{ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రహ్ కొరకు వచ్చే వారికి నీరు త్రాగించడాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించిన వారి(తో సమానంగా) భావిస్తున్నారా?} [అత్-తౌబా 9:19] ఆయతు చివరి వరకు
నుమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ వద్ద ఉన్నాను. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అన్నాడు: 'ఇస్లాం స్వీకరించిన తర్వాత, హజ్ యాత్రికులకు నీరు త్రాగించడం తప్ప మరే ఇతర సత్కార్యం చేయకపోయినా నేను పట్టించుకోను'. మరొకరు ఇలా అన్నారు:…

