HadeethEnc · 1.29.0
మీలో ఎవరైతే ఉదయం లేచినప్పుడు ఆరోగ్యంగా, తన ఇంట్లో సురక్షితంగా, ఆ రోజుకి సరిపడా ఆహారం కలిగి ఉంటారో, అతనికి ఈ ప్రపంచమంతా ప్రసాదించబడినట్లే
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
ఉబైదుల్లాహ్ బిన్ మిహ్సన్ అల్-అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీలో ఎవరైతే ఉదయం లేచినప్పుడు ఆరోగ్యంగా, తన ఇంట్లో సురక్షితంగా, ఆ రోజుకి సరిపడా ఆహారం కలిగి ఉంటారో, అతనికి ఈ ప్రపంచమంతా ప్రసాదించబడినట్లే."
02
Explanation
ఓ ముస్లింలారా! మీలో ఎవరైనా, ఉదయం లేచినపుడు, ఆరోగ్యంగా, అనారోగ్యం లేకుండా ఉంటాడో; తనలో, తన కుటుంబంలో, తనపై ఆధారపడినవారిలో, తన మార్గంలో సురక్షితంగా, భయపడకుండా ఉంటాడో; ఆ రోజుకు సరిపడా న్యాయబద్ధమైన ఆహారం కలిగి ఉంటాడో, ప్రపంచం మొత్తం అతని కోసం సమకూర్చబడినట్లుగా ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేసినారు.
03
Benefits
మనిషికి ఆరోగ్యం, భద్రత, ఉపాధి (ఆహారం/జీవనోపాధి) యొక్క అవసరాన్ని స్పష్టంగా వివరించబడింది.
బానిసగా ఉన్నా సరే, మహోన్నతుడైన అల్లాహ్ తనకు ప్రసాదించిన అనుగ్రహాలకు బదులుగా అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆయనను ప్రశంసించాలి.
ఇస్లాం బోధనల ప్రకారం, ఈ లోకంలో సంతృప్తి (contentment) కలిగి ఉండటం మరియు ప్రాపంచిక ఆకాంక్షలకు దూరంగా ఉండటం పై ప్రోత్సహించబడింది.

Attribution
[అత్తిర్మిదీ మరియు ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు:]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares