లాహ్! నీ ఇష్టం ఉంటే నన్ను క్షమించు, నీకు ఇష్టం ఉంటే నా మీద కరుణ చూపు, నీకు ఇష్టం ఉంటే నాకు అన్నపానీయాలు (రిజ్క్) ఇవ్వు’ అని. బదులుగా, తన కోరికను కోరడంలో…
“ఎవరైతే శకునాల కొరకు చూస్తాడో లేదా తన కొరకు ఏవైనా శకునాల భావార్థాన్ని (వ్యాఖ్యానాన్ని, తాత్పర్యాన్ని) తెలుసు కోవాలనుకుంటాడో; లేదా ఎవరైతే జోస్యము చెబుతాడో లేదా తన కొరకు జోస్యము చెప్పించుకుంటాడో; లేదా ఎవరైతే చేతబడి చేస్తాడో, లేక చేతబడి చేయిస్తాడో; అలాంటి వాడు మాలోని వాడు కాడు
ఇమ్రాన్ ఇబ్న్ హుసేన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే శకునాల కొరకు చూస్తాడో లేదా తన కొరకు ఏవైనా శకునాల భావార్థాన్ని (వ్యాఖ్యానాన్ని, తాత్పర్యాన్ని) తెలుసు కోవాలనుకుంటాడో; లేదా ఎవరైతే జోస్యము చెబుతాడో లేదా తన కొరకు జ…
“ఏదైనా విషయం గురించి ప్రశ్నించడానికి ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళతారో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తారో – నలభై దినముల పాటు అతని నమాజులు స్వీకరించబడవు.”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో కొందరు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: (సహీహ్ ముస్లింలోని ఇదే హదీసులో హఫ్సహ్ బింత్ ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖించినట్లుగా పేర్కొనబడింది): “ఏదైనా విషయం గురించి ప్రశ్నించడానికి ఎవర…
“ఎవరైతే నక్షత్ర గమనాల ద్వారా (గ్రహాల గమనాల ద్వారా) భవిష్యత్తు గురించి చెప్పే విద్యను నేర్చుకుంటే, అతడు చేతబడి (భూతవైద్యం, మంత్రతంత్రాల విద్య) లో ఒక భాగం (ఒక శాఖను) నేర్చుకున్నట్లే. అతడు ఎంత కాలం ఆ విద్యను గడించితే అంత ఎక్కువగా దానిని పొందినట్లే.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే నక్షత్ర గమనాల ద్వారా (గ్రహాల గమనాల ద్వారా) భవిష్యత్తు గురించి చెప్పే విద్యను నేర్చుకుంటే, అతడు చేతబడి (భూతవైద్యం, మంత్రతంత్రాల విద్య) లో ఒక భాగం (ఒక శాఖను)…
నా ప్రస్తావన అతడి ముందుకు వచ్చినప్పుడు, నాపై దరుద్ పంపని వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక! అతడు రమదాన్ నెలలో ప్రవేశించిన తరువాత, తను క్షమించబడకుండానే అది గడిచి పోయిన వ్యక్తి ముక్కుమీద మట్టి కొట్టుకు పోవుగాక! అతడి తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నా, వారు అతడిని స్వర్గంలో ప్రవేశింపజేయకపోతే (వారికి సేవలు చేయడం ద్వారా పుణ్యాలు సంపాదించి స్వర్గంలో ప్రవేశం పొందలేకపోయిన), ఆ వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక!
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నా ప్రస్తావన అతడి ముందుకు వచ్చినప్పుడు, నాపై దరుద్ పంపని వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక! అతడు రమదాన్ నెలలో ప్రవేశించిన తరువాత, తను క్షమించబడకుండానే అది గడిచి పోయిన వ్యక్తి ము…
ఎవరైతే ఎడతెరపి లేకుండా ఉపవాసం పాటిస్తారో, వారి ఉపవాసం లెక్కించ బడదు. నెలలో మూడు రోజులు ఉపవాసం పాటిస్తే, మొత్తం సంవత్సరమంతా ఉపవాసం పాటించినట్టే అవుతుంది
అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నీవు పగలంతా ఉపవాసం పాటించి, రాత్రంతా నమాజ్ చేస్తూ ఉంటావా?" అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. నేను "అవును" అన్నాను. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్ల…
“నీ శరీరంలో ఏభాగములోనైతే నొప్పి పెడుతున్నదో దానిపై నీ చెతిని ఉంచు, తరువాత “బిస్మిల్లాహ్” (అల్లాహ్ నామముతో) అని మూడుసార్లు పఠించు; తరువాత ఏడుసార్లు “అఊదుబిల్లాహి, వ ఖుద్రతిహి మిన్ షర్రిమా అజిదు వ ఉహాదిర్” అని పఠించు” (నేను అనుభవిస్తున్న మరియు భయపడుచున్న చెడు మరియు కీడు నుండి నేను అల్లాహ్ ద్వారా మరియు ఆయన శక్తి ద్వారా శరణు వేడుకుంటున్నాను) అన్నారు
ఉథ్మాన్ ఇబ్న్ అబీ అల్ అథ్’థఖఫీ (రదియల్లాహు అన్హు) తాను ఇస్లాం స్వీకరించిన తరువాత నుండి తన శరీరంలో ఒక భాగంలో కలుగుతున్న నొప్పి యొక్క బాధను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఫిర్యాదు చేసినానని, దానికి రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు అని ఉల్లేఖిస…

