“(ఇస్రా మరియు మేరాజ్ నాటి రాత్రి) నన్ను ఆకాశాలలోనికి తీసుకు వెళ్ళినపుడు (నరకములో) రాగి గోళ్ళను కలిగి ఉండి వాటితో ముఖాలను, చాతీలను చీలికలు అయ్యేలా గీరుకుంటూ ఉన్న వారి గుంపును దాటుకుంటూ వెళ్ళినాను
Choose an available translation of this Hadeeth
Hadeeth text
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(ఇస్రా మరియు మేరాజ్ నాటి రాత్రి) నన్ను ఆకాశాలలోనికి తీసుకు వెళ్ళినపుడు (నరకములో) రాగి గోళ్ళను కలిగి ఉండి వాటితో ముఖాలను, చాతీలను చీలికలు అయ్యేలా గీరుకుంటూ ఉన్న వారి గుంపును దాటుకుంటూ వెళ్ళినాను. నేను ఇలా అడిగినాను: “ఓ జిబ్రయీల్! ఎవరు వీళ్ళు?” దానికి ఆయన ఇలా జవాబిచ్చినారు: “వీరు మనుషుల మాంసం తినడంతో సమానమైన చర్యలైన 'ప్రజల వీపు వెనుక (వారి పరోక్షంలో) వారి గురించి చెడుగా మాట్లాడుట, వారిపై అపనిందలు వేయుట' చేసేవారు.”
Explanation
Benefits
ప్రజల గురించి వారి పరోక్షంలో మాట్లాడుట, వారిపై అపనిందలు మోపుట అనేవి “ఘోరమైన పాపాలు” (కబాయిర్).
హదీథులో “వారు ముఖాలను ఛాతీలను చీలికలు అయ్యేలా గీరుకుంటూ ఉంటారు” అనే వాక్యంపై వ్యాఖ్యానిస్తూ అత్’తయ్యిబి రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “ముఖం మరియు ఛాతీని గీరుకోవడం అనేది ఏడుస్తున్న స్త్రీల లక్షణం కాబట్టి, ముస్లింలను తిట్టి, వారిపై అపవాదు వేసేవారికి ఇది శిక్షగా చేయబడింది. అవి పురుషుల లక్షణాలు కాదని, స్త్రీల లక్షణాలలో అత్యంత వికారమైన, మరియు అత్యంత వక్రీకరణ కలిగిన లక్షణాలు అని సంకేతంగా చెప్పబడింది.
అగోచర విషయాలను గురించి అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన ప్రతి విషయాన్ని విశ్వసించడం విధి (వాజిబ్).
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

