“ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు మరియు పరిశుద్ధమైన వాటిని తప్ప మరి దేనినీ అంగీకరించడు. ప్రవక్తలకు ఆదేశించిన దానినే అల్లాహ్ విశ్వాసులకూ ఆదేశించినాడు
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నిశ్చయంగా, అల్లాహ్ పరమ పరిశుద్ధుడు, మరియు పరిశుద్ధమైన దానిని తప్ప మరేమీ అంగీకరించడు. మరియు అల్లాహ్ విశ్వాసులకు, ప్రవక్తలకు ఆజ్ఞాపించిన దానినే మీకూ ఆజ్ఞాపించాడు."; అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఓ ప్రవక్తలారా! పరిశుద్ధమైన వాటిని భుజించండి మరియు మంచి పనులు చేయండి.} (అల్-ముమినూన్: 51); మరియు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఓ విశ్వాసులారా! మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన వాటి నుండే భుజించండి.} (అల్-బఖరహ్: 172); ఆ తర్వాత ప్రవక్త ఒక వ్యక్తి గురించి ప్రస్తావించారు: అతను సుదీర్ఘ ప్రయాణం చేయడం వలన అతని వెంట్రుకలు చిందరవందరగా, దుమ్ము పట్టి ఉన్నాయి. అతను తన చేతులను ఆకాశం వైపు చాచి: 'ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!' అని వేడుకుంటున్నాడు. అయితే, అతని ఆహారం నిషేధించబడినది (హరామ్), అతని పానీయం నిషేధించబడినది, అతని దుస్తులు నిషేధించబడినవి, మరియు అతను నిషేధించబడిన వాటితోనే పోషించబడ్డాడు. అలాంటి వ్యక్తి దుఆ (ప్రార్థన) ఎలా స్వీకరించబడుతుంది?"
Explanation
ఇంకా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హరాం (ధర్మ విరుద్ధమైనది) తినరాదని హెచ్చరించినారు. అది ఆచరణలను నాశనం చేస్తుంది. అది ఆచరణలు (అల్లాహ్ వద్ద) స్వీకరించబడడాన్ని నిరోధిస్తుంది; ఆ బాటసారి ఆమోదయోగ్యమైన స్పష్టమైన మార్గాలను ఉపయోగించినప్పటికీ అతని ఆచరణలు ఆమోదయోగ్యం కావు: ఉదాహరణకు:
మొదటిది: (అల్లాహ్’కు) విధేయతను చూపే వాటిని ఆచరించుటకు అతడు ఎంత దూరం ప్రయాణించినా, అంటే హజ్ చేయడం, జిహాద్ లో పాల్గొనడం, అలాగే బంధుత్వాలను గౌరవించడం, వాటిని నిభాయించడం మొదలైనవి చేసినా, చేస్తూ ఉన్నా.
రెండవది: తల వెంట్రుకలను దువ్వుకోకపోవడం వల్ల చిందరవందరగా ఉన్న వెంట్రుకలు, దుమ్ము కారణంగా రంగు మారిన చర్మం మరియు అతని ఒంటిపై బట్టలు కూడా రంగు మారి, అతను నిస్సహాయంగా దీనస్థితిలో ఉన్నాడు.
మూడవది: అతడు తన రెండు చేతులను ఆకాశం వైపునకు ఎత్తి దుఆ చేయడం.
నాల్గవది: అల్లాహ్’ను ఆయన పేర్ల ద్వారా పట్టుదలతో వేడుకొనడం: “ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!” అంటూ.
ఈ విధంగా ప్రార్థనలకు జవాబు లభించటానికి ఆవశ్యకమైన అన్ని మార్గాలు ఉన్నప్పటికీ, అతడికి ఏ సమాధానమూ లభించ లేదు; ఎందుకంటే అతని ఆహారం, పానీయం మరియు బట్టలు హరాం (అక్రమమైనవి), మరియు అతడు హరాం (ధర్మ విరుద్ధమైన, అక్రమమైన వాటి) ద్వారా పోషించబడ్డాడు. ఈ హదీథులో వర్ణించబడినటువంటి వ్యక్తి విన్నపానికి, అతని వేడుకోలుకు సమాధానం లభించడం దాదాపుగా అసంభవం; దానికి ఎలా సమాధానం లభిస్తుంది?
Benefits
ఇక్కడ ఆచరణలలో నిజాయితీ, మరియు ఆ ఆచరణలు కేవలం అల్లహ్ కొరకు మాత్రమే అయి ఉండాలి మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) విధానానికి, వారి మార్గదర్శకానికీ అనుగుణంగా ఉండాలి అనే ఆదేశం ఉన్నది.
ఇంకా ఇక్కడ, ఆచరణలలో ప్రేరణ కొరకు ప్రోత్సాహకరమైన పద్ధతులను ఉపయోగించుట చూడవచ్చును, ఉదాహరణకు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “”ప్రవక్తలు, సందేశహరులకు ఆదేశించిన వాటినే అల్లాహ్ విశ్వాసులకూ ఆదేశించినాడు”. కనుక, ప్రవక్తలు, సందేశహరులు అలాంటి పనులు చేయమని ఆజ్ఞాపించబడ్డారని విశ్వాసి గ్రహించినప్పుడు, అతను ప్రేరేపించబడతాడు మరియు ఆ ఆచరణల పట్ల, అల్లాహ్ యొక్క ఆదేశాలను పాటించడం పట్ల ప్రోత్సహించబడతాడు.
దుఆలు, వేడుకోలు స్వీకరించబడక పోవడానికి ఉన్న కారణాలలో, వాటికి సమాధానం రాకపోవడానికి ఉన్న కారణాలలో ఒకటి హరాం తినడం.
దుఆలకు సమాధానాలు లభించే సాధనాలలో ఐదు విషయాలున్నాయి, అవి: 1). దీర్ఘకాల ప్రయాణాలు: సుదీర్ఘకాలం ప్రయాణంలో ఉంటే మనిషి అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా విచ్చిన్నం అవుతాడు. అతని దయనీయ స్థితి, అతని విషాదము, ఇవి అతని దుఆలు సమాధాన పరచబడుటకు ఉన్న ముఖ్య కారణాలలో ఒకటి; 2). తీవ్రమైన అవసరంలో ఉన్న పరిస్థితి; 3) దుఆ చేయుట కొరకు ఆకాశం వైపునకు చేతులు పైకి ఎత్తడం; 4) అల్లాహ్’ తన ప్రభువు అని పేర్కొంటూ “ఓ నా ప్రభువా! ఓ నా ప్రభువా!” అంటూ నిరంతరం ప్రార్థించడం (దుఆ చేయాడం). ఇది మన దుఆలకు సమాధానాలు కోరుకునే గొప్ప విధానాలలో ఒకటి. 5) ధర్మసమ్మతమైన వాటిని మాత్రమే తినడం, త్రాగడం.
మంచి పనులు చేయటానికి సహాయపడే కారణాలలో ఒకటి, ధర్మసమ్మతమైన మరియు స్వచ్ఛమైన ఆహారాన్ని తినడం.
"అత్తయ్యిబ్" (పవిత్రమైనది) అనే పదం "అల్-ఖబీథ్" (చెడుది) అనే పదానికి వ్యతిరేకార్థ పదము అని అల్-ఖాదీ చెప్పినారు. ఆ పదం అల్లాహ్ కోసం వాడినప్పుడు, ఆయన సకల లోపాల నుండి మరియు దోషాల నుండి పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు అని అర్థం. అదే పదం ఒక వ్యక్తి కోసం వాడినప్పుడు, అతను చెడు లక్షణాలు, నీచమైన గుణాలు మరియు అసహ్యకరమైన పనుల నుండి విముక్తుడై, వాటికి విరుద్ధమైన మంచి గుణాలను కలిగి ఉన్నవాడని అర్థం. అదే పదం సంపదలకు ఉపయోగించినప్పుడు, అది ధర్మబద్ధంగా (హలాల్) సంపాదించిన ఉత్తమ సంపద అని అర్థం.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

