“నిశ్చయంగా, ఈ లోకంలో ప్రజలను హింసించేవారిని అల్లాహ్ శిక్షిస్తాడు.”
Choose an available translation of this Hadeeth
Hadeeth text
హిషామ్ ఇబ్న్ హకీమ్ ఇబ్న్ హిజామ్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖిస్తున్నారు: ఆయన సిరియాలో ఉన్నపుడు, ఒకసారి ఎండలో నిలబెట్టబడిన కొంతమంది నబాటేనియన్లను దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఆయన అక్కడ ఉన్న వారిని “వారి విషయం ఏమిటి?” అని ప్రశ్నించారు. దానికి వారు: “జిజియా చెల్లించనందుకు వారు నిర్బంధించబడినారు” అని బదులిచ్చినారు. అప్పుడు హిషామ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “నేను సాక్ష్యమిస్తున్నాను, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నిశ్చయంగా నేను విన్నాను; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా, ఈ లోకంలో ప్రజలను హింసించేవారిని అల్లాహ్ శిక్షిస్తాడు.”
Explanation
Benefits
అవిశ్వాసులనైనా సరే అధర్మముగా, అన్యాయముగా, ఏ కారణమూ లేకుండా ప్రజలను హింసించుట నిషేధము (హరాం).
ఈ హదీథు దౌర్జన్యానికి వ్యతిరేకంగా దౌర్జన్యకారులను హెచ్చరిస్తున్నది.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం యొక్క సహచరులు, మంచిని ఆజ్ఞాపించడానికి మరియు చెడును నిషేధించడానికి కట్టుబడి ఉన్నారు.
ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథు అధర్మంగా, అన్యాయంగా ఎవరినైనా హింసించడాన్ని ఖండిస్తున్నది. అయితే ధర్మబధ్ధంగా ఎవరినైనా కఠినంగా శిక్షించడం, ఖిసాస్ (ప్రాణానికి బదులుగా ప్రాణం); మరియు షరియత్’లో నిర్థారించబడిన శిక్షలు, అలాగే క్రమశిక్షణ గరుపుట కొరకు విధించబడే శిక్షలు, మొదలైనవి ఇందులోనికి రావు.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

