“నేను ‘సుబ్’హానల్లాహి, వల్ హందులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్’ అని పలకడం, సూర్యుడు ఉదయించే వాటన్నింటి కంటే కూడా నాకు అత్యంత ప్రియమైనది. (అంటే వేటివేటిపైనైతే సూర్యోదయం అవుతుందో, ఆ విషయాలన్నింటి కంటే కూడా అత్యంత ప్రియమైనదని భావము).”
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నేను ‘సుబ్’హానల్లాహి, వల్ హందులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్’ అని పలకడం, సూర్యుడు ఉదయించే వాటన్నింటి కంటే కూడా నాకు అత్యంత ప్రియమైనది. (అంటే వేటివేటిపైనైతే సూర్యోదయం అవుతుందో, ఆ విషయాలన్నింటి కంటే కూడా అత్యంత ప్రియమైనదని భావము).”
Explanation
“సుబ్’హానల్లాహి”: మహోన్నతుడైన అల్లాహ్ లోపరహితుడు, ఆయన ఔన్నత్యము లోపరహితమైనది. మహిమ, స్తోత్రము, కీర్తి, ప్రకాశము అన్నీ కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి అని అర్థము.
“అల్’హందులిల్లాహ్”: ‘సకల ప్రశంసలూ, కృతజ్ఞతలూ ఆయనకే శోభిస్తాయి’ – అంటే, పరిపూర్ణమైన ఆయన నామములు మరియు ఆయన గుణగణములను, ఆయనపై పూర్తి ప్రేమతో, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడుట.
“లా ఇలాహ ఇల్లల్లాహ్”: ‘అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడెవ్వరూ లేరు’
“అల్లాహు అక్బర్”: ‘అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు’, సర్వోన్నతుడు, సర్వోత్కృష్టుడు, ప్రతి దాని కంటే కూడా మహోన్నతుడు.
Benefits
అలాగే ఇందులో - అల్లాహ్ యొక్క జిక్ర్ (ఆయనను స్తుతించుట, కీర్తించుట) వలన లభించే ప్రతిఫలము మరియు శుభాల కారణంగా, వీలైనంత ఎక్కువగా అల్లాహ్ ధ్యానం చేయాలనే హితబోధ ఉన్నది.
ఈ ప్రపంచపు వినోదాలు, భోగాలు, సౌఖ్యాలు అత్యంత అల్పమైనవి మరియు ఈ ప్రపంచపు వాంఛలు, కోరికలు క్షణభంగురమైనవి, క్షణికమైనవీనూ.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

