“విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత ఎవరైతే “ఆయతుల్ కుర్సీ” పఠిస్తాడో, మరణం తప్ప, అతడిని స్వర్గములో ప్రవేశించడం నుండి ఏమీ నిషేధించదు.”
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ ఉమామహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత ఎవరైతే “ఆయతుల్ కుర్సీ” పఠిస్తాడో, మరణం తప్ప, అతడిని స్వర్గములో ప్రవేశించడం నుండి ఏమీ నిషేధించదు.”
Explanation
[అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు, ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో – ఆయన అనుజ్ఞ లేకుండా – సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందు ఉన్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు.] (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (సూరహ్ అల్ బఖరహ్ 2:255)
Benefits
విధిగా ఆచరించవలసిన ప్రతి సలాహ్ తరువాత (ప్రతి ఫర్జ్ నమాజు తరువాత) ఈ మహోన్నతమైన ఆయతు పఠించాలని సిఫారసు చేయబడుతున్నది.
స్వర్గములో ప్రవేశించడానికి సత్కార్యాలు చేయుట ఒక కారణం అవుతుంది.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

