افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#3785[ప్రామాణికమైన హదీథు]
HadeethEnc · 1.29.0

“మీలో ఎవరైనా ఒక తాడు తీసుకుని, (అడవి నుండి) కట్టెలు కొట్టి, దానిని తన వీపుపై మోసుకు వెళ్ళి అమ్మడం మంచిది, దాని ద్వారా అల్లాహ్ అతని ముఖాన్ని కష్టాల నుండి కాపాడుతాడు, గౌరవాన్ని కాపాడుతాడు. ఇది ఎవరినైనా యాచించడం కన్నా మంచిది, అతడు మీకు ఇవ్వవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

అజ్’జుబైర్ ఇబ్న్ అల్ అవ్వామ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా ఒక తాడు తీసుకుని, (అడవి నుండి) కట్టెలు కొట్టి, దానిని తన వీపుపై మోసుకు వెళ్ళి అమ్మడం మంచిది, దాని ద్వారా అల్లాహ్ అతని ముఖాన్ని కష్టాల నుండి కాపాడుతాడు, గౌరవాన్ని కాపాడుతాడు. ఇది ఎవరినైనా యాచించడం కన్నా మంచిది, అతడు మీకు ఇవ్వవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు.
02

Explanation

ఏదైనా పని చేసి కష్టపడి సంపాదించే వ్యక్తి; ఉదాహరణకు తాడు తీసుకుని, అడివికి వెళ్ళి కట్టెలను కొట్టి, వీపుపై తీసుకువచ్చి వాటిని అమ్మి, ఆ సంపాదన నుండి తాను తింటూ, అందులో నుండి దానధర్మాలు చేస్తూ, ప్రజల నుండి స్వతంత్రంగా జీవించడం, ఆ విధంగా ప్రజలను యాచించడం వలన కలిగే అవమానం నుండి తనను తాను రక్షించుకోవడం అనేది ఎంతో గౌరవప్రదమైనది. ప్రజలను యాచించడం కంటే మంచిది. వారు ఇవ్వవచ్చు లేదా తిరస్కరించవచ్చు, అది అవమానకరం. విశ్వాసి ఎప్పుడూ గౌరవప్రదుడు, అవమానించబడడు.
03

Benefits

ఈ హదీథులో ప్రజలను యాచించరాదని, యాచించడం, బిచ్చమెత్తు కోవడం మొదలైన వాటి నుండి దూరంగా ఉండాలి అనే హిత బోధ ఉన్నది.
ఇందులో కష్టపడి సంపాదించడం వైపునకు ప్రోత్సాహం ఉన్నది, ఇతరుల దృష్టిలో అతడు చేస్తున్న పని సాధారణమైనది మరియు తక్కువస్థాయి వృత్తి అయినప్పటికీ.
ఇస్లాం యాచకత్వానికి (బిచ్చమెత్తడానికి) మరియు నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడు తున్నది; కనుక కష్టపడడం, పని చేయడం వైపునకు ప్రోత్సహిస్తుంది, అది కష్టతరమైన పనైనా సరే – ఉదాహరణకు: అడివికి వెళ్ళి కట్టెలు కొట్టి మోసుకురావడం.
కష్టపడి పనిచేసి తన జీవనోపాధి సంపాదించుకోగలిగిన సామర్థ్యం కలిగిన వారికి బిచ్చమెత్తుకోవడం తగదు.
అవసర పరిస్థితులలో పాలకుడిని అర్థించడం సరియైనదే. అల్లాహ్ ఇలా అంటున్నాడు: [మరియు ఎవరైతే నీవద్దకువచ్చి సవారీలు కోరినప్పుడు నీవు వారితో: ''నా దగ్గర మీకివ్వటానికి ఏ సవారీ లేదు.'' అని పలికి నప్పుడు, ఖర్చుచేయటానికి తమ దగ్గర ఏమీ లేదు కదా అనే చింతతో కన్నీరు కార్చుతూ తిరిగి పోయారో, అలాంటివారిపై కూడా ఎలాంటి నిందలేదు.] (సూరహ్ అత్’తౌబహ్ 9:92)
ఎవరైనా, పరిస్థితుల ప్రాబల్యం వలన, గత్యంతరం లేక యాచించవలసి వస్తే, జీవనోపాధి పొందలేకపోతే లేదా కట్టెలు కొట్టడం వంటి కష్టతరమైన పని చేయలేకపోతే, అటువంటి వారికి యాచించడానికి అనుమతి ఉన్నది. అయితే వారు ప్రజలను వెంటపడి అడగడం, ధర్మం చేయమని బలవంత పెట్టడం లాంటివి చేయరాదు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు: [“…వారు ప్రజలను పట్టుబట్టి అడిగేవారు కారు...”] (సూరహ్ అల్ బఖరహ్ 2:273)
ఇమాం అన్-నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ ఆయతు దానధర్మాలు చేయడాన్ని, సొంత శ్రమతో తినడాన్ని, మరియు అనుమతించబడిన మార్గాల ద్వారా జీవనోపాధిని పొందడాన్ని ప్రోత్సహిస్తున్నది.

Attribution

[అల్ బుఖారీ నమోదు చేసినారు:]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...