العصر

 

Al-'Asr

 

The Declining Day

1 - Al-'Asr (The Declining Day) - 001

وَٱلۡعَصۡرِ
కాలం సాక్షిగా![1]
[1] అల్లాహ్ (సు.తా.) తాను కోరిన దాని సాక్ష్యం తీసుకుంటాడు. కాని మానవుడు అల్లాహ్ (సు.తా.) తప్ప మరెవ్వరి సాక్ష్యం తీసుకోరాదు.

2 - Al-'Asr (The Declining Day) - 002

إِنَّ ٱلۡإِنسَٰنَ لَفِي خُسۡرٍ
నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు![1]
[1] ఆ మానవుడు ఎవడైతే విశ్వసించడో మరియు సత్కార్యాలు చేయడో తన కాలాన్ని వృథా కాలక్షేపంలో, నిషేధించిన పనులు చేయటంలో పేరాసతో గడుపుతాడో! అలాంటి వాడు పరలోకంలో నరకాగ్నికి ఇంధనం అవుతాడు.

3 - Al-'Asr (The Declining Day) - 003

إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّـٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప![1]
[1] ఇలాంటి నష్టం నుండి తప్పించుకోగల వారు ఎవరంటే: ఒకే ఒక్క ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు అల్లాహ్ (సు.తా.) ఆదేశాలను పాటించేవారు, అల్లాహ్ (సు.తా.) నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండేవారు, కష్టకాలంలో సహనం వహించి, సత్య ధర్మ ప్రచారం చేస్తూ ఉండేవారు.

[sc name="verse"][/sc]

Scroll to Top