“నువ్వు కావాలనుకుంటే (ఈ వ్యాధి పట్ల) సహనం వహించు, నువ్వు స్వర్గంలో ప్రవేశిస్తావు; లేదా, నువ్వు కోరుకుంటే, నిన్ను స్వస్థపరచమని నేను అల్లాహ్‌ను వేడుకుంటాను.”
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒకసారి ఆయన అతా ఇబ్న్ అబీ రబాహ్ తో ఇలా అన్నారు: "స్వర్గవాసులలోని ఒక స్త్రీని నేను నీకు చూపించనా?" దానికి అతా “తప్పనిసరిగా చూపిండి" అని అన్నారు: . అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు అతనితో ఇలా అన్నారు: “ఆ నలుపు రంగు స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నది: “నేను మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాను. దాని కారణంగా (స్పృహ తప్పి పడిపోయినపుడు) నా శరీరం (పై బట్టలు తొలగిపోయి) అనాచ్చాదితం అవుతున్నది. నా కొరకు అల్లాహ్’ ను ప్రార్థించండి”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నువ్వు కావాలనుకుంటే (ఈ వ్యాధి పట్ల) సహనం వహించు, నువ్వు స్వర్గంలో ప్రవేశిస్తావు; లేదా, నువ్వు కోరుకుంటే, నిన్ను స్వస్థపరచమని నేను అల్లాహ్‌ను వేడుకుంటాను.”. దానికి ఆమె ఇలా అన్నది: “అయితే నేను సహనం వహిస్తాను. అయితే మూర్ఛ స్థితిలో నేను అనాచ్ఛాదితం అవుతున్నాను. నేను అలా అనాచ్ఛాదితం కాకుండా ఉండేలా చూడమని అల్లాహ్’కు దుఆ చేయండి.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె కొరకు ఆ విధంగా దుఆ చేసినారు.
Explanation
Benefits
ఇమాం అన్-నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: "మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి అత్యంత సంపూర్ణమైన ప్రతిఫలం లభిస్తుంది అనడానికి సాక్ష్యం ఇందులో ఉంది.
ఈ హదీథులో మహిళా సహచరుల రదియల్లాహు అన్హున్న యొక్క పవిత్రత, వినయం మరియు సచ్ఛీలత, తమను తాము కప్పుకోవడం పట్ల వారి ఆసక్తిని గమనించవచ్చు, ఎందుకంటే ఈ స్త్రీ (తన వ్యాధి గురించి కాక) శరీరంలోని ఏదైనా భాగం బహిర్గతము అవుతుందేమోనని ఎక్కువగా భయపడుటను గమనించవచ్చు.
ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “కఠినమైన నియమాన్ని ఎంచుకుని, దానికి కట్టుబడి ఉండడం ద్వారా తాను బలహీన పడను అని, తన సమర్థత పట్ల తనకు అవగాహన ఉన్న వ్యక్తి – సులభతరమైన దాని కంటే (ఎక్కువ పుణ్యఫలాన్నిచ్చే) కఠినమైన నియమాన్నే ఎంచుకోవడం మంచిది.
ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: అన్ని వ్యాధులకు దుఆ చేయడం ద్వారా చికిత్స చేయడం మరియు ఆ విధంగా అల్లాహ్ ను ఆశ్రయించడం అనేది ఔషధ చికిత్సల కంటే కూడా ఎక్కువ ప్రభావవంతమైనది మరియు ప్రయోజనకరమైనదని ఈ హదీథు సూచిస్తున్నది. దీని ప్రభావం శరీరంపై భౌతిక చికిత్సల కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే, దాని ప్రభావం రెండు షరతులపై ఆధారపడి ఉంటుంది: 1. రోగి వైపు నుండి: సంకల్పము (నియ్యత్) యొక్క నిజాయితీ మరియు 2. దుఆ చేయు వ్యక్తి వైపు నుండి: ఇది అతని సంకల్పము యొక్క బలం మరియు అల్లాహ్ పట్ల అతని ‘తఖ్వా’ (భయభక్తులు) మరియు అల్లాహ్ పై అతని భరోసా (తవక్కుల్) ద్వారా అతని హృదయం బలంగా ఉండడం. వల్లాహు ఆ’లము (అల్లాహ్ యే అన్నీ ఎరిగినవాడు)
ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: సంకల్ప పూర్వకంగా వైద్య చికిత్స తీసుకోకుండా ఉండటం అనుమతించదగినది అనడానికి ఈ హదీథు ఒక రుజువు.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

