HadeethEnc · 1.29.0
“అల్లాహుమ్మ ఖినీ అజాబక యౌమ తజ్మ’ఉ అవ్ తబ్’అసు ఇబాదక్” (ఓ అల్లాహ్! నీవు నీ దాసులను సమీకరించే దినమున లేదా నీవు నీ దాసులను తిరిగి బ్రతికించే దినమున (పునరుత్థాన దినమున) నీ శిక్ష నుండి నన్ను రక్షించు).”
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
హుదైఫహ్ ఇబ్న్ అల్ యమాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించినపుడు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిని తలక్రింద ఉంచుకుని, అపుడు ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ ఖినీ అజాబక యౌమ తజ్మ’ఉ అవ్ తబ్’అసు ఇబాదక్” (ఓ అల్లాహ్! నీవు నీ దాసులను సమీకరించే దినమున లేదా నీవు నీ దాసులను తిరిగి బ్రతికించే దినమున (పునరుత్థాన దినమున) నీ శిక్ష నుండి నన్ను రక్షించు).”
02
Explanation
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించినపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన కుడి చేతిని దిండుపై ఉంచి, ఆ అరచేతిపై తన కుడి చెంపను ఆనించి ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ” (ఓ అల్లాహ్!) నా ప్రభూ! “ఖినీ” నన్ను రక్షించు, నన్ను కాపాడు; “మిన్ అజాబక” నీ శిక్ష నుండి, నీ దండన నుండి; “యౌమ తజ్మఉ, ఔ తబ్’అసు ఇబాదక్” నీ దాసులను సమీకరించే దినము నాడు లేదా నీ దాసులను తిరిగి జీవింపజేసే దినము (పునరుథ్థాన దినము) నాడు.”
03
Benefits
ఈ హదీథు ద్వారా శుభప్రదమైన, ఆశీర్వాదకరమైన ఈ దుఆ (ప్రార్థన) యొక్క ఘనత మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉదాహరణను అనుసరిస్తూ దానిని కొనసాగించడం యొక్క వాంఛనీయత తెలుస్తున్నాయి.
నిద్రకు ఉపక్రమించినపుడు ముందుగా కుడివైపునకు తిరిగి పడుకోవడం వాంఛనీయము.
అల్ సిందీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ దుఆలో “ఓ అల్లాహ్! నీ శిక్షనుండి నన్ను రక్షించు” అనే పదాలు, తెలివిగల వ్యక్తి ఎవరైనా తన నిద్రను, మరణాన్ని మరియు దానిని అనుసరించి వచ్చే పునరుథ్థానదినమును స్మరించుకునే ఒక సాధనంగా చేసుకోవాలి” అని సూచిస్తున్నాయి".
పునరుత్థాన దినమున అల్లాహ్ యొక్క శిక్ష నుండి రక్షణ అనేది కేవలం అల్లాహ్ యొక్క దయ మరియు కరుణ ద్వారా మాత్రమే సాధ్యము. అది దాసుడు సత్కార్యాలు చేయడం, తద్వారా అతని పాపాలకు అల్లాహ్ యొక్క క్షమాభిక్ష పొందడం ద్వారా సాధ్యమవుతుంది.
ఈ హదీథు, తన ప్రభువు మరియు యజమాని అయిన సర్వోన్నతుడైన అల్లాహ్ ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వినయం, విధేయతలను ప్రదర్శిస్తున్నది.
ఈ హదీథు ద్వారా – ప్రజలందరూ సమీకరించబడడం, తిరిగి జీవింపజేయబడడం, మరియు తమ కర్మలకు జవాబుదారులుగా తమ ప్రభువు వైపునకు తిరిగి వస్తారు అనే విషయం నిర్ధారించబడుతున్నది. ఆ దినమున ఎవరైతే మంచిని, శుభాన్ని కనుగొంటాడో, అతడు సర్వోన్నతుడైన అల్లాహ్’ను స్తుతించాలి మరియు ఎవరైతే మంచికి, శుభానికి బదులు మరింక ఏమైనా కనుగొంటాడో, అందుకు అతడు తనను తాను నిందించుకోవడం తప్ప ఏమీ చేయలేడు. నిశ్చయంగా ఆ దినమున అల్లాహ్ లెక్క తీసుకునేది దాసుల కర్మలను గురించే.
సహబాలు రదియల్లాహు అన్హుమ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నిద్రపోయే విధానాన్ని వివరించడంలో కూడా ఆసక్తి కనబరచడం కనిపిస్తున్నది.
ఈ హదీథులో “ఆయన తన కుడి చేతిని తన కుడి చెంప క్రింద ఉంచుకునేవారు” అనే మాటలు, ప్రతి పనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుడిచేతితోనే మొదలుపెట్టే ఆయన విధానాన్ని, అలవాటును సూచిస్తున్నవి; అందుకు భిన్నంగా ఏమైనా అధారాలు లభిస్తే తప్ప.
కుడి వైపున నిద్రపోవడం వల్ల త్వరగా మేల్కొనవచ్చు, ఎందుకంటే, కుడి వైపు నిద్రపోయిన స్థితిలో గుండె తక్కువ స్థిరంగ ఉంటుంది మరియు గుండె ఎడమ వైపున ఉన్నందు వలన కుడి వైపునకు తిరిగి పడుకోవడం అనేది గుండెకు మరింత విశ్రాంతినిస్తుంది. ఒక వ్యక్తి ఎడమ వైపునకు తిరిగి నిద్రపోతే, శరీరపు బరువు దానిపై పడి ఒత్తిడి కలుగజేస్తుంది, అది హృదయానికి హాని కలిగిస్తుంది.

Attribution
[అత్తిర్మిదీ నమోదు చేసినారు:]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares