“ఎవరైతే తీర్పు దినము యొక్క శిక్షల నుండి అల్లాహ్ చేత రక్షించబడుటను ఇష్టపడతాడో, అతడు తన వద్ద అప్పు తీసుకుని, (వాస్తవంగా) దానిని తీర్చలేక పోతున్న వ్యక్తికి మరింత సమయం ఇవ్వడం ద్వారా లేదా ఇచ్చిన అప్పు నుండి కొంత తగ్గించడం ద్వారా అతనికి ఉపశమనం కలిగించాలి.”
అబూ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : ఒకసారి అబూ ఖతాదా (ర) తన వద్ద అప్పు తీసుకుని తనను తప్పించుకుని తిరుగుతున్న ఒక వ్యక్తిని వెతుకుతూ వెళ్ళి, చివరికి అతడిని కలిసినారు. అతడు: “నేను దివాళా తీసాను (మీ అప్పు తీర్చటానికి నా వద్ద ఏమీ లేదు) అన్నాడు. దానికి అబూ ఖతాదా “అల్లాహ్…

