“ఓ హకీం! నిశ్చయంగా ఈ డబ్బు మధురమైన తాజా ఫలం వంటిది
Choose an available translation of this Hadeeth
Hadeeth text
హకీం ఇబ్న్ హిజామ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లంను కొంత డబ్బు అడిగాను, ఆయన దానిని నాకు ఇచ్చారు. తరువాత నేను ఆయనను మళ్ళీ అడిగాను, ఆయన దానిని నాకు ఇచ్చారు. తరువాత నేను ఆయనను మళ్ళీ అడిగాను, ఆయన మళ్ళీ నాకు ఇచ్చారు, మరియు ఆయన ఇలా అన్నారు: “ఓ హకీం! నిశ్చయంగా ఈ డబ్బు మధురమైన తాజా ఫలం వంటిది. ఎవరైతే అత్యాశలేని అంతరాత్మతో దానిని తీసుకుంటారో (సంపాదిస్తారో), అతని కొరకు అందులో ఆశీర్వాదము, శుభము ఉంటుంది. మరియు ఎవరైతే అత్యాశతో దానిని తీసుకుంటారో (సంపాదిస్తారో) అతనికి అందులో శుభము, ఆశీర్వాదము ఉండవు. అతడు ఎంత తిన్నా సంతృప్తి చెందని వంటి వాడు. పైన ఉండే చేయి, క్రింద ఉండే చేయి కంటే గొప్పది.” హాకిం రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్! ఎవరైతే మిమ్ములను సత్యముతో పంపినాడో ఆ అల్లాహ్ సాక్షిగా, (మీనుండి తీసుకున్నాను) ఇక మీ తరువాత, నేను ఈ ప్రపంచము నుండి వెళ్ళిపోయే వరకూ ఇంకెవరి నుండీ ఏమీ తీసుకోను.” తరువాత అమీరుల్ ము’మినీన్ అబూ బక్ర్ రదియల్లాహు అన్హు, హకీమ్ రదియల్లాహు అన్హుకు ఏమైనా ఇవ్వడానికి పిలిచే వారు, కానీ ఆయన ఏమీ తీసుకోకుండా నిరాకరించేవాడు. తరువాత ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అయనకు ఏమైనా ఇవ్వడానికి పిలిచే వారు. కానీ ఆయన ఏమీ తీసుకోకుండా నిరాకరించేవాడు. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ ముస్లిములారా! ఈ యుద్ధ సంపదలో అల్లాహ్ తనకు హక్కుగా ఇచ్చిన వాటాను నేను అతనికి అందించడానికి పిలిచాను. కానీ దానిని తీసుకోవడానికి అతడు నిరాకరించినాడు.” అలా హాకిం రదియల్లాహు అన్హు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత తాను మరణించేవరకు ఎవరి నుండి ఏమీ తీసుకోలేదు. అల్లాహ్ ఆయనపై కరుణ చూపుగాక.
Explanation
Benefits
ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప దాతృత్వాన్ని మరియు ఆయన గొప్ప ఔదార్యాన్ని వివరిస్తున్నది. ఇందులో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పేదరికానికి ఎప్పుడూ భయపడని వ్యక్తిలా దానం చేయడాన్ని చూస్తాము.
సహాయం అందించేటప్పుడు నిజాయితీగల సలహా ఇవ్వడం మరియు మీ సోదరులకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రయత్నించడం చేయాలి; ఎందుకంటే ఆ స్థితిలో ఆత్మ కరుణాపూరితమైన మరియు ప్రయోజనకరమైన మాటలను ఎక్కువగా గ్రహిస్తుంది.
ప్రజలను సహాయం అడగడం నుండి దూరంగా ఉండాలి, మరియు సహాయం అడగడం మానుకోవాలి; ముఖ్యంగా దాని అవసరం లేనప్పుడు.
ఇందులో సంపదపై దురాశ యొక్క ఖండన మరియు ఎక్కువ ప్రశ్నలు అడగడం కూడా ఉన్నాయి.
ఒక బిచ్చగాడు పట్టుబట్టి, వెంటపడి అడుగుతుంటే, అతన్ని తిరస్కరించడంలో, నిరాశపరచడంలో, అతనికి బుద్ధి చెప్పడంలో, మంచిగా ఉండమని, ఏదైనా తీసుకోవడంలో దురాశ పడకూడదని ఆజ్ఞాపించడంలో తప్పు లేదు.
పాలకుడు మంజూరు చేసిన తర్వాత తప్ప, బైతుల్-మాల్ (ప్రజా ఖజానా, ప్రభుత్వ ఖజానా) నుండి ఎవరికీ ఏమీ తీసుకునే హక్కు లేదు; అయితే, యుద్ధ సంపదగా సమీకరించిన వస్తువులను పంపిణీ చేయడానికి ముందు, దానిపై ఎవరికీ ఎటువంటి హక్కు లేదు.
అత్యవసర పరిస్థితులలో ఇతరులను అడగడం అనుమతించబడినదే.
ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇమామ్ (నాయకుడు) అర్థించే వ్యక్తికి, యాచించడం వల్ల కలిగే హానిని, అతని అవసరం తీరే వరకు అతనికి వివరించకూడదని దీని అర్థం, తద్వారా అతని ఉపదేశం ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే అతను తన అవసరాన్ని తీర్చకుండా నిరోధించడానికి ఇది ఒక కారణమని అతను అనుకోవచ్చు.
అలాగే ఇందులో హాకిం (రదియల్లాహు అన్హు) యొక్క ఘనతను చూడవచ్చు. అయన అల్లాహ్ మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు చేసిన వాగ్దానంపై తాను చనిపోయే వరకు స్థిరంగా నిలబడి ఉన్నారు.
ఇస్’హాఖ్ ఇబ్న్ రాహవైహ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “హాకిం (రదియల్లాహు అన్హు) చనిపోయినప్పుడు, సంపన్నులైన ఖురైషీయులలో ఆయన కూడా ఒకరిగా ఉన్నారు.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

