“ఎవరైతే ఒక దినములో: “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు; ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు; రాజ్యము, సార్వభౌమత్వము ఆయనదే; మరియు అన్ని రకాల ప్రశంసలూ కేవలం ఆయనకు మాత్రమే శోభిస్తాయి)
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఒక దినములో: “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు; ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు; రాజ్యము, సార్వభౌమత్వము ఆయనదే; మరియు అన్ని రకాల ప్రశంసలూ కేవలం ఆయనకు మాత్రమే శోభిస్తాయి) అని వందసార్లు ధ్యానం చేస్తాడో అతనికి పది మంది బానిసలను విడిపించిన దానికి సమానమైన ప్రతిఫలం ఉంటుంది; అతని ఖాతాలో వంద మంచి పనులు (పుణ్యాలు) జోడించబడతాయి; అతని వంద పాపాలు తుడిచివేయబడతాయి; మరియు ఆ రోజు సాయంత్రం వరకు అతను షైతాను నుండి రక్షించబడతాడు; సత్కార్యాలు చేయడంలో అతడిని ఎవరూ అధిగమించలేరు – ఎవరైతే అతనికంటే ఎక్కువ మార్లు పలుకుతాడో అతడు తప్ప.”
Explanation
Benefits
అల్లాహ్ తన దాసులపై చూపిన అనుగ్రహం యొక్క విస్తారత, ఆయన వారికి తన స్మరణను సులభతరం చేయడంలో స్పష్టంగా కనిపిస్తుంది మరియు దానికి ఆయన వారికి గొప్ప ప్రతిఫలాన్ని కూడా నిర్ణయించాడు.
ఒక వ్యక్తి ఈ 'తౌహీద్' (అల్లాహ్ నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు) ప్రకటనను ఒక రోజులో వంద సార్లకు పైగా పఠించినట్లయితే, అతడు పఠించిన మొదటి వంద సార్లకు గానూ హదీథులో పేర్కొన్న ప్రతిఫలాన్ని పొందుతాడు మరియు అతను దానికి మించి ఏమి జోడించినా దానికి అదనపు ప్రతిఫలాన్ని కూడా పొందుతాడు. ఇది హద్దులు నిర్దేశించబడి, ఆ హద్దులు దాటడం నిషేధించబడిన దాని క్రిందకు రాదు. అలాగే వందసార్లకు మించి పఠించినది విలువ లేకుండా లేక వృధాగా పోదు.
ఇమాం అల్-నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథు యొక్క స్పష్టమైన అర్థం ఏమిటంటే, ఈ హదీథులో ప్రస్తావించబడిన ప్రతిఫలం రోజుకు వంద సార్లు పఠించిన వానికి లభిస్తుంది, అతను దానిని ఏకధాటిగా పఠించినా లేదా ఒక రోజులో విడిగా సమయం దొరికినపుడల్లా పఠించి పూర్తి చేసినా లేదా దానిలో కొంత భాగాన్ని రోజు ప్రారంభంలో మరియు కొంత భాగాన్ని రోజు చివరిలో పఠించినా. అయితే, రోజు ప్రారంభంలో ఒకేసారి మొత్తం వంద సార్లు పఠించడం మంచిది, ఎందుకంటే అది రోజంతా రక్షణగా ఉపయోగపడుతుంది.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

