افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#8378[ప్రామాణికమైన హదీథు]
HadeethEnc · 1.29.0

“ఉదూను సమగ్రంగా, పరిపూర్ణంగా చేయి; ఒక్కొక్క వేలు మధ్య వేలుతో శుభ్రం చేయి, ముక్కు లోనికి నీరు బాగా ఎక్కించి నీటిని చీది వేయి, నీవు ఉపవాసపు స్థితిలో ఉంటే తప్ప”

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

లఖీత్ ఇబ్న్ సబిరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: లఖీత్ ఇబ్న్ సబిరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
“బనూ అల్ మున్తఫిఖ్ తెగవారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినపుడు నేను వారికి నాయకునిగానో లేదా వారిలో ఒకనిగానో ఉన్నాను. మేము చేరుకున్నపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిలో లేరు. ఇంటిలో విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉన్నారు. ఆమె మా కోసం ‘ఖజీరా’ అనే వంటకం తయారు చేయాలని ఆదేశించినారు, ఆ వంటకం తయారైంది కూడా. తరువాత ఖర్జూరాలు ఉన్న ఒక పళ్ళెమును మా ముందు ఉంచడం జరిగింది. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి వచ్చినారు, వచ్చి “మీకు ఏదైనా వడ్డించబడిందా లేదా మీ కోసం ఏదైనా తయారు చేయడానికి ఆదేశించడం జరిగిందా?” అని అడిగారు. మేము “అవును, ఓ రసూలుల్లాహ్! అలా ఆదేశించబడింది” అని జవాబిచ్చాము. మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి కూర్చుని ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఒక గొర్రెల కాపరి గొర్రెలను తోలుకుంటూ వచ్చి వాటిని మందలో కలపడానికి తీసుకు వెళుతున్నట్లు చూశాము. అతని వెంట కొత్తగా పుట్టిన గొర్రెపిల్ల ఉన్నది, అది అరుస్తూ ఉన్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని “ఓ ఫలానా! అది (ఆ తల్లి గొర్రె) ఏమి ఈనింది?” అని అడిగారు. దానికి అతడు: “ఆడ గొర్రెపిల్ల” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే ఆ గొర్రెపిల్లకు బదులుగా ఒక పెద్ద గొర్రెను వధించు” అన్నారు. తరువాత (మాతో) “పెద్ద గొర్రెను మీకోసం వధిస్తున్నామని అనుకోకండి. మా వద్ద వంద గొర్రెలున్నాయి. ఆ సంఖ్య పెరగడం మాకు ఇష్టం లేదు. ఆ సంఖ్యను నిలకడగా అలాగే ఉంచడానికి, కొత్తగా గొర్రెపిల్ల పుట్టినపుడల్లా ఒక పెద్ద గొర్రెను వధిస్తూ ఉంటాము” అన్నారు. తరువాత నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు ఒక భార్య ఉంది, ఆమె నాలుకలో ఏదో తప్పు ఉంది, అంటే ఆమె దుర్భాషలాడుతుంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అయితే ఆమెకు విడాకులు ఇవ్వు". నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము చాలా కాలంగా కలిసి ఉన్నాము, ఆమె ద్వారా నాకు పిల్లలు ఉన్నారు”. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అయితే, ఆమెను ఆజ్ఞాపించు, ఆదేశించు" అంటే: ఆమెకు సలహా ఇవ్వు. "ఆమెలో మంచితనం ఉంటే, ఆమె కట్టుబడి ఉంటుంది. అయితే నీవు నీ బానిసను కొట్టినట్లు నీ భార్యను కొట్టకు." తరువాత నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు ‘ఉదూ’ గురించి చెప్పండి. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఉదూను సమగ్రంగా, పరిపూర్ణంగా చేయి; ఒక్కొక్క వేలు మధ్య వేలుతో శుభ్రం చేయి, ముక్కు లోనికి నీరు బాగా ఎక్కించి నీటిని చీది వేయి, నీవు ఉపవాసపు స్థితిలో ఉంటే తప్ప”.
02

Explanation

ఈ హదీథులో లఖీత్ బిన్ సబ్రహ్ రదియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: తన బనూ మున్తఫిఖ్ తెగ నుండి తాను మరి కొందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలవడానికి వెళ్ళినాము. ఆ సంఘటనను వివరిస్తూ అతను ఇలా అన్నాడు: మేము వెళ్ళినపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంట్లో లేరు, కానీ విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉన్నారు. ఆమె మా కోసం పిండి మరియు కొవ్వుతో ఒక సూప్ తయారు చేయమని ఆదేశించినారు మరియు మాకు ఒక పళ్ళెంలో ఖర్జూర పండ్లు వడ్డించబడినాయి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి మమ్మల్ని: “మీకు ఏమైనా వడ్డించబడిందా?” అని అడిగినారు. మేము “అవును, వడ్డించబడింది” అన్నాము. లఖీత్ ఇంకా ఇలా అన్నారు: “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో కూర్చుని ఉండగా, ఒక గొర్రెల కాపరి, చేతులలో అరుస్తూ ఉన్న ఒక చిన్న గొర్రెపిల్లను ఎత్తుకుని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొర్రెలను తోలుకుంటూ వచ్చి వాటిని మందలో కలిపి, అవి నిద్రించే స్థలానికి తోలుతున్నాడు; అతడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అది (తల్లి గొర్రె) దేనిని జన్మించింది?” అని అడిగారు.” దానికి అతడు: “ఆడ గొర్రెపిల్ల” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: “దాని స్థానములో ఒక పెద్ద గొర్రెను వధించు” అన్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ప్రత్యేకంగా మీ కోసమే దీనిని వధించేందుకు శ్రమిస్తున్నామని అనుకోకండి, మా దగ్గర వంద గొర్రెలు ఉన్నాయి, మేము ఆ సంఖ్య పెరగాలని అనుకోవడం లేదు; అందుకనే కొత్తగా గొర్రెపిల్ల పుట్టినపుడల్లా, దాని స్థానంలో ఒక పెద్ద గొర్రెను వధిస్తూ ఉంటాము”. తరువాత లఖీత్ ఇలా అన్నారు: “ఆ పిదప నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నా భార్య గయ్యాళి, చాలా అసభ్యకరమైన భాషలో మాట్లాడుతుంది. ఆమెతో ఎలా వేగాలి? (ఏమి చేయాలి?)” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “ఆమెకు విడాకులివ్వు” అన్నారు. నేను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఆమె చాలా కాలంగా నా సహచరిణిగా (భార్యగా) ఉంది; ఆమెతో నాకు పిల్లలు కూడా కలిగారు” అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “అయితే ఆమెకు ఉపదేశించు, బోధించు, సలహా ఇవ్వు, ఆదేశించు. ఆమెలో ఏ కొద్దిగా మంచి ఉన్నా ఆమె నీ సలహాకు, ఆదేశానికి ప్రతిస్పందిస్తుంది. ఆమె స్పందించకపోతే, ఆమెను దండించు, కానీ తీవ్రంగా కాదు; నీ బానిసను దండించినంత తీవ్రంగా దండించకు.” తరువాత లఖీత్ ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు ‘ఉదూ’ గురించి తెలియజేయండి.” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఉదూ చేయునపుడు నీరు అవయవాల తగిన స్థానాలకు పూర్తిగా చేరుకునేలా చేయి, ప్రతి అంగానికి దాని యొక్క హక్కును చెల్లించు; మరియు ఉదూ ఆచరించునపుడు దాని యొక్క ‘ఫరాయిద్’ మరియు ‘సున్నత్’ ఆచరణలలో దేనినీ వదలకు. నీ కాళ్ళను మరియు చేతులను కడుగునపుడు వాటి వేళ్ళను విడదీసి వాటి మధ్యన కూడా కడుగు; మరియు ఉదూ చేయునపుడు ముక్కులోనికి పుష్కలంగా నీరు పోనిచ్చి ముక్కును చీది వేయి, నీవు ఉపవాసపు స్థితిలో ఉంటే తప్ప, ఎందుకంటే ముక్కు ద్వారా నీరు కడుపులోనికి పోకుండా ఉండుటకు గానూ.”
03

Benefits

అతిథిని సత్కరించుట షరియత్’లోని భాగము.
“అల్-ఇస్బాగ్” (ఉదూను పరిపూర్ణం చేయడం) ఇందులో రెండు విషయాలున్నాయి: 1. ‘ఇస్బాగ్ వాజిబ్’ (విధిగా ఆచరించవలసిన ఇస్బాగ్): ఇది లేకుండా ఉదూ సంపూర్ణం కాదు; ఇది ఆ శరీర భాగానికి విధిగా తగినంతగా నీరు చేరేలా చేయడాన్ని మరియు ఆ శరీర భాగం సంపూర్ణంగా కడగ బడడాన్ని సూచిస్తుంది. 2. ‘ఇస్బాగ్ అల్ ముస్తహబ్’: (సిఫారసు చేయబడిన ఇస్బాగ్): ఉదూ యొక్క చెల్లుబాటు కొరకు ఇది తప్పనిసరి కాదు. ఇది ఉదూలో విధిగా ఆచరించవలసిన దానికంటే ఎక్కువ ఆచరించడాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు ఉదూలో శరీర భాగాన్ని రెండవసారి, మరియు మూడవసారి కడగడం; ఇది సిఫారసు చేయబడిన ఆచరణ; తప్పనిసరి కాదు.
చేతులను, కాళ్ళను కడుగు నపుడు వాటి వేళ్ళను విడదీయాలని సిఫారసు చేయబడినది. విడదీయడం అంటే వాటి మధ్యకు నీరు చేరేలా చేయడం.
అత్’తయ్యిబ్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదూ యొక్క కొన్ని సున్నతులను మాత్రమే ప్రస్తావించినారు, ఎందుకంటే ప్రశ్నించిన వ్యక్తికి ఉదూ యొక్క ప్రాథమిక అంశాలు బాగా తెలుసు.”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంలో అనేక అమోఘమైన విషయాలలో ఒకటి ఏమిటంటే ఇతరుల భావాల పట్ల మరియు వారి మానసిక శ్రేయస్సు పట్ల ఆయన చూపే శ్రద్ధ.
ఉదూ ఆచరణలో నోటిని కడుగుట ‘వాజిబ్’ (విధి) అనడానికి ఈ హదీథు ఒక రుజువు.
ఉదూ చేస్తున్నపుడు, ఉపవాసం ఉన్నవారు తప్ప, ముక్కులోనికి పుష్కలంగా నీటిని ఎక్కించి, ముక్కును చీది శుభ్రం చేయాలనే సిఫార్సుకు ఈ హదీథు ఒక ఋజువు. ఉపవాసం ఉన్న సందర్భంలో ఈ విధంగా నీటిని పుష్కలంగా ముక్కులోనికి ఎక్కించడం సిఫారసు చేయబడలేదు, ఎందుకంటే ఒకవేళ ముక్కు నుండి గొంతులోకి నీరు చేరితే ఆ ఉపవాసం చెల్లదు.
ఈ హదీథు ద్వారా ఇస్లాంను స్వీకరించే ప్రతి ఒక్కరిపై ‘హిజ్రత్’ (వలస) చేయడం తప్పనిసరి కాదని స్పష్టంగా తెలుస్తుంది; ఉదాహరణకు, బను అల్-ముంతఫిక్ మరియు ఇతరులు ‘హిజ్రత్’ చేయలేదు, కానీ వారి ప్రతినిధుల బృందాలను పంపారు. మరియు ఒక వ్యక్తి తన ధర్మాన్ని బహిరంగంగా ఆచరించగలిగే ప్రదేశంలో నివసిస్తుంటే కూడా ఇది వర్తిస్తుంది.

Attribution

[అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...