“(చనిపోయిన తరువాత) సమాధిలో ఒక ముస్లిం ప్రశ్నించబడినపుడు అతడు “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని సాక్ష్యమిస్తాడు
Choose an available translation of this Hadeeth
Hadeeth text
బరా ఇబ్న్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(చనిపోయిన తరువాత) సమాధిలో ఒక ముస్లిం ప్రశ్నించబడినపుడు అతడు “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మదర్రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అని సాక్ష్యమిస్తాడు. ఇది ఖుర్’ఆన్ లో అల్లాహ్ వాక్కు యొక్క వివరణ: “యుథబ్బితు ల్లాహుల్లదీన ఆమనూ బిల్’ఖౌలి థ్థాబితి ఫిల్ హయాతిద్దున్యా వఫిల్ ఆఖిరతి” (సూరహ్ ఇబ్రాహీం 14:27) [“మహోన్నతుడైన అల్లాహ్ ఈ వాక్యం ద్వారా విశ్వసించిన వారిని ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ దృఢంగా ఉంచుతాడు.”]
Explanation
Benefits
ఇహలోకంలో మరియు పరలోకంలో తన విశ్వాసులైన దాసులపై అల్లాహ్ అనుగ్రహం; ఎందుకంటే విశ్వాసి సమాధిలో ఇచ్చే సమాధానాన్ని (ఖుర్’ఆన్ లో) చేసిన దృఢమైన ప్రకటనతో పోలుస్తున్నాడు.
ఇందులో ‘తౌహీద్’ (అల్లాహ్ యొక్క ఏకత్వం) పట్ల సాక్ష్యమివ్వడం, మరియు అదే స్థితిలో మరణించడం యొక్క ఘనత తెలియుచున్నది.
అల్లాహ్ ఇహలోకంలో విశ్వాసిని తన విశ్వాసముపై (ఇస్లాం పై) మరియు ఋజుమార్గముపై స్థిరపరుస్తాడు; మరణంలో అతడిని ‘తౌహీద్’ పై స్థిరంగా ఉండేలా, మరియు సమాధిలో దైవదూతలు ప్రశ్నించినపుడు అందులోనూ స్థిరంగా ఉండేలా చేస్తాడు.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

