“అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం ను స్వర్గము వైపునకు పంపుతూ ఇలా అన్నాడు “దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు”. ఆయన స్వర్గానికి వెళ్ళి దానిని చూసాడు, మరియు అల్లాహ్ అందులో ఏమేమి తయారు చేసి ఉంచినాడో చూస్తాడు. (తిరిగి వచ్చి) జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా అంటాడు “నీ ఘనత సాక్షిగా, దాని గురించి విన్న వారు ఎవరైనా దాని లోనికి ప్రవేశించాలని తప్ప మరేమీ కోరుకోరు.” అల్లాహ్ తన ఆదేశముతో స్వర్గాన్ని (స్వర్గంలో చేరే మార్గాన్ని) కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లు, శ్రమ, ప్రయాస మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. అపుడు (జిబ్రయీల్ అలైహిస్సలాంతో) అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” కనుక ఆయన (జిబ్రయీల్) స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. స్వర్గము కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లతో చుట్టుకుని ఉండడం చూసాడు. అతడు అల్లాహ్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు “నీ ఘనత సాక్షిగా, ఎవరూ అందులోనికి ప్రవేశించలేరు.” అపుడు అల్లాహ్ ఆయనతో “నరకానికి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు” అన్నాడు. ఆయన దానిని వెళ్ళి చూసాడు. (అది ఎన్నో భాగాలుగా ఉంది) దాని ఒక భాగము మరొక భాగముపై పేర్చబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా, ఎవరూ దానిలోనికి ప్రవేశించరు” అన్నాడు. అపుడు అల్లాహ్ తన ఆదేశముతో నరకాన్ని వాంఛలు, కోరికలు మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. తరువాత జిబ్రయీల్ అలైహిస్సలాంతో అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” ఆయన వెళ్ళి దానిని చూసాడు. అది వాంఛలు, కోరికలతో ఆవరించబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా! అందులోనికి వెళ్ళి పడిపోవడం తప్ప, దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అని భయంగా ఉన్నది” అన్నాడు.
Explanation
Benefits
అగోచర విషయాలను గురించి విశ్వసించుట, అలాగే అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని నుండి తెలుపబడిన ప్రతి విషయాన్ని విశ్వసించుట విధి.
ఈ ప్రాపంచిక జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కఠిన పరిస్థితుల పట్ల సహనం వహించుట యొక్క ఘనత తెలుస్తున్నది. ఎందుకంటే సహనం వహించుట స్వర్గానికి దారి తీసే మార్గాలలో ఒకటి.
నిషేధించబడిన విషయాలనుండి దూరంగా ఉండుట యొక్క ప్రాముఖ్యత తెలుస్తున్నది. ఎందుకంటే అలా దూరంగా ఉండకపోవడం నరకాగ్నికి దారితీస్తుంది.
స్వర్గాన్ని కష్టాలు, బాధలు, కడగండ్లతో నింపడం, నరకాగ్నిని వాంఛలు, కోరికలు, ఆకర్షణలతో నింపడం అనేవి ఈ ప్రాపంచిక జీవితంలో ఎవరినైనా పరీక్షించడానికి, పరీక్షలు పెట్టడానికి అవసరమైన ఆవశ్యక విషయాలు.
స్వర్గానికి చేరుకునే మార్గము ఈ ప్రపంచిక జీవితములో నుండే ఉంది – అది కఠినమైనది, శ్రమతో కూడుకుని ఉన్నది. దానికి ఎంతో సహనం, విశ్వాసము అవసరం. నరకానికి దారి తీసే మార్గము కోరికలు, వాంఛలు, ఆకర్షణలు మొదలైన వాటితో నిండి ఉన్నది.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

