నేను అలా చేయ్యను, నేను ఇలా చేయ్యను అని చెప్పిన వారి గతి ఏమిగాను? నిజానికి, నేను నమాజు చేస్తాను మరియు నిద్ర పోతాను, నేను ఉపవాసం ఉంటాను మరియు ఉపవాసం విరమిస్తాను మరియు నేను స్త్రీలను వివాహం చేసుకుంటాను. నా సున్నతు నుండి తప్పుకున్నవాడు నాకు చెందినవాడు కాదు
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో నుండి ఒక బృందం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల వద్దకు వచ్చి, "ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఏకాంతంలో ఏయే పనులు (ఆరాధనలు) చేస్తారు?" అని అడిగినారు, వారిలో కొందరు ఇలా అన్నారు: నేను స్త్రీలను వివాహం చేసుకోను. మరికొందరు ఇలా అన్నారు: నేను మాంసం తినను. మరికొందరు ఇలా అన్నారు: నేను మంచం మీద పడుకోను. ఇది తెలిసిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదట అల్లాహ్‌ను స్తుతించారు, తరువాత ఆయనను ప్రశంసించి, ఇలా పలికినారు: "నేను అలా చేయ్యను, నేను ఇలా చేయ్యను అని చెప్పిన వారి గతి ఏమిగాను? నిజానికి, నేను నమాజు చేస్తాను మరియు నిద్ర పోతాను, నేను ఉపవాసం ఉంటాను మరియు ఉపవాసం విరమిస్తాను మరియు నేను స్త్రీలను వివాహం చేసుకుంటాను. నా సున్నతు నుండి తప్పుకున్నవాడు నాకు చెందినవాడు కాదు."
Explanation
Benefits
ఈ షరియతు యొక్క సహనం మరియు సౌలభ్యం దాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణ మరియు మార్గదర్శకత్వంపై ఆధారపడి ఉంటుంది.
మంచితనం మరియు అనుగ్రహం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఉదాహరణను అనుసరించడంలో మరియు ఆయన ఉన్నతమైన షరతులను పాటించడంలోనే ఉంది.
ఆరాధనలో తన శక్తికి మించిన భారం మోపడం అనేది మతంలో నూతన ఆవిష్కరణలు చేసేవారి లక్షణం.
ఇబ్నె హజర్ ఇలా అన్నారు: ఆరాధనలో అతిగా భారాన్ని మోపే విధానాన్ని అవలంబించడం వలన విసుగు వస్తుంది, అది దాని పునాదినే విచ్ఛిన్నం చేస్తుంది. అంతేకాకుండా, తప్పనిసరి ఆరాధనలకు మాత్రమే కట్టుబడి మరియు స్వచ్ఛంద ఆరాధనలను విస్మరించడం వలన సోమరితనానికి అలవాటు పడి, అసలు ఆరాధన పట్ల ఉత్సాహం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి అన్ని వ్యవహారాల్లోనూ మితంగా ఉండటం ఉత్తమం.
గొప్ప వ్యక్తుల ఆదర్శాన్ని అనుసరించడం ఎంత ముఖ్యమో ఇది సూచిస్తుంది మరియు పురుషుల నుండి తెలుసుకోవడం కష్టమైతే, మహిళల ద్వారా దాని గురించి తెలుసుకోవడం అనుమతించబడింది.
ఇందులో ఉపదేశించడం, జ్ఞాన సంబంధిత అంశాలను ప్రస్తుత పరచడం, ధర్మంలో జవాబుదారీగా ఉన్నవారు తమ తీర్పులను స్పష్టం చేయడం మరియు ధర్మంలో కష్టపడి పనిచేసే వారి సందేహాలను నివృత్తి చేయడం వంటివి ఉన్నాయి.
ఒక ముస్లిం తనపై ఉన్న ఇతరుల హక్కులను కూడా నెరవేర్చుకునేలా, తప్పనిసరి మరియు స్వచ్ఛంద ఆరాధనలతో పాటు ఇతర వాటిలో ఉదారంగా ఉండాలనే ఆదేశం.
ఈ హదీథు వివాహం యొక్క గొప్పతనాన్ని సూచిస్తున్నది మరియు దానిని ప్రోత్సహిస్తున్నది.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

