“అఊదుబిల్లాహిల్ అజీం, వబి వజ్’హి హిల్ కరీం; వ సుల్తానిల్ ఖదీమ్; మినష్’షైతానిర్రజీమ్”
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ బిన్ అల్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “మస్జిదులోనికి ప్రవేశించునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “అఊదుబిల్లాహిల్ అజీం, వబి వజ్’హి హిల్ కరీం; వ సుల్తానిల్ ఖదీమ్; మినష్’షైతానిర్రజీమ్” (నేను అల్లాహ్ యొక్క కరుణాపూరితమైన వర్చస్సు ద్వారా; (సర్వసృష్టిపై) ఆయన శాశ్వతమైన ఆధిపత్యము ద్వారా; శపించబడిన షైతాను బారి నుండి మహిమాన్వితుడైన అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను)”. అది విని అక్కడ ఉన్న అతను “అంతేనా?” అన్నాడు. దానికి నేను “అవును” అన్నాను. అపుడు అతడు ఇలా అన్నాడు “ఆ పదాలు పలికినపుడు షైతాను ఇలా అంటాడు “ఇతడు రోజంతా నా నుండి రక్షించబడినాడు.”
Explanation
కనుక మస్జిదులో ప్రవేశించు వ్యక్తి ఈ దుఆ (ప్రార్థన) చేసినప్పుడు, షైతాను ఇలా అంటాడు, “ఈ ప్రవేశించిన వ్యక్తి తనను తాను అన్ని సమయాలలో - పగలు మరియు రాత్రి – తనను తాను నా నుండి రక్షించుకున్నాడు” అని.
Benefits
అలాగే ఇందులో షైతాను గురించి హెచ్చరిక ఉన్నది – అతడు ఒక ముస్లిం కొరకు అతణ్ణి అపమార్గం పట్టించడానికి, అతణ్ణి ప్రేరేపించడానికి అన్ని వేళలా కాపుకాచుకుని ఉంటాడని హెచ్చరించబడుచున్నది.
ఒక వ్యక్తి తన హృదయంలో అల్లాహ్’పై ఉన్న విశ్వాసం మరియు ఈ దుఆ పట్ల అతని అవగాహన మరియు దాని ఫలితంగా అల్లాహ్ యొక్క వాగ్దానంపై అతని విశ్వాసం – వీటన్నిటి ఆధారంగా షైతాను యొక్క తప్పు దారి నుండి మరియు అతడి విచలనం నుండి రక్షించబడతాడు.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

