افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#5775[ప్రామాణికమైన హదీథు]
HadeethEnc · 1.29.0

మీకు ప్రసాదించబడుతున్న రెండు కాంతి పుంజముల శుభవార్తను స్వీకరించండి; మీకు ముందు ఏ సందేశహరునికీ ఇవి ఇవ్వబడలేదు: ‘ఫాతిహతుల్ కితాబ్’ (సూరహ్ ఫాతిహా), మరియు సూరహ్ అల్ బఖరహ్ యొక్క చివరి ఆయతులు. దాని నుండి మీరు ఒక్క అక్షరం పఠించినా అది (దాని ప్రతిఫలం) మీకు ఇవ్వబడుతుంది.”

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “జిబ్రయీల్ అలైహిస్సలాం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉన్నపుడు పైన ‘కిర్రు’ మనే శబ్దం విన్నారు. ఆయన తన తలపైకి ఎత్తి చూసి, ఇలా అన్నారు: “ఇది స్వర్గములోని ఒక ద్వారము; అది ఈ రోజు తెరుచుకున్నది, ఈ రోజు తప్ప ఇంతకు మునుపు ఎన్నడూ ఆ ద్వారము తెరువబడలేదు”; ఆ ద్వారము నుండి ఒక దైవదూత దిగి వచ్చినాడు. ఆయన (జిబ్రీల్) ఇలా అన్నారు: “ఆయన దైవదూత, ఆ దైవదూత ఈ రోజే భూమిపై దిగివచ్చినాడు, ఈ దినము తప్ప ఇంతకు మునుపు ఎన్నడూ అతడు భూమి మీదకు రాలేదు. అతడు (ఆ దైవదూత) సలాం చేసి ఇలా అన్నాడు: “మీకు ప్రసాదించబడుతున్న రెండు కాంతి పుంజముల శుభవార్తను స్వీకరించండి; మీకు ముందు ఏ సందేశహరునికీ ఇవి ఇవ్వబడలేదు: ‘ఫాతిహతుల్ కితాబ్’ (సూరహ్ ఫాతిహా), మరియు సూరహ్ అల్ బఖరహ్ యొక్క చివరి ఆయతులు. దాని నుండి మీరు ఒక్క అక్షరం పఠించినా అది (దాని ప్రతిఫలం) మీకు ఇవ్వబడుతుంది.”
02

Explanation

జిబ్రయీల్ అలైహిస్సలాం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కూర్చుని ఉన్నపుడు ఆయన స్వర్గము నుండి ఏదో తలుపు తెరువబడున్న శబ్దం విన్నారు. ఆ శబ్దం విని జిబ్రయీల్ అలైహిస్సలాం తన తలను పైకి ఎత్తి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇలా తెలిపినారు – అది స్వర్గములోని ఒక ద్వారము, అది ఈ రోజు తెరువబడినది, ఇంతకు మునుపు ఎప్పుడూ తెరువబడలేదు. ఆ ద్వారము నుండి ఒక దైవదూత భూమి మీదకు దిగివచ్చినాడు. అతడు అంతకు మునుపు ఎన్నడూ భూమి మీదకు దిగిరాలేదు. ఆ దైవదూత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు సలాం చేసి ఇలా పలికినాడు: “నేను మీకు అందజేసిన మరియు మీ కంటే ముందు ఏ ప్రవక్తకూ ఇవ్వబడని రెండు వెలుగుకిరణాల శుభవార్త పట్ల సంతోషించండి. అవి సూరతుల్ ఫాతిహా మరియు సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు ఆయతులు.” అప్పుడు ఆ దైవదూత ఇలా అన్నాడు: ఎవరైనా ఆ రెండింటిలో నుండి ఒక్క అక్షరం పఠించినా, సర్వోన్నతుడైన అల్లాహ్ అతనికి వాటిల్లో ఉన్న మంచిని, దుఆలను, వేడుకోళ్ళను అతనికి ప్రసాదిస్తాడే తప్ప, అలా ప్రసాదించకుండా ఉండడు.
03

Benefits

ఈ హదీథులో సూరతుల్ ఫాతిహ మరియు సూరతుల్ బఖరహ్ యొక్క చివరి ఆయతుల ఘనత తెలియుచున్నది, మరియు వాటిలో ఉన్న విషయాలపై అమలు చేయుటను గురించి హితబోధ, ప్రోత్సాహము ఉన్నది.
అలాగే దీని ద్వారా స్వర్గమునకు ద్వారాలున్నాయని, వాటి ద్వారా దైవిక ఆదేశాలు అవతరిస్తాయని తెలియుచున్నది. అయితే ఆ ద్వారాలు కేవలం అల్లాహ్ ఆదేశంతో మాత్రమే తెరుచుకుంటాయి.
అలాగే ఈ హదీథు తన ప్రభువు వద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గౌరవం గురించిన ఒక ప్రకటన, అల్లాహ్ ఆయనను ఒక హోదాతో సత్కరించారు. ఈ రెండు వెలుగులను ఆయనకు ప్రసాదించాడు. ఆయన తన కంటే ముందు వచ్చిన ప్రవక్తలకు వాటిని ప్రసాదించలేదు.
ప్రజలను అల్లాహ్ వైపుకు పిలిచే విధానాలలో ఒకటి వారికి శుభవార్తలను తెలియజేయడం.

Attribution

[ముస్లిం నమోదు చేసినారు:]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...