నేను మీలో నుండి ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకున్నాను అనే విషయం నుండి నన్ను నేను అల్లాహ్ ముందు విముక్తుణ్ణి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగానైతే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను తన ఆప్తమిత్రునిగా (ఖలీల్ గా) తీసుకున్నాడో, నన్ను కూడా అల్లాహ్ తన ఆప్తమిత్రునిగా తీసుకున్నాడు
Choose an available translation of this Hadeeth
Hadeeth text
జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ఇలా అన్నారు: “తాను చనిపోవడానికి ఐదు రాత్రులకు ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు “నేను మీలో నుండి ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకున్నాను అనే విషయం నుండి నన్ను నేను అల్లాహ్ ముందు విముక్తుణ్ణి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగానైతే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను తన ఆప్తమిత్రునిగా (ఖలీల్ గా) తీసుకున్నాడో, నన్ను కూడా అల్లాహ్ తన ఆప్తమిత్రునిగా తీసుకున్నాడు. ఒకవేళ నా సహచర సమాజం (ఉమ్మత్) నుండి నేను ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకోవాలని అనుకుంటే, నేను అబూబక్ర్ రజియల్లాహు అన్హును నా ఆప్త మిత్రునిగా చేసుకుని ఉండే వాడిని. తస్మాత్, జాగ్రత్త! మీకు పూర్వం గడిచిన తరాల వారు తమ ప్రవక్తల సమాధులను, మరియు సత్పురుషుల సమాధులను మస్జిదులుగా (సజ్దా చేసే స్థలాలుగా) చేసుకునేవారు. ఖబడ్దార్! మీరు సమాధులను మస్జిదులుగా చేసుకోకండి. నేను మిమ్ములను అలా చేయడం నుండి నిషేధిస్తున్నాను”.
Explanation
Benefits
సమాధులపై మస్జిదులు నిర్మించుట గతించిన తరాల వారి భ్రష్ఠకార్యాలలో ఒకటి అనే విషయం తెలుస్తున్నది.
సమాధులను ఆరాధనా గృహాలుగా చేసుకొనుట, వాటి వద్ద సలాహ్ (నమాజు) ఆచరించుట లేదా వాటి వైపు ముఖము చేసి సలాహ్ ఆచరించుట లేదా వాటిపై మస్జిదులను నిర్మించుట లేదా వాటిపై గుంబదులను నిర్మించుట ఇవన్నీ నిషేధించబడినవి. ఈ కారణాలలో ఏ ఒక్క దాని వలన నైననూ షిర్క్ లో (బహుదైవారాధనలో) పడిపోకుండా జాగ్రత్త వహించాలి.
ఇందులో సత్పురుషుల పట్ల గౌరవం విషయంలో హద్దుమీరిపోవడం అనేది ‘షిర్క్’నకు (బహుదైవారాధనకు) దారి తీస్తుందనే హెచ్చరిక ఉన్నది.
(తీవ్రమైన అనారోగ్యములో ఉండి కూడా) తన మరణానికి ఐదు దినముల ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీని గురించి ఇంతగా నొక్కి చెప్పడమనేది ఈ విషయం మన కొరకు ఎంత గంభీరమైన విషయమో తెలియ జేస్తున్నది.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

