{ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రహ్ కొరకు వచ్చే వారికి నీరు త్రాగించడాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించిన వారి(తో సమానంగా) భావిస్తున్నారా?} [అత్-తౌబా 9:19] ఆయతు చివరి వరకు
Choose an available translation of this Hadeeth
Hadeeth text
నుమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ వద్ద ఉన్నాను. అప్పుడు ఒక వ్యక్తి ఇలా అన్నాడు: 'ఇస్లాం స్వీకరించిన తర్వాత, హజ్ యాత్రికులకు నీరు త్రాగించడం తప్ప మరే ఇతర సత్కార్యం చేయకపోయినా నేను పట్టించుకోను'. మరొకరు ఇలా అన్నారు: 'ఇస్లాం స్వీకరించిన తర్వాత, మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించడం తప్ప మరే ఇతర సత్కార్యం చేయకపోయినా నేను పట్టించుకోను'. మరొకరు ఇలా అన్నారు: 'అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం మీరు చెప్పిన వాటన్నిటికంటే ఉత్తమమైనది'. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు వారిని గద్దించి ఇలా అన్నారు: 'ఇది జుమహ్ రోజు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్ వద్ద మీ స్వరాలను పెంచకండి. అయితే, నేను జుమహ్ నమాజ్ పూర్తి చేశాక, (ప్రవక్త వద్దకు) వెళ్లి మీరు విభేదిస్తున్న విషయం గురించి ఆయనను అడిగి స్పష్టత తీసుకుంటాను'. అప్పుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేశాడు: {ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రహ్ కొరకు వచ్చే వారికి నీరు త్రాగించడాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించిన వారి(తో సమానంగా) భావిస్తున్నారా?} [అత్-తౌబా 9:19] ఆయతు చివరి వరకు.
Explanation
ఏమీ? హజ్జ్ మరియు ఉమ్రా కొరకు వచ్చే వారికి నీరు త్రాగించటాన్ని మరియు మస్జిద్ అల్ హరామ్ ను నిర్వహించటాన్ని, మీరు అల్లాహ్ ను మరియు అంతిమదినాన్ని విశ్వసించి, అల్లాహ్ మార్గంలో పోరాడేదానికి సమానంగా భావిస్తున్నారా? అల్లాహ్ దగ్గర, వారు (ఈ రెండు పక్షాల వారు) సరిసమానులు కారు. మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు సన్మార్గం చూపడు. [అత్తౌబా 9:19]
Benefits
ఆచరణల ఔన్నత్యం షరీఅతు తెలిపిన దానిని బట్టి ఉంటుంది, అంతేగాని ప్రజల స్వంత పరిశోధనలను బట్టి కాదు.
అల్లాహ్ మరియు అంతిమ దినంపై విశ్వాసం అనే షరతుతో అల్లాహ్ మార్గంలో జిహాద్ యొక్క ఘనత తెలుస్తున్నది.
ఇమాం అన్’అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: జుమహ్ రోజున మరియు ఇతర రోజులలో మస్జిదులలో స్వరాన్ని హెచ్చించడం అయిష్టకరమైనది. నమాజ్ కొరకు ప్రజలు సమావేశమైనప్పుడు, జ్ఞానబోధన కొరకు గానీ లేదా మరే ఇతర కారణం చేతనైనా గానీ స్వరాన్ని హెచ్చించరాదు, ఎందుకంటే ఇది నమాజ్ చేసేవారికి మరియు దైవస్మరణ చేసేవారికి ఇబ్బంది, భంగం కలిగిస్తుంది.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

