“రమజాన్ మాసం వచ్చినపుడు ఉమ్రా చేయి. ఎందుకంటే ఆ మాసములో చేయు ఉమ్రా (పుణ్యఫలములో) హజ్జ్ తో సమానము” అన్నారు.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్సారీలలో ఒక స్త్రీని ఇలా ప్రశ్నించారు; ఇబ్న్ అబ్బాస్ ఆ స్త్రీ పేరు ఏమిటో చెప్పారు, కానీ నేను మర్చిపోయాను; “మాతో పాటు హజ్ చేయుట నుండి నిన్ను ఏ విషయం నిరోధించినది?” ఆమె ఇలా అన్నది “…

