HadeethEnc · 1.29.0
ఓ రసూలుల్లాహ్! (కరువు వలన) సంపద నాశనమైంది మరియు దారులు మూసుకుపోయాయి, మాపై వర్షం కురిపించమని అల్లాహ్ తో దుఆ చేయండి
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒక వ్యక్తి జుమా రోజున మస్జిదులోకి దారుల్ ఖదా వైపు ఉన్న ద్వారం నుండి ప్రవేశించాడు, అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం (మెంబరుపై) నిలబడి ఖుత్బహ్ (ఉపన్యాసం) ఇస్తున్నారు, అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు తిరిగి నిలబడి, ఇలా అన్నాడు: ఓ రసూలుల్లాహ్! (కరువు వలన) సంపద నాశనమైంది మరియు దారులు మూసుకుపోయాయి, మాపై వర్షం కురిపించమని అల్లాహ్ తో దుఆ చేయండి, అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులు పైకెత్తి, ఇలా దుఆ చేశారు: «అల్లాహుమ్మ అగిస్నా, అల్లాహుమ్మ అగిస్నా, అల్లాహుమ్మ అగిస్నా (ఓ అల్లాహ్! మాకు వర్షం పంపు, ఓ అల్లాహ్! మాకు వర్షం పంపు, ఓ అల్లాహ్! మాకు వర్షం పంపు)». అనస్ తెలిపారు: 'అల్లాహ్ సాక్షిగా! ఆ సమయంలో మేము ఆకాశంలో ఒక్క మేఘాన్ని కూడా, చిన్న మేఘపు తునకను కూడా చూడలేదు. మాకు మరియు సల్ (ఒక పర్వతం పేరు) మధ్య ఇల్లు లేదా నివాసం ఏదీ అడ్డుగా లేదు (ఆకాశం స్పష్టంగా ఉంది).' ఇంకా ఆయన ఇలా తెలిపారు: 'అప్పుడు ఆయన ﷺ వెనుక నుండి ఒక డాలు (shield) అంతటి మేఘం ఉద్భవించింది. అది ఆకాశం మధ్యలోకి రాగానే విస్తరించింది, ఆ తర్వాత వర్షం కురిసింది. అల్లాహ్ సాక్షిగా! మేము ఆరు రోజుల పాటు సూర్యుడిని చూడలేదు.' తరువాత, జుమా రోజున ఒక వ్యక్తి అదే ద్వారం గుండా ప్రవేశించాడు, అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బహ్ ఇస్తున్నారు. అతను ఆయన వైపుకు తిరిగి నిలబడి, ఇలా అన్నాడు: "ఓ రసూలుల్లాహ్! (వరదల వలన) సంపద నాశనమవుతోంది, మరియు మార్గాలు మూసుకుపోయాయి, అల్లాహ్ తో వర్షం శాంతించాలని దుఆ చేయండి". ఇంకా ఆయన తెలిపారు: అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతులను పైకి ఎత్తి, ఇలా దుఆ చేశారు: «అల్లాహుమ్మ హవాలైనా వలా అలైనా, అల్లాహుమ్మ అలల్ ఆకామి వజ్జీరాబి, వ బుతూనీల్ ఔదీయతి, వ మనాబితిష్షజరతి (ఓ అల్లాహ్! మా చుట్టూ కురిపించు, మాపై కాదు. ఓ అల్లాహ్! దానిని చిన్న కొండలపై, గుట్టలపై, లోయల అంతర్భాగాలపై, మరియు చెట్లు మొలిచే స్థలాలపై కురిపించు)». ఆయన తెలిపారు: అప్పుడు వర్షం నిలిచిపోయింది, మరియు మేము ఎండలో నడుచుకుంటూ బయటకు వచ్చాము. షరీక్ ఇలా తెలిపారు: నేను అనస్ బిన్ మాలిక్ ను అడిగాను: అతను మొదటి వ్యక్తేనా? దానికి ఆయన: «నాకు తెలియదు» అన్నారు.
02
Explanation
ఒక పల్లెటూరి వ్యక్తి జుమా రోజున, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఇంటి వైపు ఉన్న మస్జిద్ పశ్చిమ ద్వారం నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్ లోకి ప్రవేశించాడు, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బహ్ ఇస్తున్నారు (ప్రసంగిస్తున్నారు). ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపు తిరిగి ఇలా అన్నాడు: "ఓ రసూలుల్లాహ్ ప్రవక్తా! పశువులు (ఆకలితో) నశించిపోయాయి, ప్రజలను రవాణా చేసే జంతువులు చనిపోవడం లేదా ఆకలితో బలహీనపడటం వల్ల మార్గాలు మూసుకుపోయాయి, కావున మాపై వర్షం కురిపించమని అల్లాహ్ ను ప్రార్థించండి". అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను పైకి ఎత్తి, ఇలా ప్రార్థించారు: "ఓ అల్లాహ్! మాపై వర్షాన్ని కురిపించు, ఓ అల్లాహ్! మాపై వర్షాన్ని కురిపించు, ఓ అల్లాహ్! మాపై వర్షాన్ని కురిపించు." అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఇంకా ఇలా తెలిపినారు: అల్లాహ్ సాక్షి! అపుడు ఆకాశంలో ఒక్క మేఘం ముక్క కూడా లేదు, మరియు మస్జిద్ లో ఉన్న మాకు మరియు మస్జిద్ కు పశ్చిమాన ఉన్న సలయి కొండకు మధ్య, ఏ వైపు నుండి మేఘాలు వస్తాయో ఆ వైపున, మా దృష్టికి అడ్డువచ్చే ఏ ఇళ్ళు గానీ, కట్టడాలస గానీ లేవు. అనస్ రదియల్లాహు అన్హు తెలిపారు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వెనక నుండి ఒక డాలు వంటి గుండ్రని మేఘం పైకి వచ్చింది, అది మదీనా ఆకాశం మధ్యలోకి రాగానే వ్యాపించి, వర్షం కురిపించడం మొదలుపెట్టింది. అల్లాహ్ సాక్షి! మేము తరువాతి జుమా వరకు వర్షం కారణంగా సూర్యుడిని చూడలేదు, అప్పుడు ఒక వ్యక్తి అదే ద్వారం గుండా ప్రవేశించాడు. అపుడు కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఖుత్బహ్ ఇస్తున్నారు. అతను నిలబడి ఆయన వైపు తిరిగి, ఇలా అన్నాడు: ఓ రసూలుల్లాహ్! (భారీ వర్షం, వరదల వలన) సంపద నాశనమైంది, మార్గాలు మూసుకుపోయాయి, మాపై నుండి ఈ వర్షాన్ని ఆపమని అల్లాహ్ తో దుఆ చేయండి. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులు పైకెత్తి, ఇలా ప్రార్ధించారు: ఓ అల్లాహ్! మాపై కాకుండా మా చుట్టు ప్రక్కల వర్షాన్ని కురిపించు. ఓ అల్లాహ్! కొండలు, గుట్టలు, లోయలు మరియు చెట్లు మొలిచే చోట్లలో వర్షాన్ని కురిపించు. అనస్ ఇలా అన్నారు: అపుడు మబ్బులు విడిపోయాయింది, మేము ఎండలో నడుచుకుంటూ బయటకు వచ్చాము.
03
Benefits
జీవనోపాధి కొరకు దుఆ చేయడం మరియు భూమిలో ప్రయాణించడం వంటి మార్గాలను అవలంబించడం అల్లాహ్ పై తవక్కుల్ కు వ్యతిరేకం కాదు.
వర్షం కోసం ఈ ప్రవచనాత్మక దుఆను పఠించడం ముస్తహబ్'గా పరిగణించబడింది.
వర్షం వల్ల నష్టం కలిగినప్పుడు ఇస్తిస్హా -వాతావరణం నిర్మలంగా ఉండాలని, వర్షం ఆగిపోవాలని కోరవచ్చు. మరియు వర్షం కొండలు, గుట్టలు మరియు లోయల అడుగు భాగాలపై పడాలని ప్రత్యేకంగా కోరాలి; ఎందుకంటే అవి వ్యవసాయానికి మరియు పశువుల మేతకు మరింత అనుకూలమైన ప్రదేశాలు.
సజీవులుగా అందుబాటులో ఉన్నవారిలో నుండి ధర్మనిష్ఠ మరియు దైవభీతి గలవారని భావించబడే వారిని దుఆ చేయమని అడగటం సమంజసం, మరియు ఇది ధర్మసమ్మతమైన వసీలా. అయితే, సృష్టిరాశులలో ఎవరి హోదానైనా, అంతస్తునైనా వారు సజీవులైనా సరే, మృతులైనా సరే, వసీలాగా చేసుకోవటం సమ్మతం కాదు; ఎందుకంటే ఇది షిర్క్ యొక్క సాధనాలలో ఒకటి.
దుఆలో మొండిగా అడగటం (పట్టుబడటం) మరియు దానిని పదేపదే చేయటం సున్నతు.
జుమా దినమునాడు (ఖుత్బహ్ ప్రసంగ సమయంలో) అవసరమైతే ఖతీబ్ తో మాట్లాడుటకు అనుమతివ్వబడింది.
వర్షమును కురిపించుట మరియు దానిని నిలిపివేయటంలో అల్లాహ్ యొక్క అద్భుతమైన సామర్ధ్యం స్పష్టమవుతున్నది.
నష్టం కలిగించే ప్రదేశాలలో వర్షాన్ని ఆపమని, నష్టం లేని ప్రదేశాలలో కురిపించమని దుఆ చేయడంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వివేకం స్పష.
ఖుత్బహ్ లో ఇస్తిస్ఖా చేయుట (వర్షం కోసం ప్రార్థించుట) షరియత్’లోని భాగమే.
దుఆలో చేతులు ఎత్తడం; ఎందుకంటే అందులో తన నిస్సహాయతను ప్రదర్శించడం, మరియు ఆ చేతులలో అనుగ్రహం పొందాలనే ఆకాంక్షను కోరడం అనే భావం ఉంది. ఈ సందర్భంలో చేతులు ఎత్తడంపై విద్వాంసులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
వర్షాన్ని కురిపించడంలో మరియు దానిని ఆపడంలో ఆయన దుఆ వెంటనే ఆమోదించబడటం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యాన్ని సూచించే సూచనలలో ఒకటి.

Attribution
[అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares