నిశ్చయంగా మీ అందరిలోకెల్లా అల్లాహ్ పట్ల అత్యంత భయభీతి కలవాడను మరియు ఆయన గురించి మీకంటే బాగా తెలిసినవాడను నేనే
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పనులను ఆదేశించినప్పుడు, వారు చేయగలిగిన వాటినే ఆదేశించేవారు. వారు ఇలా అన్నారు: "ఓ ప్రవక్తా! మేము మీలాంటి వాళ్ళం కాదు. నిశ్చయంగా అల్లాహ్ మీ గత మరియు భవిష్యత్ పాపాలను క్షమించాడు". అప్పు…

