افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#65063[ప్రామాణికమైన హదీథు]
HadeethEnc · 1.29.0

“ఎవరైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేచి నిలబడి, తనను తాను పరిశుద్ధ పరుచుకుని, నమాజును ఆచరించి, అల్లాహ్ యొక్క క్షమాభిక్షను అర్థించినట్లయితే, అల్లాహ్ అతడిని తప్పక క్షమిస్తాడు

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఎటువంటి వ్యక్తినంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఏదైనా హదీథు వింటే దాని ద్వారా అల్లాహ్ నాకు ఎంత మేలు చేకూర్చ దలిస్తే అంత మేలు చేకూర్చేవాడు (అంత మంచిగా నేను ఆ హదీసును ఆచరించేవాడిని). ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో నుండి ఎవరైనా నాకు హదీథు వినిపిస్తే అతణ్ణి ప్రమాణం చేసి చెప్పమని అడిగే వాడిని. అతడు ప్రమాణం చేస్తే నేను (అతడు చెప్పినది సత్యమని) అతడిని విశ్వసించే వాడిని. అబూబక్ర్ రజియల్లాహు అన్హు ఒకసారి ఒక హదీసును ఉల్లేఖించినారు. ఆయన సత్యము పలికినారు. ఆయన ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఎవరైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేచి నిలబడి, తనను తాను పరిశుద్ధ పరుచుకుని, నమాజును ఆచరించి, అల్లాహ్ యొక్క క్షమాభిక్షను అర్థించినట్లయితే, అల్లాహ్ అతడిని తప్పక క్షమిస్తాడు”, తరువాత ఆయన (అబూబక్ర్ రజియల్లాహు అన్హు ఈ ఆయతును పఠించినారు:
{وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ}
[آل عمران: 135]
{మరియు ఎవరైతే, అశ్లీలపనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్‌ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్‌ తప్ప, పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను) బుద్ధిపూర్వకంగా మూర్ఖపుపట్టుతో మళ్ళీ చేయరు!}
[సూరహ్ ఆలి ఇమ్రాన్: 3:135]
02

Explanation

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: (అల్లాహ్ యొక్క) దాసులలో ఎవరైనా ఏదైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేక ఆమె తనను తాను పరిశుద్ధపరుచుకుని (వుదూ అవసరమైతే వుదూ, లేక ఘుసుల్ అవసరమైతే గుసుల్ ఆచరించి), నిలబడి తను పాల్బడిన పాపానికి పశ్చాత్తాప పడే సంకల్పముతో, రెండు రకాతుల నమాజు ఆచరించి, అల్లాహ్ ను క్షమాభిక్ష కోరితే అల్లాహ్ తప్పకుండా క్షమిస్తాడు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క వాక్కులను పఠించినారు: {والذين إذا فعلوا فاحشة أو ظلموا أنفسهم ذكروا الله فاستغفروا لذنوبهم ومن يغفر الذنوب إلا الله ولم يصروا على ما فعلوا وهم يعلمون}
{మరియు ఎవరైతే, అశ్లీలపనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్‌ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్‌ తప్ప, పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను) బుధ్ధిపూర్వకంగా మూర్ఖపుపట్టుతో మళ్ళీ చేయరు!} [సూరహ్ ఆలె ఇమ్రాన్: 3:135]
03

Benefits

ఈ హదీసులో - (మన వల్ల) ఏదైనా పాపపు పని జరిగిపోతే, వెంటనే నమాజు ఆచరించి అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరాలనే ప్రోత్సాహము ఉన్నది.
అలాగే ఇందులో సర్వోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ యొక్క అపారమూ, అనంతమూ అయిన క్షమాగుణము, ఆయన తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించుట మరియు వారిని క్షమించుట గురించి తెలియుచున్నది.

Attribution

[అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...