“స్వర్గం మరియు నరకం నాకు ప్రస్తుత పరచబడ్డాయి; ఈ రోజు (నేను చూసిన) శుభాన్ని మరియు కీడును నేను ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసినది (ఏమిటో) ఒకవేళ మీకు తెలిస్తే మీరు తక్కువగా నవ్వేవారు మరియు ఎక్కువగా ఏడ్చేవారు”
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు వారి సహబాలను గురించి ఏదో విషయం అందజేయబడినది, అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉపన్యాసం ఇచ్చినారు, అందులో వారు ఇలా పలికినారు: “స్వర్గం మరియు నరకం నాకు ప్రస్తుత పరచబడ్డాయి; ఈ రోజు (నేను చూసిన) శుభాన్ని మరియు కీడును నేను ఎప్పుడూ చూడలేదు. నాకు తెలిసినది (ఏమిటో) ఒకవేళ మీకు తెలిస్తే మీరు తక్కువగా నవ్వేవారు మరియు ఎక్కువగా ఏడ్చేవారు”. అతడు (ఉల్లేఖకుడు) ఇలా అన్నాడు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) సహచరులకు దీనికంటే భారమైన దినము మరొకటి లేదు. వారు తమ తలలు కప్పుకున్నారు మరియు వారి నుండి ఏడుపు శబ్దం వినిపించింది. అప్పుడు ఉమర్ (రదియల్లాహు అన్హు) లేచి నిలబడి ఇలా అన్నారు: “అల్లాహ్ మా ప్రభువుగా, ఇస్లాం మా ‘దీన్’గా (ధర్మముగా - జీవన నియమావళిగా) మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మా ‘ప్రవక్త’గా మేము చాలా సంతృప్తి చెందాము”; ఆ సమయంలో ఒక వ్యక్తి లేచి నిలబడి ఇలా అన్నాడు: ‘నా తండ్రి ఎవరు?’ అప్పుడు ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఫలానా అతడు మీ తండ్రి”; అప్పుడు ఈ ఆయతు అవతరించింది: {“యా అయ్యుహల్లజీన ఆమనూ, లా తస్’అలూ అన్ అష్యాఅ ఇన్ తుబ్’ద లకుం తసూకుమ్....”} [విశ్వాసులారా! ఒకవేళ ఆ విషయాలు మీకు తెలుపబడితే మీకు ఇబ్బంది కలిగించే విషయాలను గురించి అడగకండి...] (సూరహ్ అల్’మాయిదహ్ 5:101)”
Explanation
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ఫలానా అతడు నీ తండ్రి”; అపుడు ఈ ఆయతు అవతరించినది. {ఓ విశ్వాసులారా! ఒకవేళ మీకు గనక వివరిస్తే మీకే ఇబ్బంది కలిగించే విషయాలను గురించి అడగకండి...} ” [అల్’మాయిదహ్ 5:101]
Benefits
సహబా (రదియల్లాహు అన్హుమ్), ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉపన్యాసం మరియు దేవుని శిక్ష పట్ల వారికున్న తీవ్రమైన భయంతో ప్రభావితమయ్యారు.
ఏడుపు వచ్చేట్లైతే, ముఖాన్ని కప్పుకోవడం చేయవచ్చును.
ఇమాం అల్-ఖత్తాబి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఈ హదీథ్ తనకు అవసరం లేని విషయాలపై కపట ధర్మ పరాయాణత్వంతో లేదా మొండితనంతో అడిగే వారి గురించి. ఎవరైనా తనకు అవసరమైన విషయములో, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో అడిగితే, అంటే ఉదాహరణకు ఒక సమస్య ఎదురై దాని గురించి అడిగితే, అతనిపై ఎటువంటి పాపము లేదా నింద లేదు.
ఈ హదీథు అల్లాహ్’కు విధేయత చూపడంలో, పాపాలను నివారించడంలో మరియు ఆయన పరిమితులకు కట్టుబడి ఉండటంలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
అలాగే ఈ హదీథు ఏదైనా విషయాన్ని బోధించేటప్పుడు మరియు దేని గురించైనా హెచ్చరిక చేయునప్పుడు కోపాన్ని కూడా అనుమతిస్తుంది.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

