“నేను ఆయిషా రదియల్లాహు అన్హాను ఇలా ప్రశ్నించాను: “ఋతుస్రావ సమయములో తాను తప్పి పోయిన ఉపవాసాలను స్త్రీ తరువాత పూర్తి చేస్తుంది, కానీ తప్పిపోయిన నమాజులను పూర్తిచేయదు ఎందుకు?”
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ము’ఆదహ్ బింత్ అబ్దిల్లాహ్ అల్ అదవియ్యహ్ (సహాబాల తరువాత తరానికి అంటే తాబయీనుల తరానికి చెందిన స్త్రీ) ఉల్లేఖన: “నేను ఆయిషా రదియల్లాహు అన్హాను ఇలా ప్రశ్నించాను: “ఋతుస్రావ సమయములో తాను తప్పి పోయిన ఉపవాసాలను స్త్రీ తరువాత పూర్తి చేస్తుంది, కానీ తప్పిపోయిన నమాజులను పూర్తిచేయదు ఎందుకు?” దానికి ఆమె “నీవు హరూరియ్యహ్ స్త్రీవా?” అని ప్రశ్నించినారు. నేను: “నేను హరూరియ్యహ్ స్త్రీని కాను, కానీ ఆసక్తి కొద్దీ అడిగాను” అన్నాను. అపుడు ఆమె ఇలా అన్నారు: “మాకు అలా జరిగేది. అయితే తప్పిపోయిన ఉపవాసాలను పూర్తి చేయమని మేము ఆదేశించబడేవారము, కానీ (తప్పిపోయిన) నమాజులను పూర్తి చేయమని ఆదేశించబడే వారము కాము.”
Explanation
Benefits
‘హరురియా ప్రజలు’ కుఫా సమీపంలోని "హరురా" అనే పట్టణం పేరు మీదుగా అలా పిలువబడినారు: వారు ఖవారీజ్’లలో ఒక వర్గం; వ్యవహారాలలో హరురియా ప్రజల కఠినత్వం, వారి అనేక ప్రశ్నలు అడిగే తత్వము మరియు వారి మొండితనం కారణంగా ఆయిషా రదియల్లాహు అన్హా ఆ స్త్రీని వారితో పోల్చినారు.
ఏదైనా విషయములో బోధన మరియు మార్గదర్శకత్వం కోసం తనను అభ్యర్థించిన వారికి గురువు ఆ విషయాన్ని స్పష్టం చేయాలి.
ఖుర్ఆన్ లేదా హదీథులోని ఖచ్చితమైన వచనంతో ప్రతిస్పందించడం మంచిది, ఎందుకంటే ఆయిషా రదియల్లాహు అన్హా ప్రశ్నించిన స్త్రీ అడిగిన నిర్దిష్ట అర్థాన్ని ప్రస్తావించలేదు; వాస్తవానికి మూల వచనంతో సమాధానం ఇవ్వడం అభ్యంతరాలకు అవకాశం ఇవ్వదు.
దాని వెనుక ఉన్న వివేకం, జ్ఞానం అర్థం చేసుకోలేకపోయినా, అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడి సల్లల్లాహు అలైహి వ సల్లం ఆదేశాలను శిరసావహించాలి.
ఇమాం అల్-నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: ఆయిషా రదియల్లాహు అన్హా ప్రకటన యొక్క అర్థం ఏమిటంటే, ఖవారీజ్‌లోని ఒక వర్గం ఋతుక్రమంలో ఉన్న స్త్రీలు ఆ స్థితిలో తప్పిపోయిన నమాజులను తిరిగి ఆచరించాలని అంటుంది, ఇది వాస్తవానికి ముస్లిం సమాజపు ఏకాభిప్రాయానికి విరుద్ధం. ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఆ స్త్రీని అడిగిన ఈ ప్రశ్న తిరస్కరణకు సంబంధించిన ప్రశ్న, అంటే: ఇది హరురియా వర్గం వారి మార్గం మరియు ఇది ఎంతో చెడ్డ మార్గము.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

