నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి విషయంలోనూ 'ఇహ్సాన్' (ఉత్తమంగా, దయతో వ్యవహరించడం) ను విధిగా చేశాడు
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ యఅ'లా షద్దాద్ ఇబ్నె ఔస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి విషయంలోనూ 'ఇహ్సాన్' (ఉత్తమంగా, దయతో వ్యవహరించడం) ను విధిగా చేశాడు. కాబట్టి, మీరు చంపినట్లయితే, మంచి పద్ధతిలో చంపండి అంటే మీరు జంతువు ఖుర్బానీ చేసేటప్పుడు, మంచి పద్ధతిలో ఖుర్బానీ చేయండి. మీలో ప్రతి ఒక్కరూ తన కత్తిని బాగా పదును పెట్టుకోవాలి మరియు తన ఖుర్బానీ జంతువుకు ఉపశమనం కలిగించాలి (మొండి కత్తి వలన ఖుర్బానీ సమయంలో జంతువుకు కష్టం కలిగించకూడదు)."
Explanation
అల్’ఖిసాస్ విషయంలో ‘అల్ ఇహ్’సాన్’ పాటించుట: (అల్ ఖిసాస్ – అంటే షరియత్ ప్రకారం ‘ప్రాణానికి ప్రాణము’ అనే నియమం క్రింద, హతుని కుటుంబము క్షమాభిక్ష ప్రసాదించక పోతే, హంతకునికి విధించబడే మరణ శిక్ష): ఆ సందర్భములో హంతకునికి కష్టము, బాధ కలుగకుండా, తేలికగా, అత్యంత వేగంగా అతని ప్రాణం పోయే విధానాన్ని ఎంచుకోవడం.
అల్లాహ్ పేరున జంతువు జిబహ్ చేయ బడునప్పుడు ‘అల్ ఇహ్’సాన్’ పాటించుట: జిబహ్ చేయబడే జంతువు ఎదురుగా (అది చూస్తుండగా) కత్తిని పదును చేయరాదు మరియు ( మందలోని) ఇతర జంతువులు చూస్తుండగా జిబహ్ చేయరాదు.
Benefits
ఏదైనా ప్రాణం తీయునపుడు లేదా అల్లాహ్ పేరున జిబహ్ చేయునపుడు షరియత్ ప్రకారము అల్ ఇహ్’సాన్ పాటించడం జరగాలి.
ఇందులో షరియత్ యొక్క పరిపూర్ణత తెలుస్తున్నది. అది అన్నిరకాల శుభాలను కూడి ఉన్నది, వాటిలో పశుపక్ష్యాదుల పట్ల దయ కరుణ మరియు స్నేహభావన కలిగి ఉండుట ఒకటి.
ఒక మనిషిని, (షరియత్ ప్రకారం) అతడి ప్రాణం తీసిన తరువాత, అతడి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం నిషేధించబడినది.
పశుపక్ష్యాదులను ఏవిధమైన కృరత్వానికి అయినా గురి చేయడం నిషేధించబడినది.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

