“(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది. అపుడు పిలుపునిచ్చు వాడొకడు ఎలుగెత్తి “ఓ స్వర్గవాసులారా!” అని పిలుపునిస్తాడు. అపుడు వారు తమ మెడలను సారించి అతని వైపునకు జాగ్రత్తగా చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని వారిని అడుగుతాడు. దానికి వారు “తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే, నిశ్చయంగా దానిని వారు ముందే చూసి ఉన్నారు కనుక. అపుడు తిరిగి పిలుపు ఇవ్వబడుతుంది “ఓ నరకవాసులారా!”. దానితో వారు తమ మెడలను సారించి అతని వైపునకు జాగ్రత్తగా చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని వారిని అడుగుతాడు. దానికి వారు “తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే, నిశ్చయంగా దానిని వారు ముందే చూసి ఉన్నారు కనుక. అపుడు దానిని (గొర్రెపోతు రూపములో ఉన్న మృత్యువును) జిబహ్ చేయుట జరుగుతుంది. అపుడు ఆ పిలిచేవాడు ఇలా అంటాడు “ఓ స్వర్గవాసులారా! మీకు ఇది (స్వర్గము) శాశ్వతము, మరియు (మీకు) మృత్యువు లేదు; ఓ నరకవాసులారా! మీకు ఇది (నరకము) శాశ్వతము, మరియు మీకు మృత్యువు లేదు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు “ {وَأَنْذِرْهُمْ يَوْمَ الحَسْرَةِ إِذْ قُضِيَ الأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ} (సూరహ్ మర్యం:39) (మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించబడి ఉంటుంది. (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు....”) అని ఇంతవరకు పఠించి “(అవును) ఈ ప్రాపంచిక జీవితములో పడి కొట్టుకు పోతున్నవారు ఏమరపాటులో పడి ఉన్నారు” అన్నారు. తరువాత ఆ ఆయతు చివరి భాగము
(وَهُمْ لاَ يُؤْمِنُونَ) (కావున వారు విశ్వసించడం లేదు) (సూరహ్ మర్యం:39) పఠించి పూర్తి చేసినారు.
Explanation
Benefits
తీర్పు దినము నాటి భయానక పరిణామం పట్ల ఇందులో ఒక హెచ్చరిక ఉన్నది. తీర్పు దినము “ఇలా చేయక పోతే బాగుండును” అనే హృదయ విదారకమైన పశ్చాత్తాపము, సిగ్గు పడేలా చేసే దినమై ఉంటుంది.
ఇందులో, స్వర్గవాసుల కొరకు శాశ్వత సుఖాలు, సంతోషాలు, సౌఖ్యాలు ఉంటాయని, నరకవాసుల కొరకు శాశ్వత శిక్షలు, బాధలు, ఉంటాయనే ఉద్బోధ ఉన్నది.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

