ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకొంటారో, వారు దానిని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు మాత్రమే దానిని సంపాదించుకోవాలి; అలాగాక ఎవరైతే ఈ లోక ప్రయోజనం కోసం మాత్రమే జ్ఞానాన్ని సంపాదించుకొంటారో, వారు స్వర్గం యొక్క ‘అర్’ఫ’ ను కూడా రుచి చూడరు
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించుకొంటారో, వారు దానిని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు మాత్రమే దానిని సంపాదించుకోవాలి; అలాగాక ఎవరైతే ఈ లోక ప్రయోజనం కోసం మాత్రమే జ్ఞానాన్ని సంపాదించుకొంటారో, వారు స్వర్గం యొక్క ‘అర్’ఫ’ ను కూడా రుచి చూడరు, అంటే స్వర్గపు సువాసనను కూడా రుచి చూడరు”.
Explanation
Benefits
ఇస్లామీయ జ్ఞానాన్ని (షరియహ్ ఙ్ఞానాన్ని) ప్రదర్శించడానికో, లేదా ఏదైనా ప్రాపంచిక లాభాన్ని పొందడానికి ఒక మార్గంగానో ఉపయోగించరాదనే బలమైన హెచ్చరిక ఉన్నది. ఎందుకంటే ఇది ఘోరమైన పాపాలలో (కబాయిర్’లలో) ఒకటి.
ఎవరైతే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు ధార్మిక జ్ఞానాన్ని (షరియహ్ ఙ్ఞానాన్ని) పొందుతాడో, మరియు దాని పర్యవసానంగా అతనికి ప్రాపంచిక జీవితం కూడా అతని ముందుకు వచ్చినట్లయితే (ఉదా: సౌలభ్యాలు, లాభాలు లభించినట్లైతే) దానిని స్వీకరించడంలో హాని ఏమీ లేదు, అందుకు అతనికి అనుమతి ఉన్నది.
అస్-సింది (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ హదీథులో “అర్’ఫ్ అల్ జన్నహ్” (స్వర్గపు అర్’ఫ్) అనే పదం స్వర్గము యొక్క సువాసనను సూచిస్తుంది. ఇది స్వర్గం నుండి నిషేధించబడడాన్ని నొక్కి చెబుతుంది; ఎందుకంటే ఎవరైనా స్వర్గము యొక్క ఏ కొద్ది వాసనను కూడా చూడలేకపోతే వారు ఖచ్చితంగా అందులో భాగం కాలేరు.
ఎవరైతే అల్లాహ్ యొక్క అనుగ్రహం మరియు ఆయన కరుణ పొందుటకు ఉద్దేశించబడిన ఙ్ఞానాన్ని, ఉద్యోగం పొందుట కొరకో లేక ఇతర ప్రాపంచిక లక్ష్యాలు సాధించుట కొరకో నేర్చుకుని ఉంటే, అతడు అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలాలి. తద్వారా అల్లాహ్ ఆ కలుషిత సంకల్పము కారణంగా జనించిన చెడును అతని నుండి తొలగిస్తాడు; అల్లాహ్ గొప్ప అనుగ్రహానికి యజమాని, మహిమాన్వితుడు మరియు మహోన్నతుడు.
ఈ హెచ్చరిక షరియత్ పరమైన ధార్మిక జ్ఞానాన్ని సముపార్జించాలని కోరుకునే వ్యక్తికి ఉద్దేశించబడింది. ప్రాపంచిక లాభం కోసం ఇంజనీరింగ్, కెమిస్ట్రీ వంటి ప్రాపంచిక శాస్త్రాల జ్ఞానాన్ని సముపార్జించాలని కోరుకునే వ్యక్తి విషయానికొస్తే, దాని వెనుక ఉన్న అతని ఉద్దేశ్యం, సంకల్పము ప్రకారం అతని పై తీర్పు ఉంటుంది.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

