افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#5791[ప్రామాణికమైన హదీథు]
HadeethEnc · 1.29.0

అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను), మీలో ఎవరైనా చట్టవిరుద్ధంగా ఏదైనా తీసున్నట్లయితే, దానిని మోసుకుంటూ పునరుత్థాన దినమున అల్లాహ్‌ను కలుస్తారు

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

అబూ హుమైద్ అస్సాయిదీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం బనీ సులైమ్ తెగవారి నుండి జకాత్ వసూలు చేయడానికి ఇబ్న్ అల్-లుతబియ్యహ్ అనే వ్యక్తిని నియమించారు. అతను తిరిగి వచ్చినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనిని లెక్క అడిగారు. అతను, 'ఇది మీ జకాత్ సంపద, మరియు ఇది నాకు బహుమతిగా ఇవ్వబడింది' అని అన్నాడు. దానిపై, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు "నీవు చెబుతున్నది నిజమే అయితే, నీకు బహుమతులు వచ్చే వరకు నువ్వు నీ తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు ఉండలేదు?" తరువాత ప్రవక్త మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించినారు, అల్లాహ్‌ను స్తుతించి, ఆయనను కీర్తించిన తర్వాత, ఆయన ఇలా అన్నారు: "అమ్మా బా'దు", అల్లాహ్ నా ఆధీనంలో ఉంచిన దానిలో కొంత పనిని నిర్వహించడానికి నిశ్చయంగా నేను మీలో ఒక వ్యక్తిని నియమిస్తాను, ఆపై అతను నా వద్దకు వచ్చి ఇలా అంటాడు “ఇది మీ (జకాతు) సంపద మరియు ఇది బహుమతి, బహుమతిగా నాకు ఇవ్వబడింది”. మరి అతనికి (ఎవరైనా) బహుమతులు ఇస్తారా లేదా అని చూడటానికి అతను తన తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు (నిరీక్షించి) ఉండలేదు? అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను), మీలో ఎవరైనా చట్టవిరుద్ధంగా ఏదైనా తీసున్నట్లయితే, దానిని మోసుకుంటూ పునరుత్థాన దినమున అల్లాహ్‌ను కలుస్తారు. మీలో ఎవరూ అల్లాహ్‌ను కలుసుకోవడానికి వెళ్ళినపుడు, రంకెలు పెడుతున్న ఒంటెను, అరుస్తూ ఉండే ఆవును లేదా ‘బేబే’ అని అరుస్తున్న గొర్రెను మోసుకెళ్లడం నేను చూడదల్చుకోలేదు." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను తన చంకల తెల్లదనం కనిపించే వరకు పైకెత్తి, "ఓ అల్లాహ్! నేను (నీ సందేశాన్ని) అందజేయలేదా?" అని అన్నారు. ఉల్లేఖకుడైన అబూ హుమైద్ అస్సాయిదీ ఇంకా ఇలా అన్నారు: “నా కళ్ళు చూశాయి మరియు (ఆ హదీథును) నా చెవులు విన్నాయి.”
02

Explanation

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇబ్న్ అల్-లుతబియ్యహ్ అనే వ్యక్తిని బనూ సులైమ్ తెగవారి నుండి జకాత్ వసూలు చేసి తీసుకు రావడానికి నియమించినారు. పని ముగించుకుని అతడు మదీనాకు తిరిగి వచ్చినపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఎంత జకాతును వసూలు చేసినాడు మరియు అందులో అతడు (తన రోజువారి ఖర్చుల కొరకు) ఎంత ఖర్చు పెట్టినాడు అని లెక్క అడుగగా, ఇబ్న్ లుతబియ్యహ్ ఇలా అన్నాడు: “ఇది (బనూ సులైమ్ తెగ వారి నుండి) నేను జకాతుగా వసూలు చేసిన మీ సంపద మరియు (అది గాక నా దగ్గరున్న) ఈ సంపద నాకు బహుమతిగా ఇవ్వబడింది.” అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: నీవు సత్యవంతునివే అయితే, నీకు ప్రజలు బహుమతులు ఇస్తారో లేదో చూడటానికి నీవు నీ తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు కూర్చోవు? ఆ సంపద నీకు బహుమతిగా రావడానికి కారణం నీకు అప్పగించబడిన బాధ్యతలు మరియు విధులే. నీవు నీ ఇంట్లోనే కూర్చొని ఉండి ఉంటే, నీకు ఏమీ బహుమతిగా ఇవ్వబడేది కాదు. కనుక, కేవలం అది బహుమతి రూపంలో నీకు చేరింది అనే కారణంగా నీవు దానిని చట్టబద్ధంగా పరిగణించడానికి అనుమతి లేదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోపంగా ఉన్నప్పటికీ వేదిక (మెంబరు) పైకి ఎక్కి ప్రసంగించినారు. ముందుగా అల్లాహ్ ను స్తుతించి, ఆయనకు కృతఙ్ఞతలు అర్పించి ఇలా అన్నారు: “అమ్మా బ’ద్! నిశ్చయంగా అల్లాహ్ నాకు అప్పగించిన బాధ్యతలలో జకాతు వసూలు మరియు యుద్ధములో జయించిన సంపద విషయములలో ఒకరిని దాని కొరకు నియమించాను. అతడు ఆ పని నుండి తిరిగి వచ్చి ఇలా అంటాడు: “ఇది మీ కొరకు, మరియు ఇది నా బహుమతి. బహుమతిగా నాకు ఇవ్వబడింది” అని. “తన బహుమతి తనకు వస్తుందో లేదో చూడటానికి అతను తన తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు కూర్చోడు? అల్లాహ్ సాక్షిగా, తీర్పు దినమున తన మెడపై మోసుకుంటూ అల్లాహ్‌ను కలుసుకోవడం తప్ప ఎవరూ తనకు ఇచ్చిన దాని నుండి చట్టవిరుద్ధంగా ఏమీ తీసుకోరు - అది మూలుగుతూ ఉండే ఒంటె అయినా, మూలుగుతూ ఉండే ఆవు అయినా, లేదా అరచే గొర్రె అయినా. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, బలంగా తన రెండు చేతులను పైకెత్తినారు, అక్కడ కూర్చున్న వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చంకలలోని తెల్లదనాన్ని చూడగలిగినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను పైకెత్తి ఇలా అన్నారు: “ఓ అల్లాహ్! నేను నీ తీర్పును వారికి అందజేసినాను.” ఈ హదీథు ఉల్లేఖకుడైన అబుయ్ హుమైద్ అస్సాదీ (రదియల్లాహు అన్హు) ఇది (ఈ హదీథు) తన కనులు చూసినది మరియు తన చెవులు విన్నది అని తెలియజేసినారు.
03

Benefits

పాలకుడు తన ఉద్యోగులకు, తన క్రింద పని చేసేవారికి – వారికి అప్పగించిన బాధ్యతల విషయములో వారి నుండి ఏమి ఆశించబడుతున్నది, ఏమి నిషేధించబడినది వివరించాలి.
ఎవరైతే ప్రజల సంపదల నుండి అన్యాయంగా, అధర్మంగా తీసుకునేవారికి తీవ్రమైన హెచ్చరిక ఉన్నది.
ఏ దౌర్జన్యపరుడైనా సరే, తాను ఇతరులకు ఏమి అన్యాయం చేసినాడో, వారిపై ఏ విధమైన దౌర్జన్యం చేసినాడో, తీర్పు దినమున దానిని తన మెడలో మోసుకుంటూ వస్తాడు.
ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తన విధులను సక్రమంగా నిర్వర్తించడం అతని విధి. తాను చేసిన పనికి సంబంధించిన బహుమతులను స్వీకరించడానికి అతనికి అనుమతి లేదు. ఒకవేళ అతడు ప్రజల నుండి అలా బహుమతులను గ్రహించినట్లయితే, అతను వాటిని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలి. ఎందుకంటే అవి చెడుకు మరియు నమ్మక ద్రోహానికి దారితీసే మార్గాలు కాబట్టి, వాటిని తన కోసం తీసుకోవడానికి అతనికి అనుమతి లేదు.
ఇబ్న్ బత్తాల్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథ్ - ఒక ప్రభుత్వ అధికారికి ఇచ్చిన బహుమతి, సాధారణంగా అతడు చేసిన ఒక ఉపకారానికి కృతజ్ఞతా చిహ్నంగా లేదా అతని అభిమానాన్ని గెలవడానికి లేదా అతను చట్టాన్ని వర్తింపజేయడంలో పక్షపాతం చూపుతాడనే ఆశతో ఇవ్వబడుతుంది – అని తెలియజేస్తున్నది. ఇటువంటి బహుమతుల విషయంలో, ఆ అధికారి ఇతర ముస్లింల మాదిరిగానే ఉంటాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచించారు - అతనికి వాటిపై ప్రత్యేక అధికారం ఏమీ లేదు - మరియు అలాంటి బహుమతులను ప్రత్యేకంగా అతడు తన కోసం ఉంచేసుకోవడం అతనికి అనుమతించబడదు.
ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథు ప్రభుత్వ అధికారులకు ఇచ్చే బహుమతులు నిషిద్ధమని, చట్టవిరుద్ధమని, అది అధికార దుర్వినియోగమని స్పష్టం చేస్తున్నది, ఎందుకంటే అతడు తన అధికారాన్ని దుర్వినియోగం చేసినాడు మరియు అతనిపై ఉంచిన నమ్మకాన్ని వంచించినాడు. అంతేగాక అది ‘గులూల్’ (యుద్ధ సంపద నుండి వస్తువులను దొంగిలించడం) గా పరిగణించ బడుతుందని తెలియజేస్తున్నది. అందుకే ఈ హదీథు అలాంటివాని శిక్ష గురించి ప్రస్తావించింది: యుద్ధ సంపద నుండి దొంగిలించే వ్యక్తికి విధించే శిక్ష మాదిరిగానే, తీర్పు దినమున అతడు బహుమతిగా తీసుకున్న దానిని భుజాలపై మోసుకుంటూ తీసుకు వెళతాడు. ప్రభుత్వ ఉద్యోగికి బహుమతిగా ఏమైనా ఇవ్వడాన్ని నిషేధించడానికి గల కారణాన్ని ఇదే హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా వివరించినారు: కారణం అతని అధికార స్థానం. ప్రభుత్వ అధికారి కాని వ్యక్తికి ఇచ్చిన బహుమతి విషయం దీనికి భిన్నమైనది; ఎందుకంటే సాధారణంగా ప్రజలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మంచి విషయం, షరియత్ లో సిఫార్సు చేయబడిన విషయం.
ఇబ్న్ అల్-మునైయిర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథులో "అతను తన తండ్రి మరియు తల్లి ఇంట్లో ఎందుకు కూర్చోడు" అనే ప్రకటన నుండి ఈ విషయం అర్థమవుతున్నది - ప్రభుత్వ పదవిలో ఉన్న వ్యక్తి ఆ పదవిని చేపట్టడానికి ముందు తనకు అప్పుడప్పుడు బహుమతిగా ఏమైనా ఇస్తూ ఉండే వ్యక్తి నుండి బహుమతులు స్వీకరించడానికి అనుమతి ఉంది”. దీనికి ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా జోడించినారు: “అయితే ఆ బహుమతి గతంలో అతడు సాధారణంగా ఇస్తూ వచ్చిన బహుమతి కంటే ఎక్కువ విలువైనది అయి ఉండరాదు. అపుడు మాత్రమే అది అనుమతించబడుతుంది.”
హితబోధ చేయడంలో ప్రవక్తాత్మక విధానం ఏమిటంటే, వ్యక్తులను అందరిలో బహిరంగ పర్చడం కాదు, సాధారణంగా మాట్లాడటం.
ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: బాధ్యత అప్పగించబడిన వారిని లెక్క అడగడం షరిఅత్ ప్రకారం అనుమతించబడిన విషయమే.
ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: తప్పు చేసిన వారిని మందలించడం అనుమతించబడిన విషయమే అని తెలుస్తున్నది.
అలాగే ఇందులో – దుఆ చేయునపుడు చేతులను పైకి ఎత్తి దుఆ చేయడం సిఫార్సు చేయబడుతున్నది.

Attribution

[అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...