HadeethEnc · 1.29.0
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటివారు మదీనా వచ్చినప్పటి నుంచి ఎన్నడూ వరుసగా మూడు రోజుల పాటు కడుపునిండా గోధుమ రొట్టెలు తినలేదు. ఆయన మరణించేదాకా అదే పరిస్థితి
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటివారు మదీనా వచ్చినప్పటి నుంచి ఎన్నడూ వరుసగా మూడు రోజుల పాటు కడుపునిండా గోధుమ రొట్టెలు తినలేదు. ఆయన మరణించేదాకా అదే పరిస్థితి.
02
Explanation
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా నివేదించినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి వారు మదీనా వచ్చినప్పటి నుంచి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణించేంత వరకు, వరుసగా మూడు రోజుల పాటు గోధుమ రొట్టెలు కడుపునిండా తినలేదు.
03
Benefits
ఈ హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన కుటుంబం యొక్క నిరాడంబరమైన జీవన పరిస్థితిని స్పష్టం చేస్తున్నది, ఎందుకంటే అసలైన జీవితం పరలోక జీవితమే.
ఇబ్ను హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: వారు తరచుగా కడుపునిండా తినకపోవడానికి కారణం వారి వద్ద వస్తువుల కొరత ఉండటమేనని స్పష్టమవుతుంది, అయితే కొన్నిసార్లు వారికి ఏమైనా లభించినప్పటికీ, వారు తమ కంటే ఇతరులకే ప్రాధాన్యత ఇచ్చేవారు (దానం చేసేవారు).

Attribution
[అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares