افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم. افتتاح البرنامج الدعوي السبت القادم، ٩ / ٣ / ١٤٤٨هـ بعد صلاة الفجر مباشرة مسجد محمد بن إبراهيم، الجامعة الإسلامية بالمدينة المنورة فضيلة الشيخ د. هيثم بن محمد سرحان دورة اليوم الواحد، وختم كتاب كل سبت بإذن الله حياكم الله ونفع بكم.
#3303[ప్రామాణికమైన హదీథు]
HadeethEnc · 1.29.0

మీకు పూర్వం గతించిన ప్రజలలో ఒక రాజు ఉండేవాడు, అతని వద్ద ఒక ఆస్థాన మాంత్రికుడు ఉండేవాడు

Available translations

Choose an available translation of this Hadeeth

01

Hadeeth text

సుహైబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీకు పూర్వం గతించిన ప్రజలలో ఒక రాజు ఉండేవాడు, అతని వద్ద ఒక ఆస్థాన మాంత్రికుడు ఉండేవాడు, ఆ మాంత్రికుడు వృద్ధాప్యానికి చేరుకోవడంతో, అతడు తన రాజుతో ఇలా అన్నాడు: “నిశ్చయంగా నేను వృద్ధుడను అయ్యాను. నా వద్దకు ఒక యువకుడిని పంపించండి, నేను అతనికి నా మంత్రజాల విద్య నేర్పిస్తాను.” అపుడు రాజు ఆ మంత్రజాల విద్యను నేర్పేందుకు ఒక యువకుడిని మాంత్రికుని వద్దకు పంపాడు. ఆ యువకుడు మాంత్రికుడి వద్దకు వెళుతున్న దారిలో ఒక రాహిబ్ (ఏకదైవాధన చేసే ఒక అల్లాహ్ దాసుడు) ఉండేవాడు. ఆ యువకుడు ఆ రాహిబ్ దగ్గర కూర్చుని అతని మాటలు విన్నాడు. అతనికి ఆ రాహిబ్ మాటలు బాగా నచ్చాయి. తరువాత రోజులలో ఎప్పుడు అతడు ఆ మాంత్రికుని దగ్గరకు వెళ్ళుతున్నా, దారిలో ఆ రాహిబ్ వద్ద కొద్దిసేపు కూర్చుని, అతడి మాటలు వినేవాడు. ఆ కారణంగా మాంత్రికుని దగ్గరకు ఆలస్యంగా వెళ్ళేవాడు. ఆలస్యంగా వచ్చినందుకు ఆ మాంత్రికుడు అతడిని దండించేవాడు. దానితో, ఆ యువకుడు దీని గురించి రాహిబ్ కు తెలుపగా, ఆ రాహిబ్ అతనితో ఇలా అన్నాడు: నీవు మాంత్రికుడికి భయపడినప్పుడల్లా, మీ కుటుంబం నిన్ను ఆపిందని చెప్పు. మరియు నీవు నీ కుటుంబానికి భయపడినప్పుడల్లా, మాంత్రికుడు నిన్ను ఆపినాడని వారికి చెప్పు. ఆ యువకుడు (కొంతకాలం) అలాగే కొనసాగాడు. అప్పుడు ఒకసారి దారిలో ఒక పెద్ద, భయంకరమైన మృగం అతడికి కనిపించింది మరియు ప్రజలు భయంతో దానిని దాటుకుని వెళ్ళలేకపోవడం అతడు చూసాడు. అపుడు ఆ యువకుడు: “ఈ రోజు నాకు తెలిసిపోతుంది – ఆ మాంత్రికుడు గొప్పవాడో, లేక ఆ రాహిబ్ గొప్పవాడో” అని అనుకుని అతడు ఒక రాయిని చేతిలోనికి తీసుకుని ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! ఆ రాహిబ్ వ్యవహారం నీకు మాంత్రికుడి వ్యవహారం కంటే ప్రియమైనదైతే, ప్రజలు స్వేచ్ఛగా తిరగగలిగేలా ఈ జంతువును చంపు.” తరువాత అతను ఆ రాయిని దాని వైపు విసిరాడు. దానితో ఆ జంతువు చనిపోయింది. ప్రజలు (దారిలో స్వేచ్ఛగా) తిరగడం ప్రారంభించారు. అతను ఆ రాహిబ్ వద్దకు వచ్చి అతనికి జరిగిన విషయం చెప్పాడు. అపుడు రాహిబ్ ఇలా అన్నాడు: “కుమారా! ఈ రోజు నువ్వు నా కంటే ఉన్నతుడివి అయ్యావు. నీ వ్యవహారం త్వరలోనే నిన్ను విచారణకు గురిచేసే దశకు చేరుకుంది, ఒకవేళ నీవు విచారణను ఎదుర్కొంటే నా గురించి వారికి చెప్పకు.” తరువాత ఆ యువకుడు పుట్టుగుడ్డి వారికి, కుష్టు వ్యాధి వారికి మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు చికిత్స చేసేవాడు. రాజు దగ్గర పనిచేసే ఒకతను చూపు పోయి అంధుడిగా మారిపోయాడు. అతడు ఆ బాలుడి గురించి విన్నాడు. అతను ఆ బాలుని వద్దకు వచ్చి, అతని కొరకు చాలా బహుమతులు తెచ్చి ఇలా అన్నాడు: "నీవు నన్ను నయం చేస్తే ఈ బహుమతులన్నీ నీవే". దానికి ఆ బాలుడు ఇలా జవాబిచ్చాడు: "నేను ఎవరికీ నయం చేయను; అల్లాహ్ మాత్రమే ప్రజలను నయం చేస్తాడు. కాబట్టి, మీరు అల్లాహ్ ను విశ్వసించినట్లైతే, నేను మీ కొరకు ఆయనను వేడుకుంటాను (దుఆ చేస్తాను) మరియు ఆయన మిమ్మల్ని నయం చేస్తాడు". దానితో, అతను అల్లాహ్ ను విశ్వసించాడు, మరియు అల్లాహ్ అతన్ని నయం చేశాడు. తరువాత, అతడు రాజు వద్దకు వచ్చి తాను ముందు కూర్చున్న స్థానంలో కూర్చున్నాడు. రాజు అతనితో ఇలా అన్నాడు: "నీకు చూపును ఎవరు తిరిగి ఇచ్చారు?". అతడు ఇలా జవాబిచ్చాడు: "నా ప్రభువు!". అప్పుడు రాజు ఇలా అన్నాడు: "నేను కాకుండా నీకు మరొక ప్రభువు ఉన్నాడా?" ఆ సహచరుడు ఇలా అన్నాడు: "నీ ప్రభువు మరియు నా ప్రభువు అల్లాహ్’యే". రాజు అతడిని తీసుకెళ్లి విపరీతంగా హింసించాడు. దానితో అతడు ఆ యువకుడి గురించి చెప్పాడు. అపుడు ఆ యువకుడిని రాజు వద్దకు తీసుకువచ్చారు, రాజు అతనితో ఇలా అన్నాడు: "ఓ యువకుడా! నీ మంత్రవిద్య పుట్టుకతో వచ్చే అంధత్వం, కుష్టు వ్యాధి మరియు ఇతర వ్యాధులను నయం చేసేంత వరకు చేరుకుంది". దానికి ఆ యువకుడు ఇలా అన్నాడు: "నిజంగా, నేను ఎవరినీ నయం చేయను. అల్లాహ్ మాత్రమే నయం చేయగలడు." ఆ మాటలకు రాజు అతడిని విపరీతంగా హింసించాడు. దానితో అతడు రాహిబ్ గురించి చెప్పేసాడు. తరువాత రాహిబ్ ను రాజు వద్దకు తీసుకువచ్చారు, రాజు అతనితో ఇలా అన్నాడు: "నీ ధర్మాన్ని వదులుకో”. దానికి రాహిబ్ నిరాకరించాడు. రాజు ఒక రంపాన్ని తీసుకురమ్మని ఆఙ్ఞాపించాడు. అది తీసుకు వచ్చిన తరువాత దానిని రాహిబ్ తల మధ్యలో ఉంచి ఒక భాగం నేలపై పడిపోయే వరకు అతడి శరీరాన్ని నిలువుగా రెండు ముక్కలుగా చీల్చాడు. తరువాత రాజు ఆ సహచరుడిని తీసుకువచ్చి అతనితో ఇలా అన్నాడు: "నీ ధర్మం నుండి మరలిపో". అతను అలా చేయడానికి నిరాకరించాడు. రాజు ఆ రంపాన్ని అతని తల మధ్యలో ఉంచి, ఒక భాగం పడిపోయే వరకు నిలువుగా రెండు ముక్కలుగా చీల్చాడు. అప్పుడు ఆ బాలుడిని తీసుకువచ్చి అతనితో ఇలా అన్నాడు: "నీ ధర్మం నుండి మరలిపో". అతను అలా చేయడానికి నిరాకరించాడు. రాజు అతన్ని తన అనుచరులలో కొద్ది మందికి అప్పగించి, వారితో ఇలా అన్నాడు: అతన్ని ఫలానా పర్వతానికి తీసుకెళ్లండి; అతన్ని ఆ పర్వతం పైకి ఎక్కించండి మరియు మీరు దాని శిఖరానికి చేరుకున్నప్పుడు (అతని విశ్వాసాన్ని త్యజించమని అడగండి) కానీ అతను అలా చేయడానికి నిరాకరిస్తే, అతన్ని (పర్వతం నుండి క్రిందకు) విసిరేయండి. వారు అతన్ని తీసుకొని ఆ పర్వతం పైకి తీసుకు వెళ్ళారు, అపుడు ఆ యువకుడు ఇలా అన్నాడు: "ఓ అల్లాహ్! నీవు ఏ విధంగా ఇష్టపడితే ఆ విధంగా వారి నుండి నన్ను రక్షించు". దానితో పర్వతం కంపించడం ప్రారంభించింది మరియు వారందరూ పడిపోయారు. ఆ యువకుడు రాజు వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. రాజు అతనితో ఇలా అన్నాడు: “నీ వెంట వచ్చిన వారికి ఏమైంది?” అతను ఇలా అన్నాడు: “అల్లాహ్ నన్ను వారి నుండి రక్షించాడు.” రాజు మళ్ళీ అతనిని కొంతమంది సిబ్బందికి అప్పగించి ఇలా అన్నాడు: “అతన్ని ఒక చిన్న పడవలో తీసుకుని వెళ్ళండి, మీరు సముద్రం మధ్యలోకి చేరుకున్నప్పుడు (అతని ధర్మాన్ని త్యజించమని అడగండి), కానీ అతను తన ధర్మాన్ని త్యజించకపోతే అతన్ని నీటిలోకి విసిరేయండి”. వారు అతనిని పడవలో తీసుకుని వెళ్లారు. ఆ యువకుడు ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! వారి నుండి మరియు వారు ఏమి చేయాలనుకుంటున్నారో దాని నుండి నన్ను రక్షించు.” త్వరలోనే పడవ తిరగబడింది మరియు వారు మునిగిపోయారు. ఆ యువకుడు రాజు వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. రాజు అతనితో ఇలా అన్నాడు: “నీ వెంట వెళ్ళిన వారికి ఏమయ్యింది?” అతను ఇలా అన్నాడు: “అల్లాహ్ నన్ను వారి నుండి రక్షించాడు." మరియు అతను రాజుతో ఇలా అన్నాడు: “నేను చెప్పినట్లు చేస్తే తప్ప నువ్వు నన్ను చంపలేవు.” రాజు అడిగాడు: "అది ఏమిటి?" ఆ యువకుడు ఇలా అన్నాడు: "ప్రజలను ఒక ఎత్తైన ప్రదేశంలో సమావేశ పరచి, నన్ను ఒక చెట్టుకు కట్టివేయండి; తరువాత నా అంబుల పొది నుండి ఒక బాణం తీసుకొని ఇలా అనండి: “ఈ బాలుడి ప్రభువు అయిన అల్లాహ్ నామముతో (ఈ బాణాన్ని వదులుతున్నాను).” ఇలా చేస్తేనే, నీవు నన్ను చంపగలవు”. అపుడు రాజు ఆ యువకుడు చెప్పిన ప్రకారం చేసాడు. బాణాన్ని విల్లులో ఉంచి “ఈ బాలుని ప్రభు నామముతో (బాణాన్ని వదులుతున్నాను)” అంటూ బాణాన్ని వదిలాడు. ఆ బాణం యువకుడి కణతను తాకింది, ఆ యువకుడు తన చేతిని బాణం గాయంపై ఉంచి చనిపోయాడు. అది చూసి ప్రజలు (ఒక్కసారిగా) ఇలా ప్రకటించారు: “మేము ఆ యువకుడి ప్రభువును విశ్వసిస్తున్నాము! మేము యువకుడి ప్రభువును విశ్వసిస్తున్నాము! మేము యువకుడి ప్రభువును విశ్వసిస్తున్నాము!” అప్పుడు రాజుతో ఇలా అనబడింది: "ఏమి జరిగిందో మీరు చూశారా? మీరు భయపడినదే జరిగింది. అల్లాహ్ సాక్షిగా ప్రజలందరూ (ఆ యువకుడి ప్రభువును) విశ్వసించినారు. దానితో ఆ రాజు రహదారుల ప్రవేశ ద్వారాల వద్ద పెద్దపెద్ద గోతులు తవ్వమని ఆదేశించగా, అలా గోతులు తవ్వడం జరిగింది. వాటిలో మంటలు రాజేయబడ్డాయి. అప్పుడు రాజు ఇలా ఆదేశించాడు “ఎవరైతే నా ధర్మాన్ని విడిచి పెట్టారో వారిని ఈ మంటలలో త్రోసివేయండి, లేదా అలాంటి వాళ్ళని ఈ మంటల్లో దూకమని ఆదేశించండి.” వారు అలాగే చేసారు. అప్పుడు, ఒక స్త్రీ మరియు ఆమె పసిబిడ్డ వచ్చారు, ఆ స్త్రీ అగ్నిలో దూకటానికి కొంత సంకోచిస్తుండగా, ఆమె పసిబిడ్డ ఆమెతో ఇలా చెప్పింది: “అమ్మా! సహనం వహించు (అగ్నిలో దూకు), ఎందుకంటే నిజంగా, నీవు సత్యాన్నే అనుసరిస్తున్నావు”.
02

Explanation

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మన కంటే ముందుతరాలలో ఒక రాజు ఉండేవాడు మరియు అతని వద్ద ఒక ఆస్థాన మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడు ముసలివాడు అయినపుడు అతడు రాజుతో ఇలా అన్నాడు: “నేను ముసలి వాడిని అయిపోయాను. ఎవరైనా ఒక యువకుడిని నా వద్దకు పంపించండి, అతనికి ఈ మంత్రజాల విద్య నేర్పిస్తాను.” దానిపై రాజు ఒక యువకుడిని మంత్రజాల విద్య నేర్పించడానికి ఆ మాంత్రికుని వద్దకు పంపించినాడు. ఆ యువకుడు మాంత్రికుని వద్దకు ఎప్పుడు వెళ్ళుతున్నా దారిలో ఒక రాహిబ్ కూర్చుని ఉండటం చూసేవాడు. ఒకసారి ఆ యువకుడు రాహిబ్ వద్ద కొంచెంసేపు ఆగి, అతని ప్రక్కన కూర్చుని అతను చెప్పినదంతా విన్నాడు. అతనికి ఆ రాహిబ్ మాటలు బాగా నచ్చాయి. ఆ తరువాత అతడు ఎప్పుడు మాంత్రికుని దగ్గరకు వెళ్ళుతున్నా దారిలో ఆ రాహిబ్ వద్ద కూర్చొనేవాడు. ఆలస్యంగా వచ్చినందుకు ఆ మాంత్రికుడు అతడిని దండించేవాడు. ఆ యువకుడు రాహిబ్ కు ఈ విషయం గురించి చెప్పాడు. దానికి రాహిబ్ ఇలా అన్నాడు: “నీవు మాంత్రికుడిని గురించి భయపడుతున్నట్లైతే, మీ ఇంటివాళ్ళు ఆపినారు అని చెప్పు, మరి మీ ఇంటివాళ్ళను గురించి భయపడుతున్నట్లైతే ఆ మాంత్రికుడు ఆపినాడు అని చెప్పు.” ఇలా రోజులు గడుస్తుండగా, ఒకరోజు దారిలో ఒక పెద్ద, భయంకరమైన జంతువు కనిపించింది. అది ప్రజలను ఆ దారిపై నడవకుండా భయభ్రాంతులను చేస్తున్నది. అపుడు ఆ యువకుడు తనలో తాను ఇలా అనుకున్నాడు: “ఈ రోజు నేను తెలుసుకుంటాను ఆ మాంత్రికుడు గొప్పవాడో లేదా ఆ రాహిబ్ గొప్పవాడో." అతడు ఒక రాయిని చేతిలోనికి తీసుకుని: “ఓ అల్లాహ్! ఒకవేళ ఆ రాహిబ్ విషయం నీకు ఆ మాంత్రికుని విషయం కంటే అత్యంత ప్రియమైనది అయితే, ఈ జంతువును చంపి ప్రజలు ఈ దారిపై నడిచేలా చేయి” అంటూ ఆ రాయిని ఆ జంతువు పైకి విసిరాడు. దానితో అది చనిపోయింది. ప్రజలు ఆ దారిపై స్వేచ్ఛగా నడవసాగారు. తరువాత అతడు ఆ రాహిబ్ వద్దకు వచ్చి జరిగిన విషయం అతని తెలియజేసాడు. అపుడు ఆ సన్యాసి ఆ యువకునితో ఇలా అన్నాడు: ఉన్న “కుమారా! ఈ రోజు నీవు నాకంటే గొప్పవాడవు అయ్యావు. నేను ఏదైతే చూసినానో నీవు దానిని సాధించినావు. అనతి కాలములోనే నీవు పరీక్షకు గురిచేయబడతావు. ఒకవేళ నీవు పరీక్షకు గురిచేయబడితే నా పేరు బయట పెట్టకు.” తరువాత ఆ యువకుడు అల్లాహ్ అనుమతితో పుట్టుగ్రుడ్డివారిని, కుష్ఠు వ్యాధి రోగులను, ఇతర వాధిగ్రస్తులను నయం చేయసాగినాడు. రాజుగారి ఆస్థానములోని సహచరుడు ఒకడు కంటి చూపు కోల్పోయి గ్రుడ్డివాడైపోయాడు. అతడు ఆ యువకుని గురించి విన్నాడు. అతడు చాలా కానుకలతో ఆ యువకుని వద్దకు వచ్చి అతనితో ఇలా అన్నాడు: “నీవు ఒకవేళ నాకు నయం చేసినట్లైతే ఈ కానుకలన్నీ నీవే”. దానికి ఆ యువకుడు ఇలా అన్నాడు: “నేను ఎవరికీ నయం చేయను, అల్లాహ్’ మాత్రమే నయం చేయువాడు. ఒకవేళ నీవు అల్లాహ్’ను విశ్వసించినట్లైతే, నీకు నయం చేయమని నేను ఆయనను వేడుకుంటాను మరియు ఆయన నయం చేస్తాడు.” అతడు అల్లాహ్ ను విశ్వసించినాడు మరియు అల్లాహ్ అతనికి నయం చేసినాడు. తరువాత అతడు రాజు గారి వద్దకు వెళ్ళి ఆయన సభలో, అతడు సాధారణంగా ఎక్కడైతే కూర్చుంటాడో, అక్కడ కూర్చున్నాడు. అతడిని చూసి రాజు అతనితో ఇలా అన్నాడు: “నీ కంటి చూపు తిరిగి వచ్చేలా చేసింది ఎవరు?” అతడు ఇలా అన్నాడు: “నా ప్రభువు”. దానికి రాజు: “నేను కాక నీకు మరొక ప్రభువు కూడా ఉన్నాడా?” అతడు ఇలా అన్నాడు: “నా ప్రభువు మరియు నీ ప్రభువు కూడా అల్లాహ్’యే”. రాజు అతడిని తీసుకు వెళ్ళి తీవ్రంగా హింసించినాడు. చివరికి అతడు ఆ యువకుడి గురించి వెల్లడించినాడు. ఆ యువకుడు రాజు వద్దకు తీసుకు రాబడినాడు. రాజు అతనితో ఇలా అన్నాడు: “కుమారా! నీవు నేర్చుకున్న మంత్రజాలం పుట్టుగ్రుడ్డి, కుష్ఠు రోగములను నయం చేయడమేకాక ఇంకా నీవు అలా అలా చేసేవరకూ చేరుకుంది.” దానికి ఆ యువకుడు ఇలా అన్నాడు: “నేను ఎవరికీ స్వస్థత చేకూర్చను. స్వస్థత చేకూర్చేవాడు కేవలం అల్లాహ్’యే”. రాజు అతడిని కూడా తీసుకు వెళ్ళి తీవ్రంగా హింసించినాడు. చివరికి అతడు ఆ రాహిబ్ గురించి వెల్లడించినాడు. అపుడు ఆ రాహిబ్ తీసుకురాబడినాడు; అతడికి “నీ ధర్మాన్ని వదిలి వేయి” అని ఆదేశించబడింది. అతడు నిరాకరించినాడు. రాజు ఒక రంపాన్ని తెప్పించి అతడి తల మధ్యలో ఉంచి, అతడి శరీరాన్ని నిలువుగా రెండు ముక్కలుగా చీల్చినాడు. తరువాత రాజు యొక్క అనుచరుడు తీసుకు రాబడినాడు, అతనికి “నీ ధర్మాన్ని వదిలివేయి” అని ఆదేశించడం జరిగింది. దానికి అతడు నిరాకరించినాడు. అతని తల మీద కూడా రంపాన్ని ఉంచి అతడిని కూడా నిలువుగా రెండు ముక్కలుగా చీల్చడం జరిగింది. తరువాత ఆ యువకుడు తీసుకు రాబడినాడు. అతడిని కూడా అతని ధర్మాన్ని వదిలి వేయమని ఆదేశించడం జరిగింది. దానికి అతడు కూడా నిరాకరించినాడు. రాజు తన సహచరులలో ముగ్గురు నుండి పది మంది వరకు భటులను ఎన్నుకుని, వారికి అతడిని అప్పగించినాడు. వారితో రాజు ఇలా అన్నాడు: “ఇతడిని ఫలానా పర్వతం వద్దకు తీసుకు వెళ్ళండి, అతనితో పాటు పర్వతం మీదకు ఎక్కండి, ఒకవేళ తడు తన ధర్మాన్ని వదిలి వేయనట్లైతే అతడిని పర్వతం పై నుండి క్రిందకు విసిరివేయండి”. వారు అతడిని తీసుకుని వెళ్ళి అతనితో పాటు పర్వతం పై భాగానికి చేరుకున్నారు. ఆ యువకుడు ఇలా దుఆ చేసాడు: “అల్లాహుమ్మ అక్’ఫినీహిం బిమా షి’త” (ఓ అల్లాహ్, నువ్వు ఎలా కోరుకుంటే అలా (నీకు ఇష్టమైన విధంగా) నన్ను వీరి నుండి రక్షించు). దానితో పర్వతం కంపించి తీవ్రంగా కంపించింది; రాజు యొక్క అనుచరులు పర్వతం పైనుండి క్రిందకు పడిపోయారు. ఆ యువకుడు నడుచుకుంటూ రాజువద్దకు వెళ్ళాడు. రాజు అతడిని చూసి ఇలా అడిగాడు: “నీ వెంట వెళ్ళిన సహచరులకు ఏమైంది?” అతడు ఇలా అన్నాడు: “అల్లాహ్ వారి నుండి నన్ను రక్షించినాడు.” దానితో రాజు తన సహచరుల మరొక సమూహానికి అతడిని అప్పగించి వారితో ఇలా అన్నాడు: “ఇతడిని ఒక పడవలో సముద్రం మధ్యకు తీసుకు వెళ్ళండి. ఇతడు తన ధర్మాన్ని వదిలివేసినాడా సరే, లేకపోతే ఇతడిని సముద్రం లోనికి విసిరి వేయండి.” వారు అతడిని తీసుకెళ్లారు, అక్కడ అతను ఇలా దుఆ చేసాడు: “అల్లాహుమ్మ అక్’ఫినీహిం బిమా షి’త” (ఓ అల్లాహ్, నువ్వు ఎలా కోరుకుంటే అలా, (నీకు ఇష్టమైన విధంగా) వీరి నుండి నన్ను రక్షించు). అప్పుడు ఓడ తిరగబడింది మరియు వారు మునిగిపోయారు, మరియు అతను రాజు వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. రాజు అతడిని ఇలా అడిగాడు: “నీ వెంట వెళ్ళిన సహచరులకు ఏమైంది?” ఆ యువకుడు రాజుతో ఇలా అన్నాడు: “అల్లాహ్ వారి నుండి నన్ను రక్షించినాడు.” ఆ యువకుడు రాజుతో ఇంకా ఇలా అన్నాడు: “చూడు, నేను ఆదేశించిన విధంగా చేస్తే తప్ప నీవు నన్ను చంపలేవు”. రాజు అడిగాడు “అది ఏమిటి?” ఆ యువకుడు ఇలా అన్నాడు: “ప్రజలను ఒక ప్రధానమైన కూడలిలో సమావేశపరిచి, నన్ను ఒక చెట్టు కాండానికి సిలువ వేయి. తరువాత నా అంబులపొది నుండి ఒక బాణాన్ని తీసుకొని, ఆ బాణాన్ని వింటిలోనికి ఎక్కించి, “ఈ యువకుని ప్రభువు అయిన అల్లాహ్ నామమున (ఈ బాణం వదులు తున్నాను)” అని పలికి బాణాన్ని వదులు. అలా చేస్తేనే నీవు నన్ను చంపగలుగుతావు”. యువకుడు చెప్పిన విధంగానే రాజు ఒక ప్రధాన ప్రదేశములో ప్రజలందరినీ సమావేశపరిచినాడు. యువకుడిని ఒక చెట్టు కాండానికి శిలువ వేసినాడు. ఆ బాలుని అంబుల పొది నుండి ఒక బాణాన్ని తీసి విల్లు ఎక్కుపెట్టి ఇలా పలికినాడు: “ఈ యువకుని ప్రభువు అయిన అల్లాహ్ నామమున (ఈ బాణాన్ని వదులుతున్నాను)” అంటూ బాణాన్ని వదిలినాడు. ఆ బాణం సూటిగా వెళ్ళి ఆ యువకుని కన్ను మరియు చెవికి మధ్య కణతను తాకింది. ఎక్కడైతే బాణం తాకిందో అక్కడ కణతపై చేయి ఉంచి అతడు చనిపోయాడు. అంతే, అక్కడ గుమిగూడిన ప్రజలందరూ ఒక్కసారిగా “మేము ఆ యువకుడి ప్రభువును విశ్వసించినాము, మేము ఆ యువకుడి ప్రభువును విశ్వసించినాము, మేము ఆ యువకుడి ప్రభువును విశ్వసించినాము” అని ఎలుగెత్తి అన్నారు. అప్పుడు ఆ రాజుతో ఇలా అనబడింది: “చూసారా, మీరు దేని గురించి అయితే భయపడినారో, అదే జరిగింది." "అల్లాహ్ సాక్షిగా! నీవు భయపడిన విషయం నీ పట్ల నిశ్చయంగా జరిగిపోయింది. ప్రజలు ఆ యువకుడిని అనుసరిస్తారు; వారందరూ అతని ప్రభువును విశ్వసిస్తారు." అపుడు రాజు రహదార్ల ప్రవేశ ద్వారాల వద్ద మైదానంలో గొప్ప దీర్ఘచతురస్రాకార గుంటలను త్రవ్వమని ఆదేశించినాడు. ఆ తర్వాత ఆ గోతులలో అగ్నిమంటలు రాజేసి, 'ఎవరు తమ ధర్మాన్ని విడిచి పెట్టరో వారిని అందులో పడవేయండి' అని ఆదేశించాడు. వారు రాజు ఆజ్ఞాపించినట్లుగానే చేశారు. చివరగా ఒక స్త్రీ తన పసిబిడ్డతో వచ్చింది, ఆమె అక్కడే ఆగిపోయి, అగ్నిలో దూకడానికి వెనకాడింది. అప్పుడు ఆమె పసిబిడ్డ (అల్లాహ్ మహిమ వలన శిశువు అయినా మాట్లాడాడు) ఆమెతో ఇలా అన్నాడు: “ఓ అమ్మా! సహనం వహించు, నిశ్చయంగా నీవు సత్యమార్గముపైనే ఉన్నావు”.
03

Benefits

ధర్మపరుల (ఔలియా) ద్వారా అద్భుతాలు జరుగుతాయి అనడానికి ధృవీకరణ ఉంది ఇందులో - వాటిలో: యువకుడు చిన్న రాయితో పెద్ద మృగాన్ని చంపడం, యువకుడి ప్రార్థనకు రెండుసార్లు సమాధానం రావడం మరియు చివరికి తల్లితో పాటు ఉన్న పసిబిడ్డ మాట్లాడటం.
ఎవరైతే అల్లాహ్ పై ‘తవక్కుల్’ (సంపూర్ణమైన నమ్మకం) ఉంచుతారో వారికి విజయం తప్పకుండా లభిస్తుంది.
ఇందులో సహనం వహించడం మరియు ధర్మములో నిబద్ధత కలిగి ఉండడం యొక్క ఘనత, గౌరవము ఉన్నాయి.
చిన్నవయసులో నేర్చుకోవడం వెనుక ఉన్న వివేకము ఏమిటంటే, చిన్నపిల్లలు తరచుగా పెద్దవారి కంటే త్వరగా నేర్చుకుంటారు, చాలా బాగా గుర్తుంచుకుంటారు.
ఇందులో ఆ యువకుడి విశ్వాసపు (ఈమాన్) బలము కనిపిస్తుంది; ఎందుకంటే అతడు తన విశ్వాసము నుండి ఎన్నడూ తొలగిపోలేదు, మారిపోలేదు.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పేదవారు, అగత్యపరులు తనను వేడుకున్నప్పుడు వారి ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు.
ముస్లింల గొప్ప ప్రయోజనం కోసం ఒక వ్యక్తి తనను తాను ప్రమాదంలో పడవేసుకోవడం అనుమతించదగినది. ఈ హదీథులో యువకుడు రాజుకు తనను ఏ విధంగా చంపవచ్చునో ఆ పద్ధతిని సూచించి తన మరణానికి తానే కారణమయ్యాడు - తన అంబుల పొది నుండి బాణాన్ని తీసుకొని, విల్లు మధ్యలో ఉంచి “ఈ యువకుడి ప్రభువైన అల్లాహ్ నామముతో” అని పలికి బాణాన్ని వదలడం ద్వారా తనను చంపవచ్చు అని సూచించినాడు.
యుద్ధంలో మరియు యుద్ధం లాంటి ప్రమాదకరమైన భయంకర పరిస్థితులలో అబద్ధం చెప్పడానికి మరియు విధ్వంసం నుండి తనను తాను రక్షించుకోవడానికి అనుమతి ఉన్నది.
ఒక విశ్వాసి తన విశ్వాసములో అతని నిజాయితీ మరియు సత్యా పలకడంలో అతని దృఢత్వం మరియు నిబద్ధత మొదలైన వాటి ద్వారా పరీక్షించబడతాడు, అది అతని స్వంత మరణానికి దారితీసినప్పటికీ.
అల్లాహ్ వైపు పిలవడం మరియు సత్యాన్ని వ్యక్తపరచడం, తేటతెల్లం చేయడం కొరకు స్వంత ప్రాణం త్యాగం చేయవలసి వచ్చినా తప్పకుండా చేయాలి.
దాసుల హృదయాలు అల్లాహ్ చేతిలో ఉన్నాయి - ఆయన తాను కోరిన వారిని సన్మార్గంలో నడిపిస్తాడు మరియు తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదిలివేస్తాడు. ఎందుకంటే నిజానికి, ఆ యువకుడు మాంత్రికుడి సంరక్షణలో మరియు శపించబడిన రాజు పర్యవేక్షణలో ఉన్నప్పటికీ సన్మార్గంలోనే ఉన్నాడు.
ఒక దాసుడు సత్యాన్ని గుర్తించి నిశ్చయతను పొందగలిగేలా ఒక సంకేతాన్ని తనకు చూపించమని సర్వశక్తిమంతుడైన అల్లాహ్’ను అడగడం అనుమతించబడుతుంది.
విశ్వాసంపై ఉన్నవారు అల్లాహ్ వారికి ప్రసాదించిన ప్రతిదాన్ని ఆయన ధర్మము యొక్క సేవలో మరియు ప్రజలను ఆయన మార్గం వైపు పిలవడంలో ఉపయోగించుకుంటారు.
విధ్వంసానికి కారణాలు అల్లాహ్ చేతుల్లోనే ఉంటాయి. ఆయన కోరుకుంటే, వాటిని అమలు చేస్తాడు, మరియు ఆయన కోరుకుంటే, వాటిని విడిచి పెడతాడు.
అవిశ్వాసులు అల్లాహ్’ను విశ్వసించడానికి వారి దగ్గర ఆధారాల కొరత ఏమీ లేదు;వాస్తవానికి, వారి అవిశ్వాసానికి కారణం మొండితనం, మూర్ఖత్వం మరియు అహంకారం.
నిరంకుశులు మరియు అణచివేతదారులు, దౌర్జన్యపరులు తాము అనుభవించే ప్రాపంచిక సుఖాలను కొనసాగించడానికి మానవాళిని చంపడానికైనా సిద్ధపడతారు.
అల్లాహ్ దుర్మార్గులను వారు ఊహించని వైపు నుండి శిక్షిస్తాడు. ఎందుకంటే, ఆ యువకుడి విశ్వాసములో దృఢత్వం, అతని పిలుపులోని సత్యం, అల్లాహ్ పట్ల అతని నిర్భయ భక్తి మరియు ఏ బెదిరింపును పట్టించుకోకపోవడం చూసినప్పుడు ప్రజలు అతని ప్రభువును విశ్వసించారు.
ఈసా (అలైహిస్సలాం) మాత్రమేగాక ఊయలలో ఉండి పసితనంలోనే మాట్లాడిన మరికొందరు ఉన్నారు. ఈ హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క "ఊయలలో ముగ్గురు తప్ప మరెవరూ మాట్లాడలేదు..." అనే ప్రకటనను వివరిస్తుంది: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారెవరో పేర్కొని, ఊయలలో ఉండి, బాల్యంలో మాట్లాడిన ఈ అద్భుతాన్ని ఇశ్రాయీలు సంతతికి మాత్రమే పరిమితం చేసినారు.

Attribution

[ముస్లిం నమోదు చేసినారు:]

Categories

Share

Share hadeeth

Sharing options · 0 Total shares

Share

← Back to encyclopedia
Shopping Basket

Loading...