మీకు ప్రసాదించబడుతున్న రెండు కాంతి పుంజముల శుభవార్తను స్వీకరించండి; మీకు ముందు ఏ సందేశహరునికీ ఇవి ఇవ్వబడలేదు: ‘ఫాతిహతుల్ కితాబ్’ (సూరహ్ ఫాతిహా), మరియు సూరహ్ అల్ బఖరహ్ యొక్క చివరి ఆయతులు. దాని నుండి మీరు ఒక్క అక్షరం పఠించినా అది (దాని ప్రతిఫలం) మీకు ఇవ్వబడుతుంది.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “జిబ్రయీల్ అలైహిస్సలాం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉన్నపుడు పైన ‘కిర్రు’ మనే శబ్దం విన్నారు. ఆయన తన తలపైకి ఎత్తి చూసి, ఇలా అన్నారు: “ఇది స్వర్గములోని ఒక ద్వారము; అది ఈ రోజు తెరుచుకున్నది, ఈ రోజు తప్ప…

