“మీలో ఎవరైనా ఉదూ చేసి, తరువాత (పాదములకు) “ఖుఫ్”లను (“ఖుఫ్ఫైన్” – పలుచని తోలుతో చేయబడిన మేజోళ్ళు) తొడుగుకున్నట్లయితే, వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే అతడు నమాజు ఆచరించవచ్చును, “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోనైతే తప్ప వాటిని కాళ్ళనుండి తీయకుండా వాటి పైన తడి చేతులతో ‘మసహ్’ చేయవచ్చును (తడమవచ్చు).”
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా ఉదూ చేసి, తరువాత (పాదములకు) “ఖుఫ్”లను (“ఖుఫ్ఫైన్” – పలుచని తోలుతో చేయబడిన మేజోళ్ళు) తొడుగుకున్నట్లయితే, వాటిని తొడిగి ఉన్న స్థితిలోనే అతడు నమాజు ఆచరించవచ్చును, “జనాబత్” స్థితికి (సంభోగానంతర అశుద్ధ స్థితికి) లోనైతే తప్ప వాటిని కాళ్ళనుండి తీయకుండా వాటి పైన తడి చేతులతో ‘మసహ్’ చేయవచ్చును (తడమవచ్చు).”
Explanation
Benefits
ఖుఫ్ఫైన్’పై మసహ్ చేయుటకు స్థానికులకు కాలపరిమితి: ఒక దినము మరియు ఒక రాత్రి (24 గంటలు); ఖుఫ్ఫైన్’పై మసహ్ చేయుటకు ప్రయాణీకులకు కాలపరిమితి: మూడు దినములు మరియు మూడు రాత్రులు (72 గంటలు);
ఖుఫ్ఫైన్ పై మసహ్ చేయుట కేవలం ‘హదథ్ అల్ అస్గర్’ స్థితికి (చిన్న అపరిశుద్ద స్థితికి) మాత్రమే పరిమితం. ‘హదథ్ అల్ అక్బర్’ స్థితిలో ఖుఫ్ఫైన్ పై మసహ్ చేయుటకు అనుమతి లేదు. ఆ స్థితిలో ఖుఫ్ఫైన్’ను పాదములనుంచి పూర్తిగా తొలగించి (గుసుల్’లో భాగంగా) వాటిని శుభ్రంగా కడగవలసి ఉంటుంది.
యూదుల విధానానికి వ్యతిరేకంగా ఉండేలా, కాళ్ళకు పాదరక్షలు, ఖుఫ్ఫైన్ లాంటివి తొడిగి ఉన్న స్థితిలోనే నమాజు ఆచరించమని సిఫార్సు చేయబడుతున్నది. అయితే పాదరక్షలు లేదా ఖుఫ్ఫైన్’లు అపరిశుబ్రంగా ఉన్నా, లేక ఏదైనా మలినం అంటుకుని ఉన్నా, లేక తోటి వారికి కష్టం లేదా అసౌకర్యం కలిగేలా ఉన్నా, లేక అన్ని సదుపాయాలు అమర్చబడి, చక్కగా పరిశుభ్రంగా ఉన్న మస్జిదులలో అలా చేయరాదు.
ఖుఫ్ఫైన్’పై మసహ్ చేసే అనుమతి ఈ ఉమ్మత్’కు ఉదూ విషయాన్ని సులభతరం మరియు మరింత సౌకర్యవంతం చేస్తుంది.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

