“మీలో ఎవరైనా నలుగురు కూర్చుని ఉన్న ఒక సమూహం వద్దకు వచ్చినపుడు అతడు ‘సలాం’ (శాంతి శుభాకాంక్షలు) చెప్పాలి. అలాగే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోవడానికి లేచి నిలుచున్నపుడు (కూడా) అతడు ‘సలాం’ చెప్పాలి. మొదటిది చివరిదానికంటే ఎక్కువ అర్హమైనది కాదు
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “మీలో ఎవరైనా నలుగురు కూర్చుని ఉన్న ఒక సమూహం వద్దకు వచ్చినపుడు అతడు ‘సలాం’ (శాంతి శుభాకాంక్షలు) చెప్పాలి. అలాగే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోవడానికి లేచి నిలుచున్నపుడు (కూడా) అతడు ‘సలాం’ చెప్పాలి. మొదటిది చివరిదానికంటే ఎక్కువ అర్హమైనది కాదు.
Explanation
Benefits
అలాగే ఇందులో నలుగురు కూర్చుని ఉన్న దగ్గరికి వెళ్ళినపుడూ, లేక అక్కడినుండి సెలవు తీసుకుని వెళ్ళునపుడు కూడా ‘సలాం’ చేయాలి అనే ప్రొత్సాహం, హితబోధ ఉన్నది.
అల్-సింది (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి "మరియు అతను వెళ్లిపోవాలనుకుంటే" అనే ప్రకటన, ‘ఆ సమావేశం నుండి’ అని అర్థం, "మొదటి ‘సలాం’ రెండవ దానికంటే అంత అర్హమైనది కాదు" అంటే రెండూ సమానంగా అర్హమైనవే మరియు రెండూ అనుసరించాల్సిన నిజమైన సున్నతులు అని అర్థం. కాబట్టి, మొదటిది ధృవీకరించబడినప్పుడు రెండవదాన్ని వదిలివేయడానికి ఎటువంటి కారణం లేదు.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

