ఒక ముస్లిం తోటి ముస్లిం సోదరుని పరోక్షములో అతని కోసం చేసే దుఆకు సమాధానం లభిస్తుంది
Choose an available translation of this Hadeeth
Hadeeth text
ఉమ్మె అద్’దర్దా మరియు అబూ అద్’దర్దా రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచూ ఇలా పలుకుతూ ఉండేవారు: "ఒక ముస్లిం తోటి ముస్లిం సోదరుని పరోక్షములో అతని కోసం చేసే దుఆకు సమాధానం లభిస్తుంది. ప్రతి ముస్లిం తల వద్ద అతని కొరకు నియమించబడిన ఒక దైవదూత ఉంటాడు. ఆ ముస్లిం తోటి ముస్లిం సోదరుడి మంచి కొరకు దుఆ చేసినప్పుడల్లా, అతని కొరకు నియమించబడిన దైవదూత ఇలా అంటాడు: “ఆమీన్, ఇదే మంచిని అల్లాహ్ మీకు కూడా ప్రసాదించు గాక."
Explanation
Benefits
వారి వీపు వెనక వారి మంచి కొరకు దుఆ చేయడం అనేది విశ్వాసం మరియు సోదరభావం యొక్క నిజాయితీని స్పష్టంగా ప్రదర్శిస్తుంది.
దుఆను వారి సమక్షంలో లేనప్పుడు వారి కొరకు చేయడానికే పరిమితం చేయడం, మీ నిజాయితీని మరియు వారి పట్ల మీ హృదయం ఎప్పుడూ హాజరుగా ఉండడాన్ని మరింత ప్రభావవంతంగా ప్రదర్శిస్తుంది.
దులు స్వీకరించబడటానికి ఒక కారణం ఏమిటంటే, ఒక ముస్లిం తన సోదరుడు తన దగ్గరగా లేనప్పుడు అంటే అతని పరోక్షములో అతని కోసం ప్రార్థించడం.
ఇమాం అన్-నవవి రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: "ఒక ముస్లిం సోదరుడు తన దగ్గరగా లేనప్పుడు అతని కోసం దుఆ చేయడంలో ఒక ఘనత ఉన్నది. ఒక్కరి కొరకు మాత్రమే కాకుండా, ఎవరైనా ముస్లింల సమూహం కొరకు లేదా ముస్లిం సమాజం కొరకు దుఆ చేసినా, ఈ పుణ్యం లభిస్తుంది. అలాగే అందరు ముస్లింల కొరకు ఎవరైనా వేడుకుంటే (దుఆ చేస్తే) కూడా, ఈ ఘనత లభిస్తుంది." పూర్వ ముస్లింలలో కొందరు తమ స్వయం కొరకు దుఆ చేయాలని అనుకున్నపుడు, వారు తోటి ముస్లిం సోదరుని కొరకు కూడా ఆ దుఆ చేసేవారు, ఎందుకంటే ఆ దుఆకు సమాధానం ఇవ్వబడుతుంది మరియు ఆ కారణంగా తమకు కూడా అదే ప్రసాదించబడుతుంది అని.
ఈ హదీథులో దైవదూతలకు నిర్దేశించబడిన కొన్ని పనుల యొక్క వివరణ ఉన్నది. మరియు వారిలో కొందరు హదీథులో చెప్పబడిన ఈ పని కొరకు నియమించబడినారు అని అర్థమవుతున్నది.
Attribution
Categories
Share hadeeth
Sharing options · 0 Total shares

