(కోపంలో) ఒక ముస్లిం తన తోటి ముస్లిం నుండి మూడు రాత్రులకంటే ఎక్కువ దూరంగా ఉండుట అనుమతించబడలేదు. (మామూలుగా అలాంటి స్థితిలో) ఒకరినొకరు కలిసినా, ఒకరికొకరు వీపు చూపుకుని మరలి పోతారు. అయితే వారిలో ఉత్తముడు ఎవరంటే - ఎవరైతే తోటి వానికి సలాం చెప్పడంలో ముందడుగు వేస్తాడో
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబీ అయ్యూబ్ అల్ అన్సారీ రజీయల్లాహు అన్హు ఉల్లేఖనం : "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "(కోపంలో) ఒక ముస్లిం తన తోటి ముస్లిం నుండి మూడు రాత్రులకంటే ఎక్కువ దూరంగా ఉండుట అనుమతించబడలేదు. (మామూలుగా అలాంటి స్థితిలో) ఒకరినొకరు కలిసినా, ఒకరికొకరు వీపు చూపుకుని మరలి పోతారు. అయితే వారిలో ఉత్తముడు ఎవరంటే - ఎవరైతే తోటి వానికి సలాం చెప్పడంలో ముందడుగు వేస్తాడో".
Explanation
వీరిద్దరిలో ఉత్తమమైన వారు ఎవరంటే ఎవరైతే తమ మధ్య పెరిగిన దూరాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తాడో మరియు ‘సలాం’తో మరలా కలవడానికి ప్రయత్నం మొదలు పెడతాడో. ఇక్కడ పెరిగిన దూరం అంటే, వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య కోపం కారణంగా పెరిగిన దూరం. అదే అల్లాహ్ హక్కు కొరకు ఎవరితోనైనా దూరం పెంచు కున్నట్లయితే అంటే ఉదాహరణకు – అల్లాహ్’కు అవిధేయత చూపేవానితో దూరం పెంచుకొనుట, ధర్మములో కొత్త విషయాలను సృష్టించే వానితో దూరం పెంచుకొనుట లేదా చెడు సహవాసులతో దూరంంగా ఉండుట – ఈ విధమైన దూరానికి సమయం (ఇన్ని రోజులు) అనేది వర్తించదు. ఆ దూరం తొలగి పోవడం అనేది వారిలో నుండి ఆ చెడులక్షణాలు దూరం కావడం పై ఆధారపడి ఉంటుంది.
Benefits
ఇందులో శాంతి స్థాపన యొక్క ఘనత కనిపిస్తున్నది. శాంతి స్థాపన హృదయాలలో ఉన్న కల్మషాన్ని దూరం చేస్తుంది. అది ప్రేమ, అభిమానముల చిహ్నము
ప్రజలమధ్య సౌభ్రాతృత్వము మరియు దగ్గరితనములను పెంచే ధర్మము ఇస్లాం ధర్మము.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

