“నువ్వు కోరిన దానికంటే మంచి దాని వైపునకు నేను మార్గదర్శకం చేయనా? మీరు రాత్రి పడుకునేటపుడు “సుబ్’హానల్లాహ్” అని ముఫ్ఫై మూడు సార్లు, “అల్’హందులిల్లాహ్” అని ముఫ్ఫై మూడు సార్లు, మరియు “అల్లాహు అక్బర్” అని ముఫ్ఫై నాలుగు సార్లు ఉచ్ఛరించండి. అది (ఇంటిలో) ఒక సేవకుడిని కలిగి ఉండడం కంటే మేలైనది, శుభప్రదమైనది.”
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : ఫాతిమా (రదియల్లాహు అన్హా), తిరగలి (ఇసుర్రాయి) కారణంగా తన చేతులు ఏ విధంగా అయి పోతున్నాయో చూడండి అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్ద ఫిర్యాదు చేసారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్దకు కొంతమంది బానిస బాలికలను తీసుకు వచ్చినారని ఆమె విని ఉన్నది. కానీ (ఆమె అక్కడికి వచ్చినప్పుడు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు కనిపించలేదు. ఫాతిమా రదియల్లాహు అన్హా తన సమస్యను ఆయిషా రదియల్లాహు అన్హా కు చెప్పింది. ఆయిషా రదియల్లాహు అన్హా ఆ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేసినారు.” అలీ రదియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “(ఆ రాత్రి) మేము నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్నపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా వద్దకు వచ్చినారు. ఆయన రాగానే మేము లేవాలని అనుకున్నాము. కానీ ఆయన “(లేవకండి) అలాగే ఉండండి” అని అన్నారు. ఆయన మా వద్దకు వచ్చి మా మధ్య కూర్చొన్నారు. ఆయన పాదాల చల్లదనం నా ఉదరానికి తగిలినది. అపుడు ఆయన ఇలా అన్నారు: “నువ్వు కోరిన దానికంటే మంచి దాని వైపునకు నేను మార్గదర్శకం చేయనా? మీరు రాత్రి పడుకునేటపుడు “సుబ్’హానల్లాహ్” అని ముఫ్ఫై మూడు సార్లు, “అల్’హందులిల్లాహ్” అని ముఫ్ఫై మూడు సార్లు, మరియు “అల్లాహు అక్బర్” అని ముఫ్ఫై నాలుగు సార్లు ఉచ్ఛరించండి. అది (ఇంటిలో) ఒక సేవకుడిని కలిగి ఉండడం కంటే మేలైనది, శుభప్రదమైనది.”
Explanation
Benefits
ఈ స్మరణ నిద్రపోవడానికి ముందు ఉచ్ఛరించబడుతుంది – ఈ స్మరణలోని పదాలు, షు’బహ్ (రదియల్లాహు అన్హు) నుండి ము’ఆద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖించగా సహీ ముస్లిం గ్రంథములో నమోదు చేయబడినవి – అందులో స్పష్టంగా “...మీరు నిద్రపోవడానికి ముందు” అని నమోదు చేయబడింది.
ఒకవేళ ఎవరైనా ముస్లిం ఈ స్మరణను రాత్రి నిద్రపోవడానికి ముందు ఉచ్ఛరించడం మరిచిపోయినట్లైతే, అందులో తప్పేమీ లేదు. అతనికి రాత్రిపూట ఎప్పుడు నిద్ర మెలుకువ వచ్చినా అప్పుడు పఠించవచ్చు. ఎందుకంటే ఈ హదీథును ఉల్లేఖించిన అలీ (రదియల్లాహు అన్హు) సిఫ్ఫీన్ యుద్ధము నాటి రాత్రి తాను నిద్రపోవడానికి ముందు ఈ స్మరణను పలకడం మర్చిపోయినాను అనీ, తరువాత మేలుకున్నపుడు గుర్తుకు వచ్చి అప్పుడు ఈ స్మరణను పలికినాను అనీ తెలియజేసినారు.
అల్ ముహల్లబ్ ఇలా అన్నారు: ఈ ప్రాపంచిక జీవితంపై పరలోక జీవితానికి ప్రాధాన్యతనిచ్చే ఒక వ్యక్తి పరలోకజీవితాన్ని సాధించడానికి తాను ఏ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నాడో, తన కుటుంబంపై కూడా అటువంటి భారాన్నే మోపుతాడు – ఒకవేళ వారిలో ఆ భారం మోయగల శక్తి సామర్థ్యాలు ఉంటే – అనడానికి ఇందులో ఉదాహరణ మనకు కనిపిస్తుంది.
ఇబ్న్ హజర్ అల్-అస్కలానీ ఇలా అన్నారు: ఎవరైతే, రాత్రి నిద్రపొయే ముందు నిరంతరం పట్టుదలగా ఈ స్మరణను పఠిస్తాడో, పని ఎంత ఎక్కువగా ఉన్నా అది అతనికి హాని కలిగించదు; అంత ఎక్కువగా ఉన్నా ఆ పని చేయడం అతనికి కష్టం కూడా కాదు, అది అతడిని అలసిపోయేలా చేసినా సరే.
అల్-అయినీ ఇలా అన్నారు: ఇందులో శుభము యొక్క అంశం ఏమిటంటే, అది పరలోకానికి మరియు ఈ ప్రపంచములో సేవకుడిని కలిగి ఉండడానికి సంబంధించినది. మరియు నిశ్చయంగా పరలోకం ఉత్తమమైనది మరియు శాశ్వతమైనది. లేదా అది ఆమె కోరిన దానికి సంబంధించి ఆమెకు జరగాలని ఉద్దేశించినది కావచ్చు. ఈ స్మరణల వల్ల ఒక సేవకుడి కంటే ఎక్కువ సేవ చేయగల శక్తి పొందవచ్చు.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

