HadeethEnc · 1.29.0
మీరు అల్లాహ్ పెట్టె శిక్షతో ప్రజలను శిక్షించకండి
Available translations
Choose an available translation of this Hadeeth
01
Hadeeth text
ఇక్రమ ఉల్లేఖన: అలీ రదియల్లాహు అన్హు కొంతమందిని కాల్చేశారు. అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమాకు ఈ విషయం తెలిసినప్పుడు ఇలా తెలిపారు: 'ఒకవేళ నేను ఉంటే అలా కాల్చేసేవాడిని కాదు’ ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: మీరు అల్లాహ్ పెట్టె శిక్షతో ప్రజలను శిక్షించకండి నేను కేవలం వారిని హతమార్చేవాడిని ’ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా తెలిపారు: ఎవరైతే తన సత్యధర్మాన్ని విడిచి పెడతాడో అతడిని మరణశిక్ష విధించండి.’
02
Explanation
అలీ బిన్ అబూతాలిబ్ రదియల్లాహు అన్హు తన ధార్మిక విచక్షణతో, ఇస్లాం నుండి ధర్మభ్రష్టులైన కొంతమంది పాషండులను అగ్నితో కాల్చేశారు. ఈ విషయం అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమాకు చేరగా, ఆయన వారిని హతమార్చిన చర్యను సమర్థించారు; అయితే వారిని అగ్నితో కాల్చడాన్ని వ్యతిరేకించారు. ఆయన ఇలా అన్నారు: ఒకవేళ నేను అతని స్థానంలో ఉంటే వారిని అగ్నితో కాల్చేవాడిని కాదు; ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేశారు - అగ్నితో శిక్షించడం అగ్నికి ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే శోభిస్తుంది. అయితే, వారిని కేవలం హతమార్చడమే సరిపోతుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: ‘ఎవరైతే ఇస్లాం నుండి ధర్మభ్రష్టుడై తన ధర్మాన్ని వేరొక ధర్మానికి మార్చుకుంటాడో, అతడికి మీరు మరణశిక్ష విధించండి’.
03
Benefits
ధర్మపండితుల ఏకాభిప్రాయం ప్రకారం ఇస్లాం విడిచి పెట్టిన ధర్మభష్టుడికి మరణశిక్ష విధించడం తప్పనిసరి, అయితే ఇది దాని షరతులకు లోబడి ఉంటుంది. మరియు దీనిపై కేవలం ఇమామ్ మరియు పాలకుడు మాత్రమే అమలు చేస్తారు.
ఆయన ప్రవచనం: "తన ధర్మాన్ని విడిచి, మార్గభ్రష్టుడైన వాడికి మరణశిక్ష విధించండి." అనగా: ఇస్లాం నుండి బయటకు వెళ్ళిపోయిన వారు, ఇది పురుషులకు మరియు స్త్రీలకు ఇద్దరికీ వర్తించే ఒక సాధారణ ఆదేశం.
మతభ్రష్టుడిని (ముర్తద్) అతని మతభ్రష్టత్వంపై వదిలివేయరు. బదులుగా అతడిని ఇస్లాం వైపునకు ఆహ్వానించాలి. ఒకవేళ అతను అంగీకరించకపోతే, పరిపాలకుడు అతడికి మరణశిక్ష విధించాలి.
ఈ హదీథులో అగ్నిశిక్ష విధించకూడదని, మరియు హద్దు శిక్షలు అగ్నితో అమలు చేయబడవని చెప్పబడింది.
ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమా యొక్క ఘనత, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ యొక్క హదీథుల పట్ల ఆయనకున్న విస్తారమైన జ్ఞానం మరియు ధర్మశాస్త్ర పాండిత్యం ఇందులో తెలుస్తున్నది.
విభేదించేవారిని ఖండించే శిష్టాచారం అని తెలుస్తున్నది.

Attribution
[అల్ బుఖారీ నమోదు చేసినారు:]
Categories
Share
Share hadeeth
Sharing options · 0 Total shares