البقرة
Al-Baqarah
The Cow
1 - Al-Baqarah (The Cow) - 001
الٓمٓ
అలిఫ్-లామ్-మీమ్[1]
[1] సూరహ్ (అధ్యాయం) ప్రారంభంలో ప్రస్తావించబడిన ఈ విడి విడి అక్షరాలు ఖున్ఆన్ యొక్క అద్భుత స్వభావాన్ని సూచిస్తున్నాయి. ఇది బహుదైవారాధకుల ముందు పెట్టబడిన ఒక గొప్ప సవాలు, మరియు అరబ్బుల భాషలో ఈ అక్షరాలు ఉన్నప్పటికీ వారు ఈ విడి విడి అక్షరాలు ఇలా ప్రసావించబడటాన్ని వ్యతిరేకించ లేకపోయారు. అరబ్బులు ఆనాటి ప్రజలలో అత్యంత వాగ్ధాటి కలిగి ఉన్నప్పటికీ, వారు వీటికి సమానమైన దానిని తీసుకు రాలేకపోయారు. ఇది ఖుర్ఆన్ అల్లాహ్ నుండి అవతరించబడిన ఒక దివ్యావతరణ అని నిరూపిస్తున్నది.
2 - Al-Baqarah (The Cow) - 002
ذَٰلِكَ ٱلۡكِتَٰبُ لَا رَيۡبَۛ فِيهِۛ هُدٗى لِّلۡمُتَّقِينَ
ఇది (ఈ ఖుర్ఆన్) ఒక దివ్య గ్రంథం; ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. దైవభీతి[1] గలవారికి ఇది మార్గదర్శకత్వము.
[1] అల్-ముత్తఖీను: దైవభీతి గలవారు, అంటే అల్లాహ్ (సు.తా.) యందు భయభక్తులు కలిగి ఆయన (సు.తా.) ఆదేశాలను అనుసరించేవారు.
3 - Al-Baqarah (The Cow) - 003
ٱلَّذِينَ يُؤۡمِنُونَ بِٱلۡغَيۡبِ وَيُقِيمُونَ ٱلصَّلَوٰةَ وَمِمَّا رَزَقۡنَٰهُمۡ يُنفِقُونَ
(వారికి) ఎవరైతే అగోచర యథార్థాన్ని[1] విశ్వసిస్తారో, నమాజ్ను స్థాపిస్తారో[2] మరియు మేము ప్రసాదించిన జీవనోపాధి నుండి (మా మార్గంలో) ఖర్చు చేస్తారో[3];
[1] 'గైబున్: అగోచర యథార్థం, అంటే మానవ ఇంద్రియాలకు మరియు జ్ఞానానికి గోప్యంగా ఉన్న సత్యాలు. అంటే అల్లాహ్ (సు.తా.) ను దైవదూత ('అ.స.)లను, పునరుత్థానదినాన్ని, స్వర్గనరకాలను మొదలైన వాటిని విశ్వసించటం. [2] నమాజ్' స్థాపించడం అంటే, ప్రతిదినము ఐదుసార్లు నిర్ణీత సమయాలలో అల్లాహ్ (సు.తా.), దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) కు నేర్పిన విధంగా నమాజ్' చేయడం. ('స'హీ'హ్ బు'ఖారీ, పు-1, 'హదీస్' నం. 702, 703, 704, 723, 786, 787). [3] ''జకాతున్: అంటే, ఒక సంవత్సరం వరకు జమ ఉన్న, ధన సంపత్తుల నుండి ప్రతి సంవత్సరం, ఒక ప్రత్యేక శాతం విధిగా ఇవ్వవలసిన దానం. ఇది ఇస్లాం ధర్మంలోని ఐదు విధులలో ఒకటి. 'జకాత్, ముస్లిం సమాజపు ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచటానికి, సమాజంలో ఎవ్వడు కూడా నిరాధారంగా లేకుండా ఉండటానికి నియమించబడిన, ఒక ఉత్తమమైన ధార్మిక మరియు సాంఘిక నియమం, ('స'హీ'హ్ బు'ఖారీ, పు. 2, అధ్యాయం-24).
4 - Al-Baqarah (The Cow) - 004
وَٱلَّذِينَ يُؤۡمِنُونَ بِمَآ أُنزِلَ إِلَيۡكَ وَمَآ أُنزِلَ مِن قَبۡلِكَ وَبِٱلۡأٓخِرَةِ هُمۡ يُوقِنُونَ
మరియు ఎవరైతే (ఓ ముహమ్మద్!) నీపై అవతరింప జేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను)[1] మరియు నీకు పూర్వం అవతరింప జేయబడిన వాటినీ (దివ్య గ్రంథాలను) విశ్వసిస్తారో మరియు పరలోక జీవితాన్ని దృఢంగా నమ్ముతారో!
[1] 'అబ్దుల్లాహ్ ఇబ్నె-'ఉమర్ (ర'ది.'అ.) కథనం, మహాప్రవక్త )'స'అస) ప్రవచనం: "ఇస్లాం ఈ ఐదు ప్రధాన సిద్ధాంతాలపై ఆధారపడి ఉంది. అవి: '1. అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు మరియు ము'హమ్మద్ ('స'అస), అల్లాహుతా'ఆలా యొక్క ప్రవక్త అనే దృఢవిశ్వాసం ప్రకటించటం, 2. రోజుకు ఐదుసార్లు విధిగా నమాజ్' చేయటం, 3. విధిదానం ('జకాత్) చెల్లించటం, 4. రమ'దాన్ నెలలో ఉపవాసముండటం, 5. శారీరక మరియు ఆర్థిక స్తోమత ఉంటే జీవితంలో ఒకసారి 'హజ్ చేయటం.' '' ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం-1, 'హదీస్' నెం.7).
5 - Al-Baqarah (The Cow) - 005
أُوْلَـٰٓئِكَ عَلَىٰ هُدٗى مِّن رَّبِّهِمۡۖ وَأُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡمُفۡلِحُونَ
అలాంటి వారే తమ ప్రభువు (చూపిన) సన్మార్గంలో ఉన్నవారు మరియు అలాంటి వారే సాఫల్యం పొందేవారు
6 - Al-Baqarah (The Cow) - 006
إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ سَوَآءٌ عَلَيۡهِمۡ ءَأَنذَرۡتَهُمۡ أَمۡ لَمۡ تُنذِرۡهُمۡ لَا يُؤۡمِنُونَ
నిశ్చయంగా, సత్యతిరస్కారులను (ఓ ముహమ్మద్!) నీవు హెచ్చరించినా, హెచ్చరించక పోయినా ఒకటే, వారు విశ్వసించేవారు కారు.
7 - Al-Baqarah (The Cow) - 007
خَتَمَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمۡ وَعَلَىٰ سَمۡعِهِمۡۖ وَعَلَىٰٓ أَبۡصَٰرِهِمۡ غِشَٰوَةٞۖ وَلَهُمۡ عَذَابٌ عَظِيمٞ
అల్లాహ్ వారి హృదయాల మీద మరియు వారి చెవుల మీద ముద్ర వేశాడు[1]. మరియు వారి కన్నుల మీద తెర పడి ఉన్నది. మరియు వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంది.
[1] ఇది సత్యతిరస్కారానికి ఫలితంగా, అల్లాహుతా'ఆలా బలవంతంగా ఎవరిని కూడా తప్పుదారిలో వేయడు, (చూడండి, 2:26 వ్యాఖ్యానం 1)
8 - Al-Baqarah (The Cow) - 008
وَمِنَ ٱلنَّاسِ مَن يَقُولُ ءَامَنَّا بِٱللَّهِ وَبِٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ وَمَا هُم بِمُؤۡمِنِينَ
మరియు ప్రజలలో కొందరు: "మేము అల్లాహ్ నూ మరియు అంతిమ దినాన్నీ విశ్వసించాము." అని, అనే వారున్నారు. కానీ (వాస్తవానికి) వారు విశ్వసించేవారు కారు
9 - Al-Baqarah (The Cow) - 009
يُخَٰدِعُونَ ٱللَّهَ وَٱلَّذِينَ ءَامَنُواْ وَمَا يَخۡدَعُونَ إِلَّآ أَنفُسَهُمۡ وَمَا يَشۡعُرُونَ
వారు, తాము అల్లాహ్ నూ మరియు విశ్వసించిన వారినీ మోసగిస్తున్నారని (అనుకుంటున్నారు); కానీ వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మోసగించటం లేదు, కాని వారది గ్రహించటం లేదు!
10 - Al-Baqarah (The Cow) - 010
فِي قُلُوبِهِم مَّرَضٞ فَزَادَهُمُ ٱللَّهُ مَرَضٗاۖ وَلَهُمۡ عَذَابٌ أَلِيمُۢ بِمَا كَانُواْ يَكۡذِبُونَ
వారి హృదయాలలో రోగముంది[1]. కాబట్టి అల్లాహ్ వారి రోగాన్ని మరింత అధికం చేశాడు. మరియు వారు అసత్యం పలుకుతూ ఉండటం వలన, వారికి బాధాకరమైన శిక్ష ఉంది.
[1] అంటే సత్యాన్ని నమ్మలేకపోవటం మరియు దుర్భుద్ధి.
11 - Al-Baqarah (The Cow) - 011
وَإِذَا قِيلَ لَهُمۡ لَا تُفۡسِدُواْ فِي ٱلۡأَرۡضِ قَالُوٓاْ إِنَّمَا نَحۡنُ مُصۡلِحُونَ
మరియు: "భువిలో కల్లోలం[1] రేకెత్తించకండి." అని వారితో అన్నప్పుడు; వారు: "మేము సంస్కర్తలము మాత్రమే!" అని అంటారు
[1] ఫసాద్: అంటే కల్లోలం, సంక్షోభం, ఉపద్రవం, అశాంతి, కలహాలు అనే అర్థాలున్నాయి.
12 - Al-Baqarah (The Cow) - 012
أَلَآ إِنَّهُمۡ هُمُ ٱلۡمُفۡسِدُونَ وَلَٰكِن لَّا يَشۡعُرُونَ
జాగ్రత్త! నిశ్చయంగా, (భువిలో) కల్లోలం రేకెత్తిస్తున్నవారు వీరే, కాని వారది గ్రహించటం లేదు.
13 - Al-Baqarah (The Cow) - 013
وَإِذَا قِيلَ لَهُمۡ ءَامِنُواْ كَمَآ ءَامَنَ ٱلنَّاسُ قَالُوٓاْ أَنُؤۡمِنُ كَمَآ ءَامَنَ ٱلسُّفَهَآءُۗ أَلَآ إِنَّهُمۡ هُمُ ٱلسُّفَهَآءُ وَلَٰكِن لَّا يَعۡلَمُونَ
మరియు: "ఇతర జనులు విశ్వసించినట్లు మీరూ విశ్వసించండి." అని, వారితో అన్నప్పుడు, వారు: "మూర్ఖులు విశ్వసించినట్లు మేమూ విశ్వసించాలా?" అని జవాబిస్తారు. జాగ్రత్త! వాస్తవానికి వారే మూర్ఖులు, కాని వారికది తెలియదు.
14 - Al-Baqarah (The Cow) - 014
وَإِذَا لَقُواْ ٱلَّذِينَ ءَامَنُواْ قَالُوٓاْ ءَامَنَّا وَإِذَا خَلَوۡاْ إِلَىٰ شَيَٰطِينِهِمۡ قَالُوٓاْ إِنَّا مَعَكُمۡ إِنَّمَا نَحۡنُ مُسۡتَهۡزِءُونَ
మరియు విశ్వాసులను కలిసి నపుడు, వారు: "మేము విశ్వసించాము." అని అంటారు. కానీ, తమ షైతానుల (దుష్ట నాయకుల) దగ్గర ఏకాంతంలో ఉన్నప్పుడు వారు: "నిశ్చయంగా, మేము మీతోనే ఉన్నాము. కేవలం (వారి) ఎగతాళి చేస్తున్నాము." అని అంటారు.
15 - Al-Baqarah (The Cow) - 015
ٱللَّهُ يَسۡتَهۡزِئُ بِهِمۡ وَيَمُدُّهُمۡ فِي طُغۡيَٰنِهِمۡ يَعۡمَهُونَ
అల్లాహ్ వారి ఎగతాళి చేస్తున్నాడు మరియు వారి తలబిరుసుతనాన్ని హెచ్చిస్తున్నాడు, (అందులో వారు) అంధులై తిరుగుతున్నారు;
16 - Al-Baqarah (The Cow) - 016
أُوْلَـٰٓئِكَ ٱلَّذِينَ ٱشۡتَرَوُاْ ٱلضَّلَٰلَةَ بِٱلۡهُدَىٰ فَمَا رَبِحَت تِّجَٰرَتُهُمۡ وَمَا كَانُواْ مُهۡتَدِينَ
ఇలాంటి వారే, సన్మార్గానికి బదులుగా దుర్మార్గాన్ని కొనుక్కున్న వారు; కాని వారి బేరం వారికి లాభదాయకం కాలేదు మరియు వారికి మార్గదర్శకత్వమూ దొరకలేదు.
17 - Al-Baqarah (The Cow) - 017
مَثَلُهُمۡ كَمَثَلِ ٱلَّذِي ٱسۡتَوۡقَدَ نَارٗا فَلَمَّآ أَضَآءَتۡ مَا حَوۡلَهُۥ ذَهَبَ ٱللَّهُ بِنُورِهِمۡ وَتَرَكَهُمۡ فِي ظُلُمَٰتٖ لَّا يُبۡصِرُونَ
వారి ఉపమానం[1] ఇలా ఉంది:[2] ఒక అగ్నిని వెలిగించగా, అది పరిసరాలను ప్రకాశింపజేసిన తర్వాత అల్లాహ్ వారి వెలుగును తీసుకుని వారిని అంధకారంలో విడిచి పెట్టడం వల్ల, వారు ఏమీ చూడలేక పోతారు.
[1] మస'లున్: అంటే ఉపమానం, పోలిక, సాదృశ్యం, దృష్టాంతం అనే అర్థాలున్నాలు. [2] 'అబ్దుల్లాహ్ బిన్-మస్'ఊద్ (ర'ది. 'అ.) కథనం (ఫ'త్హ్ అల్-ఖదీర్): మహాప్రవక్త ('స'అస), మదీనాకు వచ్చిన తరువాత విశ్వసించిన వారిలో కొందరు కాపట్యానికి లోనవుతారు. అంటే వారు ఇస్లాం వెలుగును పొందిన తరువాత దానిని విడిచి మరల అంధకారంలో చిక్కుకు పోతారు. ఆ విషయం ఈ విధంగా బోధించబడింది. ఒక వ్యక్తి రాత్రిలో ఎడారిలో మంట వెలిగించి కాపుకుంటాడు. అది వారి పరిసరాలను వెలిగిస్తుంది. కాని ఆ అగ్ని ఆరి పోగానే వారు మళ్ళీ అంధకారంలో చిక్కు కుంటారు. ఏమీ చూడ లేక పోతారు. అదే విధంగా బాహ్యంగా మాత్రమే ఇస్లాం స్వీకరించిన వారి హృదయాలు అంధకారంలో ఉండి పోతాయి. వారు ఇస్లాం వెలుగును పొందిన తరువాత కూడా అంధకారంలోనే ఉండి పోతారు.
18 - Al-Baqarah (The Cow) - 018
صُمُّۢ بُكۡمٌ عُمۡيٞ فَهُمۡ لَا يَرۡجِعُونَ
(వారు) చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు, ఇక వారు (ఋజుమార్గానికి) మరలిరాలేరు.
19 - Al-Baqarah (The Cow) - 019
أَوۡ كَصَيِّبٖ مِّنَ ٱلسَّمَآءِ فِيهِ ظُلُمَٰتٞ وَرَعۡدٞ وَبَرۡقٞ يَجۡعَلُونَ أَصَٰبِعَهُمۡ فِيٓ ءَاذَانِهِم مِّنَ ٱلصَّوَٰعِقِ حَذَرَ ٱلۡمَوۡتِۚ وَٱللَّهُ مُحِيطُۢ بِٱلۡكَٰفِرِينَ
లేక (మరొక ఉపమానం): ఆకాశం నుండి ఘోరంగా వర్షం కురుస్తున్నది; చిమ్మ చీకట్లలో ఉరుములు, మెరుపులు మెరుస్తున్నాయి. ఆ ఉరుముల భీకర ధ్వని విని, మృత్యుభయం చేత వారు తమ వ్రేళ్ళను చెవులలో దూర్చుకుంటున్నారు. మరియు అల్లాహ్ సత్య తిరస్కారులను అన్ని వైపుల నుండి ఆవరించి ఉన్నాడు.[1]
[1] ముహీతున్: One Who Econpasseth, Encloseth, Surroundeth. సర్వాన్ని పరివేష్టించి ఆవరించి, చుట్టుముట్టి ఉన్నవాడు, ఆయన జ్ఞానపరిరిధికీ శక్థికీ వెలుపల ఏదీ లేదు. చూడండి, 85:20.
20 - Al-Baqarah (The Cow) - 020
يَكَادُ ٱلۡبَرۡقُ يَخۡطَفُ أَبۡصَٰرَهُمۡۖ كُلَّمَآ أَضَآءَ لَهُم مَّشَوۡاْ فِيهِ وَإِذَآ أَظۡلَمَ عَلَيۡهِمۡ قَامُواْۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ لَذَهَبَ بِسَمۡعِهِمۡ وَأَبۡصَٰرِهِمۡۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ
ఆ మెరుపు వారి దృష్టిని ఇంచు మించు ఎగుర వేసుకు పోయినట్లుంటుంది. ప్రతిసారి అది మెరిసినప్పుడు, వారు ముందుకు నడుస్తారు మరియు వారిపై చీకటి క్రమ్ము కొనగానే వారు ఆగిపోతారు. మరియు అల్లాహ్ కోరితే వారి వినికిడినీ మరియు వారి చూపునూ తొలగించే వాడు.[1] నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.[2]
[1] అల్లాహుతా 'ఆలా తలుచుకుంటే ఎప్పుడైనా తాను ప్రసాదించే అనుగ్రహాలను ఆపుకోవచ్చు! కావున మానవులు ఎల్లప్పుడు అల్లాహుతా 'ఆలా యందే భయభక్తులు కలిగి వుండి, ఆయన శిక్షకూ, ప్రతీకారానికీ భయపడుతూ ఉండాలి. [2] అలా కుల్లి ,షయ్ఇ'న్ ఖదీర్: ఈ వాక్యాన్ని కొందరు: "అన్నింటిపై అధికారం (ఆధిపత్యం) గలవాడు." అని కూడా అనువదించారు.
21 - Al-Baqarah (The Cow) - 021
يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱعۡبُدُواْ رَبَّكُمُ ٱلَّذِي خَلَقَكُمۡ وَٱلَّذِينَ مِن قَبۡلِكُمۡ لَعَلَّكُمۡ تَتَّقُونَ
ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు![1]
[1] ల'అల్లకుమ్ తత్తఖూన్: దీనికి ము'హమ్మద్ జూనాగఢి గారు ఇలా తాత్పర్యమిచ్చారు: "తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు."
22 - Al-Baqarah (The Cow) - 022
ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلۡأَرۡضَ فِرَٰشٗا وَٱلسَّمَآءَ بِنَآءٗ وَأَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَأَخۡرَجَ بِهِۦ مِنَ ٱلثَّمَرَٰتِ رِزۡقٗا لَّكُمۡۖ فَلَا تَجۡعَلُواْ لِلَّهِ أَندَادٗا وَأَنتُمۡ تَعۡلَمُونَ
ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి.[1]
[1] మిమ్మల్ని మరియు సర్వసృష్టిని సృష్టించినవాడు అల్లాహ్ (సు.తా.) యే! మీకు జీవనోపాధిని సమకూర్చేవాడు కూడా ఆయనయే. అలాంటప్పుడు ఆయనను వదలి మీరు ఇతరులను ఎందుకు ఆరాధిస్తున్నారు? ఇతరులను ఆయనకు భాగస్వాములుగా ఎందుకు నిలబెడుతున్నారు? మీరు ఆయన శిక్ష నుండి తప్పించు కోవాలనుకుంటే! కేవలం ఆయననే ఆరాధించండి, ('స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం-6, 'హ. నం. 4)
23 - Al-Baqarah (The Cow) - 023
وَإِن كُنتُمۡ فِي رَيۡبٖ مِّمَّا نَزَّلۡنَا عَلَىٰ عَبۡدِنَا فَأۡتُواْ بِسُورَةٖ مِّن مِّثۡلِهِۦ وَٱدۡعُواْ شُهَدَآءَكُم مِّن دُونِ ٱللَّهِ إِن كُنتُمۡ صَٰدِقِينَ
మరియు మేము మా దాసుని (ముహమ్మద్) పై అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) గురించి, మీకు సందేహముంటే; దాని వంటి ఒక్క సూరహ్ నైనా మీరు (రచించి) తీసుకురండి[1]. మరియు అల్లాహ్ తప్ప మీకు ఉన్న సహాయకులను అందరినీ పిలుచుకోండి; మీరు సత్యవంతులే అయితే (ఇది చేసి చూపండి).
[1] ఈ విధమైన ఒక్క సూరహ్ నైనా రచించి తెమ్మనే ప్రశ్న రెండు చోట్లలో ఇక్కడ మరియు 10:38 లలో ఉంది. 11:13లో పది సూరాహ్ లు రచించి తెమ్మనీ మరియు 17:88, 52:34లలో ఇట్టి గ్రంథాన్ని రచించి తెమ్మనీ ఉంది. ఈ దివ్యఖుర్ఆన్ అల్లాహుతా 'ఆలా దగ్గరి నుండి అవతరింప జేయబడింది, కాబట్టి ఎవ్వరు కూడా ఇంత వరకు ఈ ఛాలెంజీని ఎదుర్కోలేక పోయారు.
24 - Al-Baqarah (The Cow) - 024
فَإِن لَّمۡ تَفۡعَلُواْ وَلَن تَفۡعَلُواْ فَٱتَّقُواْ ٱلنَّارَ ٱلَّتِي وَقُودُهَا ٱلنَّاسُ وَٱلۡحِجَارَةُۖ أُعِدَّتۡ لِلۡكَٰفِرِينَ
కానీ, ఒకవేళ మీరు అలా చేయలేక పోతే - నిశ్చయంగా, మీరు అలా చేయలేరు - మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి.[1] అది సత్యతిరస్కారుల కొరకే తయారు చేయబడింది.
[1] ఇబ్నె 'అబ్బాస్ (ర'ది. 'అ.) కథనం: "మీరు మరియు మీరు ఆరాధించే రాళ్ళ దేవతలు నరకాగ్నికి ఇంధనం అవుతారు." చూడండి, 21:98.
25 - Al-Baqarah (The Cow) - 025
وَبَشِّرِ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّـٰلِحَٰتِ أَنَّ لَهُمۡ جَنَّـٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ كُلَّمَا رُزِقُواْ مِنۡهَا مِن ثَمَرَةٖ رِّزۡقٗا قَالُواْ هَٰذَا ٱلَّذِي رُزِقۡنَا مِن قَبۡلُۖ وَأُتُواْ بِهِۦ مُتَشَٰبِهٗاۖ وَلَهُمۡ فِيهَآ أَزۡوَٰجٞ مُّطَهَّرَةٞۖ وَهُمۡ فِيهَا خَٰلِدُونَ
మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి కొరకు నిశ్చయంగా క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయనే శుభవార్తను వినిపించు, ప్రతిసారి వారికి తినటానికి ఫలాలు ఒసంగబడినపుడల్లా, వారు: "ఇవి ఇంతకు ముందు మాకు ఇవ్వబడినవే!" అని అంటారు. ఎందుకంటే వారికి ఇవ్వబడేవి వాటీ పోలిక గలవే. అక్కడ వారికి నిర్మల సహవాసులు (అజ్వాజ్) ఉంటారు. మరియు వారందులో శాశ్వతంగా ఉంటారు.
26 - Al-Baqarah (The Cow) - 026
۞إِنَّ ٱللَّهَ لَا يَسۡتَحۡيِۦٓ أَن يَضۡرِبَ مَثَلٗا مَّا بَعُوضَةٗ فَمَا فَوۡقَهَاۚ فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُواْ فَيَعۡلَمُونَ أَنَّهُ ٱلۡحَقُّ مِن رَّبِّهِمۡۖ وَأَمَّا ٱلَّذِينَ كَفَرُواْ فَيَقُولُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَٰذَا مَثَلٗاۘ يُضِلُّ بِهِۦ كَثِيرٗا وَيَهۡدِي بِهِۦ كَثِيرٗاۚ وَمَا يُضِلُّ بِهِۦٓ إِلَّا ٱلۡفَٰسِقِينَ
నిశ్చయంగా, అల్లాహ్ దోమ లేక దాని కంటే చిన్నదాని దృష్టాంతం ఇవ్వటానికి సంకోచించడు. కావున విశ్వసించిన వారు, ఇది తమ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కాని సత్యతిరస్కారులు, వాటిని విని: "ఈ ఉపమానాల ద్వారా అల్లాహ్ చెప్పదలుచుకున్నది ఏమిటి?" అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా ఆయన ఎంతోమందిని మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు. మరియు ఎంతోమందికి సన్మార్గం కూడా చూపుతాడు. మరియు ఆయన కేవలం దుష్టులనే[1] మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడు.
[1] ఫాసిఖున్: అంటే దైవవిధేయతా హద్దులను అతిక్రమించిన వాడు (అవిధేయుడు), మార్గభ్రష్టుడు, దుష్టుడు, దుర్జనుడు, భక్తి లేని వాడు అనే అర్థాలున్నాయి. "ఎవడు ఏ వైపునకు పోదలచు కుంటాడో మేము అతనిని ఆ వైపునకే మరల్చుతాము." చూడండి, 4:115. అల్లాహ్ (సు.తా.) మానవులకు మరియు జిన్నాతులకు మంచి చెడులను తెలుసుకునే విచక్షణా శక్తీ, బుద్ధీ ఇచ్చాడు. కాబట్టి, వారికి పరలోక జీవితంలో, వారి కర్మల ప్రకారం, స్వర్గ/నరకాలు ఉన్నాయి. అల్లాహుతా' ఆలా ప్రవక్తల మరియు దివ్యగ్రంథాల ద్వారా వారికి సత్యాసత్యాలను, మంచి / చెడులను బోధించాడు. వాటిని అనుసరించటం వల్ల పొందే పరలోక ప్రతిఫలాలను (స్వర్గ / నరకాలను) కూడా విశదం చేశాడు. కావున వారిని మంచి / చెడు మార్గాలను అనుసరించటానికి బలవంతం చేయడు. వారిని వారి మార్గాలలో వదలి పెడతాడు. అల్లాహ్ (సు.తా.) కు జరిగిపోయింది, జరుగుతున్నది మరియు ముందు జరగబోయేది అంతా తెలుసు కాబట్టి ఎవరు నరకవాసులు కానున్నారో మరియు ఎవరు స్వర్గవాసులు కానున్నారో కూడా తెలుసు. ఇదంతా గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ విధంగా పేర్కొనబడింది. అల్లాహ్ (సు.తా.) ఎవరిని కూడా బలవంతంగా నరకంలోకి త్రోయడు. వారి కర్మలే, వారిని దానికి అర్హులుగా చేస్తాయి. ఇలాంటి వాక్యం ఖుర్ఆన్ లో అనేక సార్లు వచ్చింది. ప్రతి చోటా దీని తాత్పర్యం ఇదే.
27 - Al-Baqarah (The Cow) - 027
ٱلَّذِينَ يَنقُضُونَ عَهۡدَ ٱللَّهِ مِنۢ بَعۡدِ مِيثَٰقِهِۦ وَيَقۡطَعُونَ مَآ أَمَرَ ٱللَّهُ بِهِۦٓ أَن يُوصَلَ وَيُفۡسِدُونَ فِي ٱلۡأَرۡضِۚ أُوْلَـٰٓئِكَ هُمُ ٱلۡخَٰسِرُونَ
ఎవరైతే అల్లాహ్ తో స్థిరమైన ఒడంబడిక[1] చేసుకున్న పిదప దానిని భంగ పరుస్తారో మరియు అల్లాహ్ స్థిరపరచమని ఆజ్ఞాపించిన దానిని త్రెంచుతారో మరియు భువిలో కల్లోలం రేకెత్తిస్తారో! ఇలాంటి వారే, వాస్తవంగా నష్టపడేవారు.
[1] 'అహ్ దుల్లాహి: అంటే ఆదమ్ ('అ.స.)ను సృష్టించే సమయంలో సమస్త మానవజాతి నుంచి అల్లాహుతా 'ఆలా తీసుకున్న ప్రమాణం. అది ఏమిటంటే: అల్లాహ్ (సు.తా.) దాస్యమే చేయాలనీ, ఆయనకే విధేయులై ఉండాలనీ మరియు కేవలం ఆయననే ఆరాధించాలనీ.
28 - Al-Baqarah (The Cow) - 028
كَيۡفَ تَكۡفُرُونَ بِٱللَّهِ وَكُنتُمۡ أَمۡوَٰتٗا فَأَحۡيَٰكُمۡۖ ثُمَّ يُمِيتُكُمۡ ثُمَّ يُحۡيِيكُمۡ ثُمَّ إِلَيۡهِ تُرۡجَعُونَ
మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలరు? మరియు వాస్తవానికి ఆయనే నిర్జీవులుగా[1] ఉన్న మిమ్మల్ని సజీలుగా చేశాడు కదా! తరువాత మీ ప్రాణాన్ని తీసి, తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేసేది కూడా ఆయనే; చివరకు మీరంతా ఆయన వద్దకే మరలింపబడతారు.
[1] అంటే మీరు ఏమీ లేకున్నపుడు మొదటిసారి సృష్టించబడ్డారు. ఆ తరువాత మీకు ఇవ్వబడిన గడువు పూర్తి అయిన తరువాత మీరు మరణింపజేయబడి, పునరుత్థాన దినమున మళ్ళీ సజీవులుగా లేపబడతారు. అది మీ రెండవ జీవితం. దానికి అంతముండదు. అందు మీకు, మీరు భూలోకంలో చేసిన కర్మలకు తగిన ప్రతిఫలమివ్వబడుతుంది.
29 - Al-Baqarah (The Cow) - 029
هُوَ ٱلَّذِي خَلَقَ لَكُم مَّا فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا ثُمَّ ٱسۡتَوَىٰٓ إِلَى ٱلسَّمَآءِ فَسَوَّىٰهُنَّ سَبۡعَ سَمَٰوَٰتٖۚ وَهُوَ بِكُلِّ شَيۡءٍ عَلِيمٞ
ఆయనే భూమిలో నున్న సమస్తాన్నీ మీ కొరకు సృష్టించాడు; తరువాత తన దృష్టిని ఆకాశాల వైపునకు మరల్చి వాటిని సప్తాకాశాలుగా ఏర్పరిచాడు. మరియు ఆయనే ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం గలవాడు.
30 - Al-Baqarah (The Cow) - 030
وَإِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلَـٰٓئِكَةِ إِنِّي جَاعِلٞ فِي ٱلۡأَرۡضِ خَلِيفَةٗۖ قَالُوٓاْ أَتَجۡعَلُ فِيهَا مَن يُفۡسِدُ فِيهَا وَيَسۡفِكُ ٱلدِّمَآءَ وَنَحۡنُ نُسَبِّحُ بِحَمۡدِكَ وَنُقَدِّسُ لَكَۖ قَالَ إِنِّيٓ أَعۡلَمُ مَا لَا تَعۡلَمُونَ
మరియు (జ్ఞాపకం చేసుకో!) నీ ప్రభువు దేవదూతలతో: "వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్తరాధికారిని (ఖలీఫాను)[1] సృష్టించబోతున్నాను!" అని చెప్పినపుడు, వారు: "ఏమీ? నీవు భూమిలో కల్లోలం రేకెత్తించే వానిని మరియు నెత్తురు చిందించే వానిని నియమించబోతున్నావా? మేము నీ స్తోత్రం చేస్తూ, నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా!" అని విన్నవించు కున్నారు. దానికి ఆయన: "నిశ్చయంగా, మీకు తెలియనిది నాకు తెలుసు!" అని అన్నాడు.
[1] 'ఖలీఫా: అంటే భూమిలో తరతరాలుగా వచ్చే జనపదం, ఉత్తరాధికారి. చూడండి, 6:165, 27:62, 35:39. మానవుడు భూమిలో అల్లాహ్ (సు.తా.) యొక్క ప్రతినిధి అనటం సరైనది కాదు.
31 - Al-Baqarah (The Cow) - 031
وَعَلَّمَ ءَادَمَ ٱلۡأَسۡمَآءَ كُلَّهَا ثُمَّ عَرَضَهُمۡ عَلَى ٱلۡمَلَـٰٓئِكَةِ فَقَالَ أَنۢبِـُٔونِي بِأَسۡمَآءِ هَـٰٓؤُلَآءِ إِن كُنتُمۡ صَٰدِقِينَ
మరియు ఆయన (అల్లాహ్) ఆదమ్ కు సకల వస్తువుల పేర్లను నేర్పాడు[1], ఆ పిదప వాటిని దేవదూతల ఎదుట ఉంచి: "మీరు సత్యవంతులే అయితే, వీటి పేర్లను నాకు తెలుపండి." అని అన్నాడు.
[1] చూడండి, 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం-6, 'హ.నం. 3.
32 - Al-Baqarah (The Cow) - 032
قَالُواْ سُبۡحَٰنَكَ لَا عِلۡمَ لَنَآ إِلَّا مَا عَلَّمۡتَنَآۖ إِنَّكَ أَنتَ ٱلۡعَلِيمُ ٱلۡحَكِيمُ
వారు (దేవదూతలు): "నీవు సర్వలోపాలకు అతీతుడవు[1], నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞుడవు[2], మహా వివేకవంతుడవు[3]." అని అన్నారు.
[1] సుబ్'హానున్: Extolled be his absolute perfection. Hallowed, Exalted, Glirified, సర్వలోపాలకు అతీతుడు, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు, పానవుడు, ప్రశంసనీయుడు, శ్లాఘింప, పొగడ, స్తుతింప దగిన వాడు. చూడండి, 2:116, 12:108, 59:23. [2] అల్-'అలీము: The All -knowing, The Omniscient. సర్వజ్ఞుడు, జ్ఞానసంపన్నుడు, సర్వం ఎరిగిన వాడు, జ్ఞానం గల, నేర్పు గల, తన దాసుల ప్రతిమాటనూ, ప్రతి పనినీ, భావాన్నీ, అభిప్రాయాన్నీ, ప్రత్యక్షంగా ఎరిగినవాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 2:127. [3] అల్ హకీము: All-Wise, possessing Knowledge or Science, The Omniscient, మహా వివేకవంతుడు, వివేచనాపరుడు. ఈ పేరు దివ్యఖుర్ఆన్ కొరకు కూడా వాడబడుతుంది. అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 59:24
33 - Al-Baqarah (The Cow) - 033
قَالَ يَـٰٓـَٔادَمُ أَنۢبِئۡهُم بِأَسۡمَآئِهِمۡۖ فَلَمَّآ أَنۢبَأَهُم بِأَسۡمَآئِهِمۡ قَالَ أَلَمۡ أَقُل لَّكُمۡ إِنِّيٓ أَعۡلَمُ غَيۡبَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَأَعۡلَمُ مَا تُبۡدُونَ وَمَا كُنتُمۡ تَكۡتُمُونَ
ఆయన (అల్లాహ్): "ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు." అని అన్నాడు. ఎపుడైతే అతను (ఆదమ్) ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడో; ఆయన అన్నాడు: "నిశ్చయంగా, నేను మాత్రమే భూమ్యాకాశాల అగోచర విషయాలను ఎరుగుదునని మీతో చెప్పలేదా? మరియు మీరు ఏది బహిర్గతం చేస్తారో మరియు ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు!"
34 - Al-Baqarah (The Cow) - 034
وَإِذۡ قُلۡنَا لِلۡمَلَـٰٓئِكَةِ ٱسۡجُدُواْ لِأٓدَمَ فَسَجَدُوٓاْ إِلَّآ إِبۡلِيسَ أَبَىٰ وَٱسۡتَكۡبَرَ وَكَانَ مِنَ ٱلۡكَٰفِرِينَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము దేవదూతలతో: "మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆదేశించినపుడు, ఒక ఇబ్లీస్[1] తప్ప మిగతా వారంతా సాష్టాంగం (సజ్దా) చేశారు;[2] అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్యతిరస్కారులలోని వాడయ్యాడు.
[1] ఇబ్లీస్: అంటే, He Despaired, ఆశ వదులుకొన్న, నిరాశ చెందిన వాడు. ఇది షై'తాన్ పేరు. అతడు జిన్నాతులలోని వాడు. షై'తాన్: He was, or became, distant or remote (from the mercy of Allah) అంటే, అల్లాహ్ (సు.తా.), సానుభూతి, లేక దయ నుండి దూరమై పోయిన వాడు, Rebelious, తిరగబడిన, అవిధేయుడైన, ఎదురు తిరిగిన వాడు, అధికారాన్ని ప్రతిఘటించిన వాడు. [2] సజ్దా: నుదుటితో సహా ఎనిమిది అంగాలను భూమికి ఆనించటం (సాష్టాంగం చేయటం). దీనిలో నుదురు, ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు కాళ్ళ వ్రేళ్ళు భూమికి తగులుతూ ఉండాలి. ఇది కేవలం అల్లాహుతా'లా కొరకే ప్రత్యేకించబడింది. ఇక్కడ దైవదూతలు అల్లాహ్ (సు.తా.) ఆదేశాన్ని శిరసావహించటానికే ఆదమ్ ('అస) కు సజ్దా చేశారు. ము'హమ్మద్ ('స'అస) షరీయత్ లో, మానవుడు గౌరవార్థం కూడా ఎవ్వరికీ సజ్దా చేయగూడదు.
35 - Al-Baqarah (The Cow) - 035
وَقُلۡنَا يَـٰٓـَٔادَمُ ٱسۡكُنۡ أَنتَ وَزَوۡجُكَ ٱلۡجَنَّةَ وَكُلَا مِنۡهَا رَغَدًا حَيۡثُ شِئۡتُمَا وَلَا تَقۡرَبَا هَٰذِهِ ٱلشَّجَرَةَ فَتَكُونَا مِنَ ٱلظَّـٰلِمِينَ
మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: "ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా, ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు[1] దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో[2] చేరిన వారవుతారు!"
[1] ఆ చెట్టు ఏ రకమైనదో ఖుర్ఆన్ మరియు 'హదీస్'లలో పేర్కొనబడలేదు. కాబట్టి దానిని గురించి అనుమానాల పాలు కాగూడదు. ఇంకా చూడండి, 20:120. [2] "జుల్ మున్: Wrong doing, Injustice, Oppression. ఈ పదానికి దుర్మార్గం, అన్యాయం, అధర్మం, అక్రమం, దోషం, అపచారం మొదలైన అర్థాలు ఉన్నాయి.
36 - Al-Baqarah (The Cow) - 036
فَأَزَلَّهُمَا ٱلشَّيۡطَٰنُ عَنۡهَا فَأَخۡرَجَهُمَا مِمَّا كَانَا فِيهِۖ وَقُلۡنَا ٱهۡبِطُواْ بَعۡضُكُمۡ لِبَعۡضٍ عَدُوّٞۖ وَلَكُمۡ فِي ٱلۡأَرۡضِ مُسۡتَقَرّٞ وَمَتَٰعٌ إِلَىٰ حِينٖ
ఆ పిదప షైతాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి, వారిద్దరినీ వారున్న స్థితి నుండి బయటికి తీశాడు. మరియు మేము (అల్లాహ్) అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి; మీరు ఒకరికొకరు విరోధులవుతారు.[1] ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి, అక్కడే జీవితం గడప వలసి ఉంటుంది."
[1] అంటే ఆదమ్ ('అ.స.) మరియు షై'తాన్ కావచ్చు; లేక మానవులు పరస్పరం (ఒకరికొకరు) విరోధులవుతారని అర్థం కావచ్చు!
37 - Al-Baqarah (The Cow) - 037
فَتَلَقَّىٰٓ ءَادَمُ مِن رَّبِّهِۦ كَلِمَٰتٖ فَتَابَ عَلَيۡهِۚ إِنَّهُۥ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ
తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి[1], (పశ్చాత్తాప పడి క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.
[1] ఆదమ్ ('అ.స.) చేసిన దు'ఆ కొరకు చూడండి, 7:23.
38 - Al-Baqarah (The Cow) - 038
قُلۡنَا ٱهۡبِطُواْ مِنۡهَا جَمِيعٗاۖ فَإِمَّا يَأۡتِيَنَّكُم مِّنِّي هُدٗى فَمَن تَبِعَ هُدَايَ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُونَ
మేము (అల్లాహ్) ఇలా అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగి పోండి." ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!
39 - Al-Baqarah (The Cow) - 039
وَٱلَّذِينَ كَفَرُواْ وَكَذَّبُواْ بِـَٔايَٰتِنَآ أُوْلَـٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ
కానీ, ఎవరైతే (మార్గదర్శకత్వాన్ని) తిరస్కరిస్తారో మరియు మా సూచన(ఆయత్)లను అసత్యాలని తిరస్కరిస్తారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
40 - Al-Baqarah (The Cow) - 040
يَٰبَنِيٓ إِسۡرَـٰٓءِيلَ ٱذۡكُرُواْ نِعۡمَتِيَ ٱلَّتِيٓ أَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَأَوۡفُواْ بِعَهۡدِيٓ أُوفِ بِعَهۡدِكُمۡ وَإِيَّـٰيَ فَٱرۡهَبُونِ
ఓ ఇస్రాయీల్ సంతతివారలారా![1] నేను మీకు చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి, నేనూ మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుతాను. మరియు మీరు నాకు మాత్రమే భయపడండి!
[1] ఇస్రాయీ'ల్: హీబ్రూ భాష పదం. 'అరబ్బీలో దీని అర్థం 'అబ్దుల్లాహ్ (అల్లాహ్ దాసుడు). ఇది య'అఖూబ్ ('అ.స.) యొక్క బిరుదు. అతనికి 12 మంది కుమారులు. వారితో 12 తెగలుగా యూదుల సంతతి పెరిగింది. వారిని బనీ ఇస్రాయీ'ల్ (ఇస్రాయీ'ల్ సంతతివారు) అని అంటారు. వారిలో చాలా మంది ప్రవక్తలు వచ్చారు.
41 - Al-Baqarah (The Cow) - 041
وَءَامِنُواْ بِمَآ أَنزَلۡتُ مُصَدِّقٗا لِّمَا مَعَكُمۡ وَلَا تَكُونُوٓاْ أَوَّلَ كَافِرِۭ بِهِۦۖ وَلَا تَشۡتَرُواْ بِـَٔايَٰتِي ثَمَنٗا قَلِيلٗا وَإِيَّـٰيَ فَٱتَّقُونِ
మరియు మీ వద్దనున్న వాటిని (తౌరాత్ / ఇంజీల్ లను) ధృవీకరిస్తూ నేను అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి. మరియు దీనిని తిరస్కరించే వారిలో మీరు మొట్టమొదటి వారు కాకండి. మరియు అల్పలాభాలకు నా సూచన(ఆయత్) లను[1] అమ్మకండి. కేవలం నా యందే భయభక్తులు కలిగి ఉండండి.
[1] ఆయత్ : Sign, అంటే సూచన, సూక్తి, చిహ్నం, సంకేతం. కొన్ని చోట్లలో అద్భుత సూచన, అద్భుత సంకేతం, అద్భుత నిదర్శనం అనే అర్థాలు వస్తాయి. ఈ అనువాదంలో చాలా వరకు సూచన అనే పదమే వాడబడింది. వీటిని వాక్యాలనటం సరికాదు. ఇవి అల్లాహుతా 'ఆలా సూచనలు. ఆ ఖుర్ఆన్ లోని ఆయతుల సంఖ్య కూఫీ 'ఉలమాలు అనుసరించిన ఇమామ్ అ'ష్షాతబీ యొక్క నా" జిమతు'జ్జుహ్ర్ లో వ్రాసినట్లు ఉంది. అంటే అబీ-'అబ్దుర్రహ్మాన్ 'అబ్దుల్లాహ్ ఇబ్నె 'హబీబ్ అస్సులమీ' అనుసరించిన, అలీ ఇబ్నె అబీ-'తాలిబ్ (ర'ది.'అ) విధానం. దీని ప్రకారం ఈ ఖుర్ఆన్ లోని ఆయతుల సంఖ్య 6236.
42 - Al-Baqarah (The Cow) - 042
وَلَا تَلۡبِسُواْ ٱلۡحَقَّ بِٱلۡبَٰطِلِ وَتَكۡتُمُواْ ٱلۡحَقَّ وَأَنتُمۡ تَعۡلَمُونَ
మరియు సత్యాన్ని అసత్యంతో కలిపి తారుమారు చేయకండి మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని దాచకండి.[1]
[1] చూడండి, ఖుర్ఆన్, 2:76, 101. ఇంకా చూడండి: 'అల్లాహ్ (సు.తా.), మీ సహోదరులలో నుండి ఒక ప్రవక్తను, తెస్తాడు. అప్పుడు మీరు అతనిని అనుసరించాలి.' అని పూర్వ గ్రంథాలలో వ్రాయబడిన సత్యానికి, బైబిల్, ద్వితీయోపదేశ కాండము - (Deuteronomy) 18:15, 18.
43 - Al-Baqarah (The Cow) - 043
وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ وَٱرۡكَعُواْ مَعَ ٱلرَّـٰكِعِينَ
మరియు నమాజ్ ను స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు (నా సాన్నిధ్యంలో వినమ్రులై) వంగే[1] (రుకూఉ చేసే) వారితో పాటు మీరూ (వినమ్రులై) వంగండి (రుకూఉ చేయండి).
[1] రుకూ'ఉ: అంటే నమాజ్ లో అరచేతులను మోకాళ్ళపై పెట్టి వంగడం.
44 - Al-Baqarah (The Cow) - 044
۞أَتَأۡمُرُونَ ٱلنَّاسَ بِٱلۡبِرِّ وَتَنسَوۡنَ أَنفُسَكُمۡ وَأَنتُمۡ تَتۡلُونَ ٱلۡكِتَٰبَۚ أَفَلَا تَعۡقِلُونَ
ఏమీ? మీరు ఇతరులనైతే నీతిపరులవమని ఆజ్ఞాపిస్తున్నారు, కాని, స్వయంగా మీరే దానిని అవలంబించడం మరచి పోతున్నారెందుకు?[1] మరియు మీరయితే గ్రంథాన్ని చదువుతున్నారు కదా! అయితే మీరెందుకు మీ బుద్ధిని ఉపయోగించరు?
[1] 'స'హీ'హ్ బు'ఖారీ, పుస్తకం - 9, 'హ.నం. 218.
45 - Al-Baqarah (The Cow) - 045
وَٱسۡتَعِينُواْ بِٱلصَّبۡرِ وَٱلصَّلَوٰةِۚ وَإِنَّهَا لَكَبِيرَةٌ إِلَّا عَلَى ٱلۡخَٰشِعِينَ
మరియు సహనం మరియు నమాజ్ ద్వారా (అల్లాహ్) సహాయాన్ని అర్ధించండి. నిశ్చయంగా, అది (అల్లాహ్ కు) వినమ్రులైన వారికి తప్ప, ఇతరులకు ఎంతో కష్టతరమైనది.
46 - Al-Baqarah (The Cow) - 046
ٱلَّذِينَ يَظُنُّونَ أَنَّهُم مُّلَٰقُواْ رَبِّهِمۡ وَأَنَّهُمۡ إِلَيۡهِ رَٰجِعُونَ
అలాంటి వారు తాము తమ ప్రభువును నిశ్చయంగా, కలుసు కోవలసి ఉందనీ మరియు ఆయన వైపునకే మరలి పోవలసి ఉందనీ నమ్ముతారు.[1]
[1] "జన్న: అంటే Imagined, thought, భావించాడు, ఊహించాడు, అనే అర్థాలు ఉన్నాయి. కాని కొన్ని సార్లు, believed, sure నమ్మాడు, విశ్వసించాడు అనే అర్థాలు వస్తాయి.
47 - Al-Baqarah (The Cow) - 047
يَٰبَنِيٓ إِسۡرَـٰٓءِيلَ ٱذۡكُرُواْ نِعۡمَتِيَ ٱلَّتِيٓ أَنۡعَمۡتُ عَلَيۡكُمۡ وَأَنِّي فَضَّلۡتُكُمۡ عَلَى ٱلۡعَٰلَمِينَ
ఓ ఇస్రాయీల్ సంతతివారలారా! నేను మీకు చేసిన మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకోండి మరియు నేను నిశ్చయంగా, మిమ్మల్ని (మీ కాలంలో) సర్వలోకాల వారి కంటే అధికంగా ఆదరించాను!
48 - Al-Baqarah (The Cow) - 048
وَٱتَّقُواْ يَوۡمٗا لَّا تَجۡزِي نَفۡسٌ عَن نَّفۡسٖ شَيۡـٔٗا وَلَا يُقۡبَلُ مِنۡهَا شَفَٰعَةٞ وَلَا يُؤۡخَذُ مِنۡهَا عَدۡلٞ وَلَا هُمۡ يُنصَرُونَ
మరియు ఆ (తీర్పు) దినమునకు భయపడండి, అప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఏ విధంగానూ ఉపయోగపడలేడు; మరియు అతని నుండి ఎట్టి సిఫారసూ అంగీకరించబడదు మరియు ఎలాంటి పరిహారం కూడా తీసుకోబడదు మరియు వారికెలాంటి సహాయం కూడా చేయబడదు.
49 - Al-Baqarah (The Cow) - 049
وَإِذۡ نَجَّيۡنَٰكُم مِّنۡ ءَالِ فِرۡعَوۡنَ يَسُومُونَكُمۡ سُوٓءَ ٱلۡعَذَابِ يُذَبِّحُونَ أَبۡنَآءَكُمۡ وَيَسۡتَحۡيُونَ نِسَآءَكُمۡۚ وَفِي ذَٰلِكُم بَلَآءٞ مِّن رَّبِّكُمۡ عَظِيمٞ
మరియు ఫిరఔన్ జాతివారి (బానిసత్వం) నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి). వారు మిమ్మల్ని ఘోరహింసకు గురిచేస్తూ ఉండేవారు; మీ కుమారులను వధించి, మీ స్త్రీలను సజీవులుగా విడిచి పెట్టేవారు మరియు ఇందులో మీ ప్రభువు తరఫు నుండి మీకు గొప్ప పరీక్ష ఉండెను.
50 - Al-Baqarah (The Cow) - 050
وَإِذۡ فَرَقۡنَا بِكُمُ ٱلۡبَحۡرَ فَأَنجَيۡنَٰكُمۡ وَأَغۡرَقۡنَآ ءَالَ فِرۡعَوۡنَ وَأَنتُمۡ تَنظُرُونَ
మరియు మేము మీ కొరకు సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని రక్షించి నప్పుడు మీరు చూస్తూ ఉండగానే ఫిర్ఔన్ జాతి వారిని ముంచి వేసిన సంఘటనను (గుర్తుకు తెచ్చుకోండి).[1]
[1] చూడండి, 20:77-78 మరియు 26:63-66.
51 - Al-Baqarah (The Cow) - 051
وَإِذۡ وَٰعَدۡنَا مُوسَىٰٓ أَرۡبَعِينَ لَيۡلَةٗ ثُمَّ ٱتَّخَذۡتُمُ ٱلۡعِجۡلَ مِنۢ بَعۡدِهِۦ وَأَنتُمۡ ظَٰلِمُونَ
ఇంకా (జ్ఞాపకం చేసుకోండి), మేము మూసాను నలభై రాత్రుల వాగ్దానం చేసి (పిలిచినపుడు) మీరు అతను లేకపోవడం చూసి ఆవుదూడను (ఆరాధ్యదైవంగా) చేసుకున్నారు.[1] మరియు మీరు దుర్మార్గులయ్యారు.
[1] చూడండి, 7:142-148, 20:85.
52 - Al-Baqarah (The Cow) - 052
ثُمَّ عَفَوۡنَا عَنكُم مِّنۢ بَعۡدِ ذَٰلِكَ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ
అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమోనని మేము మిమ్మల్ని మన్నించాము.[1]
[1] 'అఫవ్నా (అల్-'అఫువ్వు) : Pardoning, Effacing, Erasing, Obliterating, Very Forgiving. మన్నించే, రద్దు చేసే, క్షమించేవాడు. చూడండి, 4:149. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.
53 - Al-Baqarah (The Cow) - 053
وَإِذۡ ءَاتَيۡنَا مُوسَى ٱلۡكِتَٰبَ وَٱلۡفُرۡقَانَ لَعَلَّكُمۡ تَهۡتَدُونَ
మరియు (జ్ఞాపకం చేసుకోండి) ! మీరు సన్మార్గులవుతారేమోనని మేము మూసాకు గ్రంథాన్ని మరియు (సత్యా-సత్యాలను వేరే చేసే)[1] గీటురాయిని ప్రసాదించాము.
[1] చూడండి, 8:29, 8:41.
54 - Al-Baqarah (The Cow) - 054