“పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అబూ బర్జహ్ అల్ అస్లమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని.
Explanation
మొదటిది: అతడి జీవితాన్ని గురించి – అతడు ఎలా గడిపాడు మరియు దేనిలో అంతం చేశాడు?
రెండవది: అతడి జ్ఞానాన్ని గురించి – అతడు జ్ఞానాన్ని కేవలం అల్లాహ్ (యొక్క కరుణా కటాక్షాల) కొరకు మాత్రమే ఆర్జించినాడా? ఆర్జించిన జ్ఞానము ప్రకారం ఆచరించినాడా? మరియు ఆ జ్ఞానాన్ని అర్హులకు చేరవేసినాడా?
మూడవది: అతడి సంపద గురించి: ఎక్కడినుండి సంపాదించినాడు? అది ధర్మబద్ధంగా ఆర్జించినదా లేక అధర్మంగా ఆర్జించినదా? ఆ సంపదను దేనిపై ఖర్చు చేసినాడు? అల్లాహ్ ఇష్టపడే వాటిపై ఖర్చు చేసినాడా లేక అల్లాహ్ కు అయిష్టమైన వాటిపై ఖర్చు చేసినాడా?
నాలుగవది: అతడి శరీరము, శక్తి, ఆరోగ్యము మరియు యవ్వనం గురించి: అతడు వాటిని ఏవిధంగా వినియోగించినాడు మరియు వాటిని ఏవిధంగా ఉపయోగించినాడు?
Benefits
అల్లాహ్ తన దాసులపై కురిపించే శుభాలు ఎన్నో ఉన్నాయి. ఆయన తన ప్రతి దాసుడిని తాను ప్రసాదించిన శుభాలను గురించి ప్రశ్నిస్తాడు. అందుకని ఆ శుభాలను ప్రతి ఒక్కరూ అల్లాహ్ ఇష్టపడే విషయాలలోనే వినియోగించాలి.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

