నిశ్చయంగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, సాలిఖా (జనాజాపై పెద్దగా పెడబొబ్బలు పెడుతూ విలపించే స్త్రీ), హాలిఖా (తలజుట్టు గొరిగించుకునే స్త్రీ) మరియు షక్కా (దుఃఖంలో దుస్తులు చింపుకునే స్త్రీ) లను తిరస్కరించారు
అబూ బుర్'దహ్ బిన్ అబూ మూసా రదియల్లాహు అన్హు ఉల్లేఖన: అబూ మూసా తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు, అతని తల అతని కుటుంబంలోని ఒక మహిళ ఒడిలో ఉండగా అతను స్పృహ కోల్పోయారు. మరియు అతను ఆమెకు ఏ విధంగానూ (ఆమె పెడబొబ్బలకు నిస్పృహ వలన) స్పందించలేకపోయారు. స్పృహ తిరిగి వచ్చిన తర్వాత, అతను…

