افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#3447[ప్రామాణికమైన హదీథు]
HadeethEnc · 1.29.0

ఓ అబూ బకర్, ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఏమంటావు, ఎవరితోనైతే మూడవ వాడుగా అల్లాహ్ ఉంటాడో?

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

అబూ బక్ర్ అస్'సిద్దీఖ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “మేము (హిజ్రత్ ప్రయాణంలో) గుహలో ఉన్నప్పుడు, బహుదైవారాధకుల పాదాలు మా తలలకు దగ్గరలోనే ఉండటాన్ని నేను చూసి, నేను ఇలా అన్నాను: ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! వారిలో ఎవరైనా ఒకడు తన పాదాల వైపు చూస్తే, అతడి పాదాల దగ్గర మనం అతడికి కనబడతాము”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:"ఓ అబూ బకర్, ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఏమంటావు, ఎవరితోనైతే మూడవ వాడుగా అల్లాహ్ ఉంటాడో?"
02

Explanation

మక్కా నుండి మదీనాకు వలస వెళుతున్న (హిజ్రత్ చేస్తున్న) సందర్భములో అమీరుల్ ము’మినీన్ అబూ బక్ర్ అస్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: మేము థూర్ గుహలో (దాక్కుని) ఉన్నప్పుడు, బహుదైవారాధకులు గుహ పైభాగాన మా తలలకు సమీపంలో నిలబడి ఉండగా నేను వారి పాదాలను చూశాను. అపుడు నేను ఇలా అన్నాను, "ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! వారిలో ఎవరైనా తన పాదాల వైపు చూస్తే, అతను మనలను తన పాదాల దగ్గర చూడగలడు." దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, “ఓ అబూ బక్ర్! ఆ ఇద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటి, ఎవరితోనైతే అల్లాహ్ వారితో పాటు మూడవ వానిగా ఉండి వారికి విజయం, సహాయం, రక్షణ మరియు మార్గదర్శకత్వం అందిస్తూ ఉన్నట్లయితే.”
03

Benefits

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళినప్పుడు, తన కుటుంబాన్ని మరియు సంపదను విడిచిపెట్టి ఆయనతో పాటు వెళ్ళడంలో అబూ బకర్ సిద్ధిఖ్ రదియల్లాహు అన్హు యొక్క గొప్పతనం మరియు ఘనత స్పష్టమవుతున్నాయి.
అబూ బకర్ అస్-సిద్దిఖ్ రదియల్లాహు అన్హు కరుణ, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఆయనకున్న ప్రేమ మరియు శత్రువుల కంటిలో పడే ప్రమాదం వలన ఆయనలో కలిగిన భయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఏ విషయం లోనైనా తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం, అలా చేయడంలో జాగరూకతతో వ్యవహరించడం, తగినంత ఎక్కువగా కృషి చేయడం మొదలైనవన్నీ చేసి, ఆ తరువాత, అల్లాహ్ పై నమ్మకం ఉంచడం, ఆయన రక్షణ, సంరక్షణ పట్ల ఆయనపై సంపూర్ణమైన భరోసా ఉంచడం అవసరం.
తన ప్రవక్తలు మరియు మిత్రుల పట్ల (ఔలియాల పట్ల) అల్లాహ్ యొక్క శ్రద్ధ, మరియు వారికి విజయాన్ని ప్రసాదించడం ద్వారా వారిని రక్షించడం చూడవచ్చు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వాక్కు: [నిశ్చయంగా, మేము మా ప్రవక్తలకు మరియు విశ్వసించినవారికి ఇహలోకజీవితంలోనూ మరియు సాక్షులు నిలబడే రోజున కూడా సహాయము నొసంగుతాము.] (సూరహ్ గాఫిర్ 40:51)
అల్లాహ్ పై నమ్మకం ఉంచే వ్యక్తికి, సంపూర్ణమైన భరోసా ఉంచే వ్యక్తికి అల్లాహ్’యే చాలు, ఆయన అతనికి విజయం ప్రసాదిస్తాడు, సహాయం చేస్తాడు, కాపాడతాడు మరియు రక్షిస్తాడు అనేదానికి ఈ హదీథు ఒక నిదర్శనము.
తన ప్రభువుపై నమ్మకం, ఆయనపై ఆధారపడటం, ఆయనపై భరోసా ఉంచడం మరియు తన వ్యవహారాలను ఆయనకు అప్పగించడం మొదలైన విషయాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పరిపూర్ణతను ఇక్కడ చూడవచ్చు.
గుహలో ఇద్దరు మాత్రమే ఉండి, గుహపై భాగాన శత్రువులు తచ్చాడుతూ, వారి కొరకు తీవ్రంగా వెదుకుతూ ఉన్న పరిస్థితిలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ధైర్యం, మరియు హృదయాలకు, ప్రాణాలకు ఎలా భరోసా ఇచ్చుకున్నారో ఇందులో చూడవచ్చు
అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే, తన ధర్మాన్ని కాపాడుకునేందుకు, శత్రుభయంతో ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళడం (హిజ్రత్ చేయడం) సరియైనదే.

Attribution

[అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...