“ఎవరి చేతిలోనైతే నా ప్రాణము ఉన్నదో, ఆయన సాక్షి – అది (ఆ సూరహ్) మూడింటి ఒక వంతు ఖుర్’ఆన్ కు సమానం.”
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ఒక వ్యక్తి – మరో వ్యక్తి “ఖుల్ హువల్లాహు అహద్...” సూరాహ్’ను (సూరతుల్ ఇఖ్లాస్ ను) పలుమార్లు అదే సూరహ్ ను పునరావృతం చేస్తూ పఠిస్తూ ఉండగా చూచినాడు. మర్నాడు ఉదయం అతడు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి ఆ విషయాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు వివరించినాడు; ఆ వ్యక్తి ఆ సూరాహ్ ను తగినన్ని సార్లు పఠించలేదు అనే ధోరణిలో. దానికి రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఎవరి చేతిలోనైతే నా ప్రాణము ఉన్నదో, ఆయన సాక్షి – అది (ఆ సూరహ్) మూడింటి ఒక వంతు ఖుర్’ఆన్ కు సమానం.”
Explanation
Benefits
రాత్రి నమాజు సమయంలో (తహజ్జుద్’లో పూర్తి సూరాలు, పెద్దపెద్ద ఆయతులు కాకుండా) కొన్ని ఆయతులే అయినా సరే పఠించడానికి అనుమతి ఉన్నది, అవి చిన్న ఆయతులే అయినప్పటికీ వాటినే పునరావృతం చేయడానికి అనుమతి ఉన్నది, అయితే దానిని తగ్గించరాదు.
అల్ మాజిరీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “కొంతమంది ధార్మిక పండితులు (ఉలమాలు) ఇలా అన్నారు: “దీని అర్థం ‘ఖుర్’ఆన్ మూడు భాగాలుగా ఉన్నది; గాథలు, ఆదేశాలు మరియు అల్లాహ్ యొక్క నామములు మరియు గుణవిషేషణాలు. “ఖుల్ హువల్లాహు అహద్... (ఓ ప్రవక్తా! ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు...) ఇది పూర్తిగా, సంపూర్ణంగా అల్లాహ్ యొక్క గుణవిషేషణాలకు సంబంధించినది. అంటే మూడు భాగాలలో ఒక భాగం.” మరికొంతమంది ఉలమాలు ఇలా అన్నారు: “దీని అర్థము: దీని పఠనం వల్ల వచ్చే ప్రతిఫలం, అదనపు హెచ్చింపు లేకుండా మూడింట ఒక వంతు ఖుర్’ఆన్ పఠనం వల్ల వచ్చే ప్రతిఫలానికి సమానం అవుతుంది.”
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

