ఓ ప్రజలారా! అల్లాహ్ వద్ద పశ్చాత్తాపపడండి, ఎందుకంటే నేను రోజుకు వంద సార్లు ఆయన వద్ద పశ్చాత్తాపపడతాను
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో ఒకరైన అల్ అగర్రి రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఓ ప్రజలారా! అల్లాహ్ వద్ద పశ్చాత్తాపపడండి, ఎందుకంటే నేను రోజుకు వంద సార్లు ఆయన వద్ద పశ్చాత్తాపపడతాను."
Explanation
Benefits
నిషేధించబడిన పనులు మరియు పాపాలు చేసినందుకు లేదా తప్పనిసరి విధులను నిర్వర్తించడంలో విఫలమైనందుకు పశ్చాత్తాపం చెందడం సర్వ సాధారణం.
పశ్చాత్తాపం అంగీకరించబడటానికి నిజాయితీ, చిత్తశుద్ధి ఒక షరతు. అల్లాహ్ కోసం కాకుండా ఇతరుల కోసం పాపాన్ని వదిలివేసే వ్యక్తి పశ్చాత్తాపపడిన వ్యక్తిగా పరిగణించబడడు.
ఇమామ్ నవవి ఇలా అన్నారు: పశ్చాత్తాపం ఆమోదించబడేందుకు మూడు షరతులు ఉన్నాయి: ఆ పాపాన్ని విడిచి పెట్టడం, దానిని చేసినందుకు పశ్చాత్తాపపడటం మరియు అలాంటి పాపాన్ని ఎన్నటికీ మరలా చేయకూడదని దృఢంగా నిర్ణయించుకోవడం. ఒకవేళ ఆ పాపం మరొక వ్యక్తి హక్కును కలిగి ఉంటే, అందుకు నాల్గవ షరతు కూడా పూర్తి చేయవలసి ఉంది: తప్పుగా, పొరపాటుగా(లేదా కావాలని) తీసుకున్న అతడి వస్తువును అతడికి వాపసు చేయడం లేదా అన్యాయం చేసిన వ్యక్తి నుండి క్షమాపణ కోరడం.
ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షమాపణ కోరడం అంటే ముఖ్యంగా ఆయన పాపాలు చేశారని సూచించడం కాదని గమనించ వలెను. బదులుగా, ఇది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాస్యం యొక్క పరిపూర్ణతను మరియు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ స్మరణతో ఆయనకున్న నిరంతర సంబంధాన్ని, అలాగే అల్లాహ్ హక్కుల గొప్పతనం మరియు దాసుల లోపాల గురించి ఆయనకున్న అవగాహనను ప్రతిబింబిస్తుంది, అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలకు ఎంత కృతజ్ఞతలు తెలిపినా కూడా సరిపోదు. ఇది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత సమాజం కోసం ఇతర కారణాలతో పాటు ధార్మిక చట్టంలో భాగంగా కూడా పనిచేస్తుంది, .
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

