ఆమె పాలుత్రాగే తన శిశువుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్దకు రాగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఆ శిశువును తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు, అయితే ఆ శిశువు ఆయన దుస్తులపై మూత్రం పోసాడు, వెంటనే ఆయన నీటిని తెప్పించి దానిపై చిలకరించారు, దానిని (వస్త్రాన్ని) కడగలేదు
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ఉమ్మె ఖైస్ బింత్ మిహ్సన్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ఆమె పాలుత్రాగే తన శిశువుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్దకు రాగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఆ శిశువును తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు, అయితే ఆ శిశువు ఆయన దుస్తులపై మూత్రం పోసాడు, వెంటనే ఆయన నీటిని తెప్పించి దానిపై చిలకరించారు, దానిని (వస్త్రాన్ని) కడగలేదు.
Explanation
Benefits
మంచిగా వ్యవహరించాలని, వినయంతో మెలగాలని, చిన్నపిల్లల పట్ల మృదువుగా వ్యవహరించాలని మరియు పిల్లలను గౌరవించడం, ఒడిలో కూర్చోబెట్టుకోవడం వంటి వాటి ద్వారా వారి పెద్దల హృదయాలను సంతోషపరచాలని ప్రోత్సహించబడింది.
మగశిశువు అన్నం తినే వయస్సుకు చేరకపోతే అతని మూత్రం మాలిన్యంగా పరిగణించబడుతుందా?.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ చర్యను నద్’హా అంటారు, ఇది ఆహారం తినడం ప్రారంభించని మగ శిశువుకు మాత్రమే ప్రత్యేకం. అయితే ఆడ శిశువు చిన్నదైనప్పటికీ, ఆమె మూత్రం పడిన వస్త్రాన్నిమ తప్పనిసరిగా కడగాలి.
తల్లి పాలు త్రాగే పసిబిడ్డ మలాన్ని, ఇతర అశుద్దాల వలె కడగడం తప్పనిసరి.
నీటితో కడగటంతో పాటు క్రింది అదనపు విషయం కూడా అనివార్యం.
ఒకటి: అశుద్ధి నుండి త్వరగా స్వచ్ఛత, పవిత్రత పొందడానికి మరియు మరచిపోకుండా ఉండటానికి అశుద్ధ స్థలాన్ని శుభ్రపరచడంలో తొందరపడటం.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

