“మీలో ఎవరైనా ప్రతిరోజూ వెయ్యి పుణ్యాలు సంపాదించలేకపోతున్నారా?
Choose an available translation of this Hadeeth
Hadeeth text
సా’ద్ ఇబ్న్ అబీ వఖ్'ఖా స్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉండగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: “మీలో ఎవరైనా ప్రతిరోజూ వెయ్యి పుణ్యాలు సంపాదించలేకపోతున్నారా?" అక్కడ కూర్చుని ఉన్న వారిలో ఒకరు ఇలా అడిగారు: “మాలో ఎవరైనా ఒక రోజులో వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగలరు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ యొక్క ఘనతను కీర్తిస్తూ వంద సార్లు “సుబ్’హానల్లాహ్” అనండి. తద్వారా మీ కొరకు వెయ్యి పుణ్యాలు రాయబడతాయి, లేదా వెయ్యి పాపాలు తుడిచి వేయబడతాయి” అన్నారు.”
Explanation
Benefits
అల్లాహ్ ను కీర్తించడం మరియు స్మరించడం అనే సద్గుణం ఎంత ఘనమైనదో ఇందులో కనిపిస్తుంది. ‘సుబ్’హానల్లాహ్’ అని పలకడంలో ఒక వ్యక్తికి ఖర్చయ్యేది ఏమీ లేదు. కాని ఈ సాధారణ చర్యయే అతనికి ఈ గొప్ప ప్రతిఫలాన్ని సంపాదించి పెడుతుంది.
సత్కార్యాలు చేయడం వైపు ఆలస్యం చేయకుండా త్వరపడాలనే సహాబాల ఆత్రుత ఇందులో మనకు కనిపిస్తుంది.
మంచిపనులు పదిరెట్లుగా గుణించబడతాయి – దివ్య ఖుర్’ఆన్ లోని ఒక ఆయతులో అల్లాహ్ ఈ విధంగా పేర్కొన్నాడు: [ఎవరు ఒక సత్కార్యం చేస్తాడో అతనికి, దానికి పదిరెట్లు ప్రతిఫలం ఉంటుంది.] (సూరహ్ అల్ అన్’ఆం (6:160)). నిజానికి ఇది సత్కార్యాల గుణకారం యొక్క అత్యల్ప స్థాయి, వాస్తవానికి అది ఏడు వందల రెట్లు వరకు ఉండవచ్చు.
కొన్ని హదీథులలో, "లేదా వెయ్యి పాపాలు తుడిచి వేయబడతాయి" అనే పదబంధంలోని "లేదా" (أو) అనే పదం స్థానములో "మరియు" (و) అనే పదం ఉన్నది. దీనిని అల్-ఖారీ (రహిమహుల్లాహ్) ఇలా వివరించారు: అరబీ భాషలో 'మరియు' (أو) అనే సముచ్చయం (రెండు పదబంధాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే పదం) కొన్నిసార్లు 'లేదా' (أو) అనే అర్థాన్ని కలిగి ఉంటుంది, కనుక రెండు కథనాల మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు. కనుక దానిని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు – ఎవరైతే ‘సుబ్’హానల్లాహ్’ అని వంద సార్లు పలుకుతాడో, అతనికి వెయ్యి పుణ్యాలు వ్రాయబడతాయి మరియు అతని ఖాతాలో పాపాలు ఉంటే, కొన్ని తొలగించబడతాయి మరియు కొన్ని పుణ్యాలు లభిస్తాయి. అలాగే ఇక్కడ ‘లేదా’ (أو) అనే పదం, ‘మరియు’ (و) లేదా ‘బదులుగా’ (بل) అనే అర్థాలను కూడా ఇస్తుంది. ఈ అర్థంలో అతడు రెండు ఫలితాలను పొందగలడు. మరియు నిశ్చయంగా అల్లాహ్ యొక్క అనుగ్రహం వీటన్నింటికన్నా గొప్పది. చివరికి దీని సారాంశం ఏమిటంటే: “ఎవరైతే వందసార్లు ‘సుబ్’హానల్లాహ్’ అని పలుకుతాడో అతనికి వెయ్యి పుణ్యాలు రాయబడతాయి, వెయ్యి పాపాలు తుడిచి వేయబడతాయి.”
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

